
తుపాను బాధితులకు వైసీపీ ఎంపీల 2 నెలల జీతం
సాక్షి, హైదరాబాద్: విశాఖ బాధితులకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(వైసీపీ) ఎంపీలు బాసటగా నిలిచారు. ఆ పార్టీ ఎంపీల 2 నెలల జీతాన్ని హుదూద్ తుపాను బాధితులకు విరాళంగా ఇస్తున్నట్లు నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మంగళవారం ప్రకటించారు.
తుపాను బాధితులకు అందాల్సిన ఆహారం, వైద్య సదుపాయాలు వెంటనే అందేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతక్షణ సాయం కింద వెయ్యి కోట్ల రూపాయలు ప్రకటించినందుకు హర్షం వ్యక్తం చేశారు.