
తుఫాను నష్టం వివరాలు ఇవీ..
తుఫాను కారణంగా మొత్తం 26 మంది మరణించారని, 146 మందిని సహాయక బృందాలు కాపాడాయని అధికారులు చెప్పారు.
హుదూద్ తుఫాను కారణంగా సంభవించిన మొత్తం నష్టం వివరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. తుఫాను కారణంగా మొత్తం 26 మంది మరణించారని, 146 మందిని సహాయక బృందాలు కాపాడాయని అధికారులు చెప్పారు. 7806 ఇళ్లు ధ్వంసం అయ్యాయని, 219 చోట్ల రోడ్లు, రైలుపట్టాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు.
మొత్తం 8301 కరెంటు స్తంభాలు కూలిపోగా, 19 చోట్ల కాల్వలకు గండ్లు పడ్డాయి. 181 బోట్లు గల్లంతయ్యాయి. 3368 పశువులు మృతి చెందాయి. తుపాను ప్రభావం మొత్తం 2 కోట్ల మందిపై పడిందని, 223 రిలీఫ్ క్యాంపులు, 223 వైద్య శిబిరాలు ఏర్పాటుచేశామని అధికారులు ఓ ప్రకటనలో వివరించారు.