‘బీసీలకు చంద్రబాబు చేసినంత అన్యాయం ఎవరూ చేయలేదు’ | Minister Sidiri Appalaraju Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘బీసీలకు చంద్రబాబు చేసినంత అన్యాయం ఎవరూ చేయలేదు’

Published Tue, Feb 21 2023 6:31 PM | Last Updated on Tue, Feb 21 2023 6:38 PM

Minister Sidiri Appalaraju Slams Chandrababu Naidu - Sakshi

శ్రీకాకుళం:  బీసీలకు చంద్రబాబు నాయుడు చేసినంత అన్యాయం ఎవరూ చేయలేదని మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శించారు. బీసీలను అత్యంత అవమానానికి గురిచేసిన వ్యక్తి చంద్రబాబేనని మండిపడ్డారు మంత్రి. ప్రస్తుత వైస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఏ విధంగా సామాజిక న్యాయం జరుగుతుందో ఎమ్మెల్సీ అభ్యర్థులను చూస్తే అర్ధమౌతుందని,  సింహభాగం వెనుబడినవారే ఎమ్మెల్సీలుగా ఉన్నారన్నారు.  వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇచ్చినంత ప్రాధాన్యం గతంలో ఎవరూ ఈ వర్గాలకు ఇవ్వలేదన్నారు.

‘లోకేష్ వడ్డేరాలను అణగద్రోక్కేస్తున్నామంటున్నారు. మిష్టర్ మాలోకం..  వడ్డేరాలకు ఎమ్మెల్సీ ఇచ్చి  చట్టసభల్లో కూర్చో పెడుతున్నాం.  మీ నాన్న బీసీలకు ఎంత అన్యాయం చేశాడో చూడు. బలహీనవర్గాలను అవమానించిన వ్యక్తి చంద్రబాబు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను చంద్రబాబు అణగొక్కారు. గతంలో బీసీలకు చంద్రబాబు ఏం చేశారో లోకేష్‌ చెప్పాలి.  ఇంగ్లిష్‌ మీడియాన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు కోర్టుకు వెళ్లలేదా?, సిగ్గులేని రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌ చంద్రబాబు.  రాబోయే ఎన్నికలు పేదవాడికి, పెత్తందారీ వ్యవస్థకు మధ్య జరిగే ఎన్నికలు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును మట్టికరిపించాలి’ అని ప్రజలకు పిలుపునిచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement