Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Turkish Firm Operating At Indian Airports Loses Security Clearance1
టర్కీకి భారత్ ఫస్ట్ స్ట్రోక్.. ఇక సర్దేసుకోవడమే!

న్యూఢిల్లీ: పాకిస్తాన్ పై ఉగ్రవాదంపై పోరులో ఆపరేషన్ సిందూర్ ను భారత్ చేపట్టగా, దానికి వ్యతిరేకంగా పని చేసింది టర్కీ(తుర్కియే). ఇక్కడ ప్రత్యక్షంగా పాకిస్తాన్ కు సాయం చేసి భారత్ ను దెబ్బ కొట్టాలని యత్నించింది. పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లలో సింహ భాగం టర్కీకి చెందినవే కావడమే కాకుండా, ఆ డ్రోన్లకు ఆపరేటర్లను కూడా సప్లై చేసింది టర్కీ. ఇది భారత్ కు మరింత కోపం తెప్పించింది. టర్కీ నుంచి ఏమైనా డ్రోన్లను కొనుగోలు చేశారా అని తొలుత భావించినా, ఆ డ్రోన్ల ఆపరేటర్లు కూడా ఆ దేశానికే చెందిన వారే కావడంతో వారి పన్నాగం బయటపడింది.దాంతో టర్కీపై విమర్శలు వెల్లువెత్తాయి. వరదల సమయంలో ఏ దేశం కూడా సాయం చేయడానికి ముందుకు రాకపోతే భారత్ వారికి ఆపన్న హస్తం అందించింది. దానిని మరిచిపోయి మన వేలితో మనల్నే పొడాలని చూసింది టర్కీ. ఇప్పుడు టర్కీకి బుద్ధి చెప్పే సమయం వచ్చేసింది.సెక్యూరిటీ క్లియరెన్స్‌ అనుమతులు రద్దు..!భారతదేశంలోని తొమ్మిది ప్రధాన విమానాశ్రయాలలో సింహభాగాన్ని నిర్వహిస్తున్న టర్కిష్ సంస్థ తన భద్రతా అనుమతిని కోల్పోయింది. ఈ రోజు(గురువారం) సాయంత్రం భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ టర్కీకి చెందిన సంస్థకు అనుమతులు రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. జాతీయ భద్రత దృష్ట్యాసెలెబి గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ భద్రతా అనుమతిని తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.ఇప్పటివరకూ ఉన్న పరిస్థితి ఇది..!భారత్‌లోని పలు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా అంశాల్లో కూడా తుర్కియే పరోక్షపాత్ర ఉంది. .వాటిలో కార్గో హ్యాండ్లింగ్‌ వంటి కీలక కాంట్రాక్టులను తుర్కియేకు చెందిన సెలెబీ ఏవియేషన్‌ కంపెనీ చెందిన అనుబంధ సంస్థ సంపాదించింది. భారత్‌లో 2008 నుంచి ఈ సంస్థ సేవలందిస్తోంది. ఏటా 58,000 విమానాలు, 5.4 లక్షల టన్నుల సరకు రవాణా బాధ్యతలను చూసుకుంటోంది. అందులో 7,800 మంది సిబ్బంది ఉన్నారు.హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, గోవా, కొచ్చిన్, కన్నూర్‌ వంటి కీలక విమానాశ్రయాల్లో హై సెక్యూరిటీ బాధ్యతలు సెలెబీవే! గ్రౌండ్‌ హ్యాండ్లింగ్, కార్గో మేనేజ్‌మెంట్, ఎయిర్‌సైడ్‌ ఆపరేషన్స్‌ విధులను ఈ సంస్థే చూస్తోంది. విమానాలను నిలిపి ఉంచే హై సెక్యూరిటీ జోన్, ఎయిర్‌సైడ్‌ జోన్లన్లా సంస్థ సిబ్బందే విధుల్లో ఉంటున్నారు. ప్రయాణికుల బ్యాగులు, కార్గో పనులను చూసుకునేదీ వాళ్లే. అంతర్జాతీయ సర్వీసుల్లో కూడా ఈ బాధ్యతలను వీళ్లకే అప్పగించారు. తాజా పరిణామాల నేపథ్యంలో దీనిపై ఆందోళనలు చోటు చేసుకున్నాయి. దాంతో భారత ప్రభుత్వం.. చర్యలు చేపట్టి ఆ సంస్థకు చెందిన అనుమతులను రద్దు చేసింది. ఇది తుర్కియేగా పిలువబడుతున్న టర్కీకి భారత్‌ ఇచ్చిన తొలి స్ట్రోక్‌.

Amir Nazir Wani Mother Asks Him to Surrender via Video Call2
ఉగ్రవాది కథ.. తల్లి ప్రేమ వద్దంది.. యమలోకం రమ్మంది!

శ్రీనగర్‌: ఆపరేషన్‌ సిందూర్‌ (operation sindoor) తర్వాత జమ్మూకశ్మీర్‌ (jammu and kashmir)లో ఉగ్రవేట మళ్లీ జోరందుకుంది. రెండురోజుల్లో ఆరుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. మొన్న సోపియాన్‌లో ముగ్గురు లష్కరే తోయిబా ముష్కరులను ఎన్‌కౌంటర్‌ చేసింది. తాజాగా పుల్వామాలో ముగ్గురు జైహే మహ్మద్‌ ఉగ్రవాదులు హతమయ్యారు. త్రాల్‌లో జరిగిన ఓ ఎన్‌ కౌంటర్‌లో డ్రోన్‌ చిత్రీకరించిన వీడియోలో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.అయితే, వీరిలో ఉగ్రవాది ఆమిర్ నజీర్ వని ఎన్‌కౌంటర్‌కు కొన్ని నిమిషాల ముందు తన తల్లి ఫోన్‌ చేశాడు. వారి మధ్య జరిగిన భావోద్వేగ సంభాషణ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది.📞 ఆమీర్‌ నజీర్ వని,అతని తల్లికి మధ్య జరిగిన వీడియోకాల్‌ సంభాషణ:ఆమీర్: ఏకే 47 పట్టుకుని.. అమ్మా... నువ్వు ఎలా ఉన్నావు? తల్లి (ఎడుస్తూ): బేటా, నీవెక్కడ ఉన్నావు?"ఆమీర్: ఇక్కడ ఓ బిల్డింగ్‌ బేస్మెంట్‌లో దాక్కున్నాను. భద్రతా బలగాలు దగ్గరకు వస్తున్నాయి తల్లి: బేటా, వాళ్లకి లొంగిపో.. ప్రాణాలు కాపాడుకో.. నిన్ను చూడాలని ఉందిఆమీర్: తల్లి మాటలు పట్టించుకోలేదు. ‘ఆర్మీని ముందుకు రానివ్వండి… వారి సంగతి చూస్తా’ అంటూ ఫోన్‌ కట్‌ చేశాడు.అనంతరం,ఆసిఫ్ అహ్మద్ షేక్ సోదరికి వీడియో కాల్ చేశాడు. ఆమె తన సోదరుడు ఆసిఫ్ అహ్మద్ షేక్ గురించి ఆరా తీసింది. ఆసిఫ్‌ తన వద్దే ఉన్నాడని చెప్పాడు. అది విన్న ఆమె భయ్యా మీరంతా లొంగిపోయి ప్రాణాలు కాపాడుకోండి అని చెప్పగా.. నవ్వాడు. తామే ఆర్మీ పని పడుతామంటూ వివరించాడు. వీడియో కాల్‌ చేసిన కొద్ది సేపటికే భారత భద్రతా బలగాలు డ్రోన్‌ సాయంతో బేస్‌మెంట్‌లో నక్కిన ఉగ్రవాదుల్ని హతమార్చాయి.Mother pleads son Amir Nazir Wani, a Jaish-e-Mohammed (#JeM) terrorist to surrender before the Tral encounter began. He spoke to his mother and sister. #encounter #tral #pulwama #jammuandkashmir pic.twitter.com/t18ZsqDs7f— Madhuri Adnal (@madhuriadnal) May 15, 2025 గురువారం ఉదయం త్రాల్‌ ప్రాంతంలో నదీర్‌ గ్రామంలో ముష్కరులు నక్కినట్లుగా భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో బలగాలు కార్డన్‌ సెర్చ్‌ చేపట్టాయి. ఈ క్రమంలో కొన్ని గంటలపాటు హోరాహోరీగా ఎదురు కాల్పులు జరిగాయి. ఎట్టకేలకు ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు అసిఫ్‌ అహ్మద్‌ షేక్‌,ఆమీర్‌ నజీర్‌ వని, యావర్‌ అహ్మద్‌ భట్గా హతమయ్యారు. ఈ కాల్పులు జరిగే సమయంలో ఉగ్రవాది ఆమీర్‌ నజీర్‌ వని నిర్మాణంలో ఉన్న బేస్మెంట్‌లోకి వెళ్లి దాక్కున్నాడు. అయితే, అతడి ఆచూకీ కనుగొనేందుకు భద్రతా బలగాలు డ్రోన్‌ కెమెరాల్ని రంగంలోకి దించాయి. ఉగ్రవాది ఒక పిల్లర్‌ చాటున నక్కినట్లుగా దీనిలో స్పష్టంగా కనిపిస్తోంది. డ్రోన్‌ విజువల్ సాయంతో దళాలు అతన్ని మట్టుపెట్టాయి. ఈ ముగ్గురు ఉగ్రవాదులు జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా ప్రాంతానికి చెందిన వారే.

Tamil Nadu GDP is Now Greater Than The GDP of Pakistan3
ఇదీ పాకిస్తాన్‌ పరిస్థితి..!

పాకిస్తాన్ ఆర్ధిక వ్యవస్థను చూసి.. ప్రపంచ దేశాలే జాలిపడుతున్నాయి. ఒకప్పుడు తమిళనాడు, మహారాష్ట్ర వంటి భారతీయ రాష్ట్రాల కంటే ముందున్న దాయాది దేశం (పాకిస్తాన్) ఆర్థిక స్థితి గత రెండు దశాబ్దాలుగా గణనీయంగా తగ్గినట్లు కనిపిస్తోంది. తమిళనాడు జీడీపీ ఇప్పుడు పాకిస్తాన్ జీడీపీని దాటేసినట్లు కొత్త డేటా ద్వారా తెలుస్తోంది.పాకిస్తాన్ జీడీపీ కంటే తమిళనాడు జీడీపీ ఇప్పుడు ఎక్కువగా ఉంది. పాకిస్తాన్ జనాభా తమిళనాడు జనాభా కంటే మూడు రెట్లు ఎక్కువ. అంతే కాకుండా తమిళనాడులోని ఒక వ్యక్తి సంపాదన.. పాకిస్థాన్‌లోని ఒక వ్యక్తి సంపాదన కంటే మూడు రెట్లు ఎక్కువ. ఉగ్రవాదాన్ని, కాశ్మీర్ వివాదాన్ని మానుకుని.. ఆర్ధిక అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, విద్య వంటి వాటిపై ద్రుష్టి పెట్టాలి. ఉగ్రవాద గ్రూపులకు మద్దతు ఇవ్వడం ఆపేయాలి. అప్పడే మీ దేశం బాగుపడుతుందని నౌక్రీ.కామ్ ఫౌండర్ సంజీవ్ బిఖ్‌చందానీ వెల్లడించారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గమనిస్తే.. 1995లో తమిళనాడు జీడీపీ 15.7 బిలియన్ డాలర్ల వద్ద, పాకిస్తాన్ జీడీపీ 57.9 బిలియన్ డాలర్ల వద్ద ఉంది. కాగా 2025 నాటివి తమిళనాడు జీడీపీ 419.5 బిలియన్ డాలర్లు (రూ. 35.8 లక్షల కోట్లు) కాగా.. పాకిస్తాన్ జీడీపీ 397.5 బిలియన్ డాలర్లు (రూ. 33.9 లక్షల కోట్లు).ఇదీ చదవండి: అమెరికా, చైనా డీల్: ఒక్కసారిగా తగ్గిన బంగారం ధరలుసోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో.. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. భారతీయులు తమ గర్వాన్ని చాటుకుంటూ.. పాకిస్థాన్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు అని యూజర్ వెల్లడించగా.. ఒక్క కోయంబత్తూరు ఎయిర్‌పోర్ట్ సమస్య తీరితే.. ఆ ప్రాంతం ఒక్కటే పాకిస్తాన్ జీడీపీ దాటేస్తుందని మరో యూజర్ అన్నారు. గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలు ఎప్పుడో పాకిస్తాన్ జీడీపీని దాటేశాయని ఇంకో యూజర్ అన్నారు.TN GDP is now greater than the GDP of Pakistan. And the population of Pakistan is more than thrice that of Tamil Nadu. In other words the average resident of TN is more than 3X better off than the average resident of Pakistan. To the govt and military of Pakistan - focus on… https://t.co/2AbOw3LAE1— Sanjeev Bikhchandani (@sbikh) May 15, 2025

Shafali Verma make T20I comeback as India women name squad for England tour4
ఇంగ్లండ్ టూర్‌కు భార‌త జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌..

భార‌త మ‌హిళ‌ల క్రికెట్ జ‌ట్టు ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. ఈ టూర్‌లో భాగంగా ఆతిథ్య ఇంగ్లండ్‌తో ఐదు టీ20లు, మూడు వ‌న్డేల సిరీస్‌లో భార‌త్ త‌ల‌ప‌డ‌నుంది. ఈ క్ర‌మంలో ఇంగ్లండ్‌తో వైట్‌బాల్ సిరీస్‌ల‌కు భార‌త జ‌ట్టును బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ గురువారం ప్ర‌క‌టించింది. ఈ రెండు సిరీస్‌ల‌లో భార‌త కెప్టెన్‌గా హర్మ‌న్‌ప్రీత్ కౌర్‌, వైస్ కెప్టెన్‌గా స్మృతి మంధాన వ్య‌హ‌రించ‌నున్నారు. అదేవిధంగా ఇంగ్లండ్ టూర్‌కు స్టార్ ప్లేయ‌ర్లు శ్రేయాంక పాటిల్, రేణుకా సింగ్ గాయాల కార‌ణంగా దూర‌మ‌య్యారు. శ్రేయాంక చేతి వేలి గాయంతో బాధ‌ప‌డుతుండ‌గా.. రేణుకా మోకాలి గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూరంగా ఉంటుంది. దీంతో వీరిద్దరూ శ్రీలంక వేదిక‌గా జ‌రిగిన ముక్కోణ‌పు వ‌న్డే సిరీస్‌లోనూ భార‌త్ జ‌ట్టులో భాగం కాలేదు. మ‌రోవైపు వ‌న్డే జ‌ట్టు నుంచి క‌ష్వీ గౌత‌మ్‌ను సెల‌క్ట‌ర్లు త‌ప్పించారు. ముక్కోణ‌పు వ‌న్డే సిరీస్‌లో గౌత‌మ్ ఆడే అవ‌కాశం వ‌చ్చిన‌ప్ప‌టికి, పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఈ క్ర‌మంలోనే ఆమెను సెల‌క్ట‌ర్లు ప‌క్క‌న పెట్టారు.షెఫాలీ రీ ఎంట్రీ..ఇక భార‌త టీ20 జ‌ట్టులోకి స్టార్ ఓపెన‌ర్ షెఫాలీ వ‌ర్మ రీ ఎంట్రీ ఇచ్చింది. డ‌బ్ల్యూపీఎల్‌-2025లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌ర‌పున షెఫాలీ అద్బుతంగా రాణించడంతో సెల‌క్ట‌ర్లు తిరిగి పిలుపు నిచ్చారు. ఈ ఏడాది డ‌బ్ల్యూపీఎల్ సీజ‌న్‌లో షెఫాలీ 152.76 స్ట్రైక్ రేటుతో 304 ప‌రుగులు చేసింది.ఆల్‌రౌండ‌ర్ స్నేహ్ రాణా సైతం టీ20 జ‌ట్టులోకి పునరాగ‌మ‌నం చేసింది. అదేవిధంగా వైఎస్‌ఆర్‌ జిల్లాకు చెందిన శ్రీచరణి వ‌న్డే, టీ20 జ‌ట్టులో చోటు ద‌క్కించుకుంది. ఇటీవ‌లే శ్రీలంక ప‌ర్య‌ట‌నతో అరంగేట్రం చేసిన శ్రీచ‌ర‌ణి.. త‌న అద్బుత ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకుంది. ఇక భార‌త జ‌ట్టు ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న జూన్ 28 నుంచి ప్రారంభం కానుంది.భారత టీ20 జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్‌), షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీప‌ర్‌), యాస్తికా భాటియా , హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, స్నేహ రాణా, శ్రీ చరణి, శుచి రణ్‌ఉపాధ్యాయ, కె అరుణ్‌జో ఉపాధ్యాయ్, కె అరుణ్‌జో ఉపాధ్యాయ్‌ ఉపాధ్యాయ్‌ సత్ఘరేభారత వన్డే జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), స్మృతి మంధాన), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీప‌ర్‌), యాస్తికా భాటియా , తేజల్ హసబ్నిస్, దీప్తి శర్మ, స్నేహ రాణా, శ్రీ చరణి, కె అరుణ్ధా రెడ్డి, షుచి అమాన్‌ప్రీత్‌కౌర్ గౌడ్, సయాలీ సత్ఘరేచదవండి: IND vs ENG: టీమిండియాతో టెస్టు సిరీస్‌.. ఇంగ్లండ్ క్రికెట్ మాస్ట‌ర్ ప్లాన్‌

Drone Footage Shows Terrorists Hiding In Shed5
డ్రోన్ ఫుటేజ్.. ఉగ్రవాదుల్ని ఎంత క్లియర్‌గా రికార్డు చేసిందో..!

పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం మరో ఉగ్రదాడికి విఫలయత్నం జరిగింది. రెండు రోజుల క్రితం పలువురు ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్ లో మరో కిరాతకానికి పాల్పడే ప్రయత్నంలో దాన్ని మన నిఘా వర్గాలు పసిగట్టి వారిని హతమార్చాయి. మంగళవారం జమ్మూ కశ్మీర్ లో ముగ్గురు ఉగ్రవాదులు.. మన భద్రతా దళాల చేతిలో హతమయ్యారు. వారిని ల‌ష్క‌రే తోయిబాకి చెందిన ముగ్గురు ఉగ్రవాదులుగా భావిస్తున్నారు.జమ్మూ కశ్మీర్ లోని అవంతిపోరాలో ఉగ్రవాదులు తమ పన్నాగానికి సిద్ధమైన సమయంలో దాన్ని భారత భద్రతా బలగాలు తిప్పికొట్టి వారిపై కాల్పులు జరిపి హతమార్చాయి. అయితే భద్రతా బలగాల కాల్పుల్లో హతమైన ముగ్గురు ఉగ్రవాదుల్లో.. ఒక ఉగ్రవాది పహల్గాం దాడి అనుమానిత ఉగ్రవాదిగా భావించినా దానిపై క్లారిటీ రాలేదు. ఇదిలా ఉంచితే, ఈ ఘటనకు సంబంధించి ఇక్కడ డ్రోన్ ఫుటేజ్ ఒకటి బయటకొచ్చింది.तो ऐसे अपने वीर जवानों ने आतंकी को जहन्नुम पहुंचाया ।#TralEncounter pic.twitter.com/FCkDRqeYe3— Manish Yadav (@itsmanish80) May 15, 2025ఒక కాంక్రీట్ పిల్లర్ కింద ఉగ్రవాదులు తమ రైఫిల్స్ ను సరిచేసుకుంటున్న సమయంలో డ్రోన్ దానిని రికార్డు చేసింది. మరొక వీడియోలో విరిగిన షెడ్ లో గుమిగూడి ఉన్న మరి కొందరు కనిపించారు. దీనికి సంబంధించి కొన్ని ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇక గడిచిన రెండురోజుల్లో ఆరుగురు ఉగ్రవాదులు.. భారత బలగాల చేతిలో హతమయ్యారు.అయితే వీరంతా పోలీసులు, సైన్యం సంయుక్తంగా చేస్తున్న ఆపరేషన్ తర్వాత తప్పించుకునే క్రమంలో ఓ ఇంట్లో ఆశ్రయం పొంది ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. ఇలా 48 గంటల్లో ఆరుగురు ఉగ్రవాదులు బయటకొచ్చి భద్రతా బలగాల చేతుల్లో హతమయ్యారు.

President Droupadi Murmu Sensational Question to supreme court6
రాష్ట్రపతికి సుప్రీంకోర్టు డెడ్‌లైన్‌ ఏంటి?.. సంచలనంగా ద్రౌపది ముర్ము ప్రశ్నలు!

ఢిల్లీ: ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్రంగా ఖండించారు. తమిళనాడు ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ కేసులో, రాష్ట్ర బిల్లులపై గవర్నర్, రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడానికి గడువు విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా గవర్నర్‌తో పాటు రాష్ట్రపతికీ గడువు విధించడంపై తాజాగా ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) స్పందించారు.ఈ క్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. రాజ్యాంగంలో అలాంటి నిబంధనేదీ లేనప్పుడు.. సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పు ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. రాజ్యాంగంలోని 143 ఆర్టికల్‌ కింద ఉన్న ప్రత్యేక అధికారాలను వినియోగించుకొని సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్రపతి పలు పశ్నలు సంధించారు. ఈ ప్రశ్నలపై న్యాయస్థానం తమ అభిప్రాయాలను తెలియజేయాలని అడిగినట్లు సమాచారం. ఈ అంశంపై స్పందించేందుకు భారత ప్రధాన న్యాయమూర్తిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ త్వరలోనే రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసే అవకాశం ఉంది.అలాగే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 గవర్నర్ అధికారాలను, బిల్లులకు ఆమోదం తెలపడం లేదా నిలిపివేయడం, రాష్ట్రపతి పరిశీలన కోసం బిల్లును రిజర్వ్ చేయడం వంటి విధానాలను వివరిస్తుందని రాష్ట్రపతి హైలైట్ చేశారు. అయితే, ఈ రాజ్యాంగ ఎంపికలను ఉపయోగించుకోవడానికి గవర్నర్‌కు ఎలాంటి గడువును ఆర్టికల్ 200లో పేర్కొనలేదని అన్నారు.సుప్రీంకోర్టును అడిగిన ప్రశ్నలివే..రాష్ట్రపతి, గవర్నర్‌కు కోర్టులు గడువు నిర్దేశిస్తాయా?.రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 కింద బిల్లును సమర్పించినప్పుడు గవర్నర్ ముందున్న రాజ్యాంగపరమైన ఎంపికలేంటి?.రాజ్యాంగంలోని 361వ అధికరణం, 200వ అధికరణం కింద గవర్నర్ చర్యలకు సంబంధించి న్యాయ సమీక్షపై పూర్తి నిషేధం విధిస్తుందా?రాజ్యాంగంలోని ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి రాజ్యాంగ విచక్షణ వినియోగం న్యాయ సమ్మతమైనదా?రాష్ట్రపతి లేదా గవర్నర్ అధికారాలను ఆర్టికల్‌ 142 కింద సుప్రీంకోర్టు తన సొంత అధికారాలతో ఎలా భర్తీ చేయగలదు?.సుప్రీంకోర్టుకు ఉన్న ప్లీనరీ అధికారాలను రాష్ట్రాలు కేంద్రానికి వ్యతిరేకంగా దుర్వినియోగం చేస్తున్నాయా?.ఆర్టికల్‌ 201 కింద రాష్ట్రపతి, ఆర్టికల్‌ 200 కింద గవర్నర్‌ రాజ్యాంగ విచక్షణాధికారం ఉపయోగించడం న్యాయబద్ధమేనా?.రాజ్యాంగంలో రాష్ట్రపతి అధికారాల మేరకు ఆర్టికల్ 143 కింద సుప్రీం కోర్టు సలహాను పొందడానికి లేదా గవర్నర్, రాష్ట్రపతి అనుమతి కోసం బిల్లును రిజర్వ్ చేయడం లేదా ఇతర విధంగా సుప్రీంకోర్టు అభిప్రాయం పొందడం అవసరమా? అని ప్రశ్నించారు. Big showdown brews between Rashtrapati Bhavan & Supreme CourtPresident Droupadi Murmu invokes Article 143, seeking clarity on SC's ruling that set deadlines for Tamil Nadu Governor RN Ravi to act on bills—without Centre's nod. CJI Gavai to form a Constitution BenchKey… pic.twitter.com/1DShRAn21P— Nabila Jamal (@nabilajamal_) May 15, 2025సుప్రీంకోర్టు తీర్పు ఇదే..తమిళనాడు ప్రభుత్వానికి, గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవికి మధ్య వివాదానికే గాక అంతిమంగా సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పుకు కారణమైంది. దేశ చరిత్రలోనే తొలిసారిగా గవర్నర్‌ గానీ, రాష్ట్రపతి గానీ ఆమోదించకుండానే చట్టంగా మారిన బిల్లులుగా చరిత్ర సృష్టించాయి!. ఇది భారత శాసననిర్మాణ చరిత్రలోనే కనీవిని ఎరుగని సంఘటనగా నిలిచిపోనుంది. తమిళనాడుకు చెందిన 10 బిల్లులను అసెంబ్లీ రెండోసారి ఆమోదించి పంపినా గవర్నర్‌ ఆమోదముద్ర వేయకుండా రాష్ట్రపతి పరిశీలనకు పంపడం, అది చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు తేల్చడం తెలిసిందే. వాటికి గవర్నర్‌ ఆమోదం లభించినట్టుగానే పరిగణిస్తున్నట్టు పేర్కొంటూ ఆర్టికల్‌ 142 కింద తనకు సంక్రమించిన విశేషాధికారాల ద్వారా ఏప్రిల్‌ 8న తీర్పు వెలువరించింది. దాంతో గవర్నర్‌ గానీ, రాష్ట్రపతి గానీ లాంఛనంగా ఆమోదించకుండానే సదరు 10 బిల్లులకు స్టాలిన్‌ సర్కారు చట్టబద్ధత కల్పించగలిగింది. తీర్పు పూర్తి మేరకు గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగానే వాటికి చట్టరూపం కల్పిస్తున్నట్టు అందులో స్పష్టంగా పేర్కొంది. వీటిలో తమిళనాడు వర్సిటీలు, ఫిషరీస్‌ వర్సిటీ, వైస్‌ చాన్స్‌లర్ల బిల్లులు తదితరాలున్నాయి.రాజకీయాలకు అతీతంగా ఉండాలి రాష్ట్రస్థాయిలో ఒక బిల్లు చట్టంగా రూపొందాలంటే ముందుగా అసెంబ్లీ, తర్వాత గవర్నర్‌ ఆమోదం పొందాలి. గవర్నర్‌ దాన్ని ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టవచ్చు. రాష్ట్రపతి పరిశీలనకు పంపవచ్చు. లేదంటే అసెంబ్లీ పునఃపరిశీలన నిమిత్తం తిప్పి పంపవచ్చు. అసెంబ్లీ రెండోసారి ఆమోదించి పంపితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మినహా గవర్నర్‌ విధిగా అనుమతి తెలిపాల్సిందే. అలాగాక రెండోసారి అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లులను తమిళనాడు గవర్నర్‌ రాష్ట్రపతి పరిశీలనకు పంపడాన్ని స్టాలిన్‌ సర్కారు 2023లో సుప్రీంకోర్టులో సవాలు చేసింది.దీనిపై కోర్టు తీర్పు వెలువరించింది. గవర్నర్‌ చర్య రాజ్యాంగవిరుద్ధమని, ఆర్టికల్‌ 200కు ఉల్లంఘనేనని స్పష్టం చేసింది. గవర్నర్‌ పునఃపరిశీలనకు వచ్చిన 2023 నవంబర్‌ 18వ తేదీనే బిల్లులకు ఆమోదం లభించినట్టే పరిగణిస్తున్నట్టు పేర్కొంది. అంతేగాక, ‘‘ఇకపై గవర్నర్లు తమ వద్దకొచ్చే బిల్లులపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలి. అదే బిల్లు రెండోసారి వస్తే నెలలోపు ఆమోదం తెలిపి తీరాలి’’ అని గడువు విధిస్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. తద్వారా గవర్నర్‌ వ్యవస్థను తక్కువ చేయడం తమ ఉద్దేశం కాదని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘ఆ స్థానానికి ఉండే అత్యున్నత గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాల్సిన గురుతర బాధ్యత గవర్నర్లపై ఉంటుంది. ప్రథమ పౌరునిగా రాష్ట్ర ప్రయోజనాలే పరమావధి అని ప్రమాణం చేశాక రాజకీయ మొగ్గుదలలు తదితరాలకు అతీతంగా, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా మెలగాలి. అలాగాక ప్రజలకు ప్రతిరూపమైన అసెంబ్లీ నిర్ణయాలకు విరుద్ధంగా నడుచుకోవడమంటే చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించడమే’’ అని స్పష్టం చేసింది.

Tollywood Producer SKN Vulgar Comments With Actress Ketika Sharma7
సింగిల్ ‍హీరోయిన్‌తో చిట్‌ చాట్‌.. నిర్మాత ఎస్‌కేఎన్‌ అభ్యంతరకర కామెంట్స్!

టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు, వెన్నెల కిశోర్, కేతిక శర్మ, ఇవానా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'సింగిల్'. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే విడుదలైన నాలుగు రోజుల్లో రూ.19.01 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.ఈ నేపథ్యంలోనే సింగిల్ మూవీ టీమ్‌ సరదాగా ప్రముఖ నిర్మాత ఎస్‌కేఎన్‌తో చిట్ చాట్‌ నిర్వహించింది. ఈ ఇంటర్వ్యూకు హీరో శ్రీ విష్ణుతో పాటు వెన్నెల కిశోర్, కేతిక శర్మ, ఇవానా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారితో నిర్మాత ఎస్‌కేఎన్‌ సరదా ప్రశ్నలు వేస్తూ నవ్వించారు. అంతవరకే బాగానే ఉన్నా హీరోయిన్‌ కేతిక శర్మను అడిగిన ప్రశ్న మాత్రం కాస్తా ఇబ్బందిపడేలా చేయడం మాత్రమే కాదు.. అభ్యంతరకరంగా అనిపించింది. అదేంటో మీరు కూడా చూసేయండి.ఇంటర్వ్యూ మధ్యలో నిర్మాత ఎస్‌కేఎన్‌.. హీరోయిన్‌ కేతిక శర్మను ఓ ఊహించని ప్రశ్న అడిగారు. అప్పుడప్పుడు ప్రభాస్‌ ఇంటర్వ్యూస్ చూశాం.. మీరు బాత్‌రూమ్ సింగర్ అని తెలిసింది.. మీ బాత్‌రూమ్‌కు ఎలాగో మాకు యాక్సెస్‌ ఉండదు కాబట్టి.. ఇక్కడే ఓ పాట పాడండి.. మేము హ్యాపీగా ఫీలవుతాం.. అంటూ కేతిక శర్మను అడిగారు. అయితే హీరోయిన్‌ను పాట పాడమని అడగడం బాగుంది కానీ.. బాత్‌రూమ్‌కు మాకు యాక్సెస్‌ ఉండదు అని అనడంపై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్‌ కాదని అంటున్నారు. అలా అడిగేముందు కాస్తా ఆలోచించాలని ఎస్‌కేఎన్‌కు నెటిజన్స్‌ సలహాలు ఇస్తున్నారు. #Prabhas ఇంటర్వ్యూలో లాగా #KetikaSharma తో పాట పాడించిన #SKN #Single #TeluguFilmNagar pic.twitter.com/BXormsJtb6— Telugu FilmNagar (@telugufilmnagar) May 14, 2025

Operation Sindoor: Kommineni Analysis Of Manoj Naravane Comments8
మిలటరీ చేతలకు.. నేతల మాటలకు పొంతనేది?

యుద్ధమంటే బాలీవుడ్‌ సినిమా కాదు.. సరదా అంతకంటే కాదు. భారత ఆర్మీ మాజీ ఛీఫ్ మనోజ్‌ నరవణే చేసిన అర్థవంతమైన వ్యాఖ్య ఇది. ఆపరేషన్ సింధూర్ నిలిపివేతపై వస్తున్న విమర్శలపై ఆయన స్పందిస్తూ.. యుద్ధం ఎల్లప్పుడు ఆఖరి ఆస్త్రం మాత్రమే కావాలని అన్నారు. అయితే.. ఇక విశ్రాంత మిలటరీ అధికారిగా ఆయన వ్యాఖ్యలకు ప్రభుత్వాన్ని నడిపే రాజకీయ నేతల మాటలకు మధ్య తేడా ఉండటమే సమస్య అవుతోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ చేసిన ప్రసంగంలో పాక్‌కు గట్టి హెచ్చరికలే చేసినప్పటికీ వివిధ వర్గాల్లో వ్యక్తమవుతున్న అనుమానాలకు మాత్రం బదులిచ్చినట్లు కనిపించదు.👉ఆపరేషన్‌ సింధూర్‌ను హఠాత్తుగా ఎందుకు ఆపేశారు అన్నది వీటిల్లో ఒకటి. మిలటరీ అధికారుల స్థాయిలో పాక్‌ శరణు కోరినంత మాత్రాన అంగీకరించడం సబబేనా అన్నది కొందరి అనుమానం. పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారం జరగాల్సిందేనని దేశ ప్రజలు వాంఛించిన మాట వాస్తవం. అలాగే ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేస్తూ భారత సైన్యం సాగించిన అపరేషన్‌ సింధూర్‌పై కూడా ప్రశంసల వర్షం కురిసింది. కానీ యుద్ధం ఆకస్మిక నిలిపివేత.. పహల్గామ్‌ దాడికి దారితీసిన నిఘా వైఫల్యాల వంటివి మాత్రం ప్రశ్నలుగా మిగిలిపోయాయి.👉కశ్మీర్‌లో కాల్పులు కొత్త కాకపోవచ్చు. పాక్‌ సైన్యం జరిపే కవ్వింపు కాల్పులు, చొరబాట్ల కోసం ఉగ్రవాదులు అప్పుడప్పుడూ భారత సైన్యంపైకి కాల్పులు జరుపుతూనే ఉంటారు. అయితే పహల్గామ్‌ మాత్రం రాక్షస కృత్యం. అమాయకులైన టూరిస్టులను, అది కూడా పేర్లు అడిగి మరీ హిందువులను హత్య చేయడంపై దేశం యావత్తు ఆగ్రహావేశాలు పెల్లుబుకాయి. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనను ఆకస్మికంగా విరమించుకుని వెనక్కు రావడం, ఉన్నతాధికారులతో సమీక్షలు జరపడం వరకూ బాగానే ఉంది. కానీ.. ఆ వెంటనే బీహార్‌లో ఓ ఎన్నికల ర్యాలీలో పాల్గొనడం మాత్రం చాలామందికి ముఖ్యంగా ప్రతిపక్షాలకు రుచించలేదు. అయినా సరే.. పాక్‌పై మోడీ తీసుకునే చర్యలకు మద్దతిస్తామని స్పష్టం చేశాయి.👉ఈ తరుణంలో మోదీ సైన్యానికి పూర్తి స్వేచ్చ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆ పిమ్మట భారత సైన్యం ఉగ్ర శిబిరాలను విజయవంతగా ధ్వంసం చేసి వచ్చింది. సుమారు వంద మంది ఉగ్రవాదులను హతమార్చింది. ఈ సమయంలో పాకిస్తాన్ కూడా సరిహద్దులలో కాల్పులకు, ఇతరత్రా దాడులకు పాల్పడడానికి ప్రయత్నించగా భారత సైన్యం తిప్పికొట్టగలిగింది. అంతేకాక రావల్పిండి, తదితర పాక్ మిలిటరీ స్థావరాలపై దాడులు చేసింది. నిజానికి భారత్ సైనిక శక్తి ముందు పాక్ ఎందుకు కొరగాదన్నది వాస్తవం. ఈ సమయంలో కేంద్రంలోని పెద్దలు కాని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు కాని యుద్దం చేయబోతున్న సంకేతాలు ఇచ్చారు. మనం తలచుకుంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ ను స్వాధీనం చేసుకోవడం కష్టం కాదని, అసలు పాక్ ఉనికే ప్రశ్నార్థకం అవుతుందని ప్రకటనలు చేశారు.👉వీటి ఆధారంగా చాలా మంది యుద్దం ఆరంభమైనట్లే భావించారు. సాంకేతికంగా భారత్ యుద్ధ ప్రకటన చేయకపోయినప్పటికీ ఇకపై పాక్ నుంచి ఎలాంటి చికాకు ఎదురుకాకుండా పీఓకే మన ఆధీనంలోకి వస్తుందని భావించారు. పాక్ నాలుగుగా చీలిపోయే అవకాశం ఉందని కొంతమంది జోస్యం కూడా చెప్పారు. కానీ అలా జరగలేదు. కానీ ఆకస్మాత్తుగా పాక్ మిలటరీ శరణు కోరడంతో కాల్పుల నిలిపివేతకు అంగీకరించామని మోదీ చెప్పడంతో అప్పటివరకూ బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలకు, జరిగిన పరిణామాలకు మధ్య తేడా రావడంతో కేంద్రంపై విమర్శలు వచ్చాయి. కాల్పుల విరమణతో మోదీ ప్రభుత్వం సాధించంది ఏమిటి? అని విపక్షాలు ప్రశ్నించాయి.👉ఈ లోగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వేలు పెట్టి ఇదంతా తన ఘనత అని చెప్పుకోవడం మరింత చికాకైంది. దానిని విదేశాంగ శాఖ ఖండించినప్పటికీ, ప్రధాని బహుశా దౌత్యనీతి లేదా మరే కారణం వల్లనో తన ప్రసంగంలో ఆ ప్రస్తావన చేయలేదు. కశ్మీర్ విషయంలో మూడో పక్ష రాయబారానికి అంగీకరించబోమని భారత్ చెబుతుండగా, ట్రంప్ తాను మధ్యవర్తిత్వం చేస్తానని అనడం బాగోలేదు. అంతేకాక, అమెరికా తన స్వప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించి భారత్, పాక్‌లను ఒకే దృష్టితో చూడడం ఆశ్చర్యపరిచింది. భారత్ విదేశాంగ విధానంలో ఏమైనా లోపం ఉందా అన్న ప్రశ్నకు తావిచ్చింది. మరో వైపు పాకిస్తాన్ పహల్గామ్‌ దుశ్చర్యతో తమకు సంబంధం లేదని అబద్ధాలు చెప్పింది.👉ఆ ఉగ్ర ముష్కరులను భారత భద్రత దళాలు పట్టుకుని, వారి మూలాలు అన్నిటిని చెప్పగలిగి ఉంటే పాకిస్తాన్ ప్రపంచంలో ఒంటరై ఉండేది. వారికి పరోక్ష మద్దతు ఇస్తున్న చైనా కూడా బహిరంగంగా పాక్‌ను తప్పు పట్టవలసి వచ్చేది. అయితే పాకిస్తాన్ భారతదేశం వద్ద ఉన్న ఎస్.4 సుదర్శన రక్షణ కవచాన్ని ఏమీ చేయలేక పోయిందన్న విషయాన్ని మోదీ అన్ని దేశాలకు తెలిసేలా అదంపూర్ వెళ్లి ఆ బేస్ నుంచి ప్రసంగించడం బాగుందని చెప్పాలి. అలాగే భారత్‌కు ఉన్న స్వదేశీ పరిజ్ఞాన ఆయుధ సంపత్తి శక్తి సామర్థ్యాలు కూడా దేశ ప్రతిష్టను పెంచాయి. అయినప్పటికీ యుద్దం ఎందుకు ఆగిందన్నది సగటు భారతీయుడికి ఎదురయ్యే ప్రశ్న.👉దానికే మాజీ ఆర్మీ ఛీప్ నరవణే ఇచ్చిన ప్రకటన అర్థవంతమైన జవాబు అవుతుంది. యుద్ధం అంటే సినిమా కాదు..అది చివరి అస్త్రం కావాలన్న ఆయన మాటలు అక్షర సత్యం. పాక్‌కు భారీ నష్టం జరిగినా, మనకు కూడా ఎంతో కొంత నష్టం ఉంటుంది. భారత సైన్యం సాధించిన విజయానికి సెల్యూట్ చేద్దాం. యుద్ధం జరగాలని కోరుకునేవారు కొంత అసంతృప్తికి గురై ఉండవచ్చు.. మిలటరీ ఆపరేషన్స్ వరకు ప్రామాణికంగా తీసుకుంటే భారత్ గొప్ప విజయం సాదించిందని ఒక రిటైర్డ్ మేజర్ వ్యాఖ్యానించారు. అయితే రాజకీయ పార్టీలు భావోద్వేగ అంశాలపై బాధ్యతతో మాట్లాడకపోతే అవి ఆత్మరక్షణలో పడతాయని కూడా ఈ అనుభవం తెలుపుతోందని అనుకోవచ్చు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Metro Train In Hyderabad Charges Increased9
Hyderabad: ప్రయాణికులకు మెట్రో షాక్‌..!

హైదరాబాద్‌: ప్రయాణికులకు హైదరాబాద్‌ మెట్రో షాకిచ్చింది. మెట్రో ట్రైన్‌ టికెట్ల ధరలను పెంచుతూ ఎల్ అండ్ టి నిర్ణయం తీసుకుంది. కనిష్ట ధర రూ. 10 నుంచి రూ. 12కు పెంచగా, గరిష్ట ధర రూ. 60 నుంచి రూ. 75కు పెంచారు. తాజాగా పెంచిన ధరలు మే 17 నుంచి అమల్లోకి రానున్నట్లు ఎల్‌ అండ్‌ టీ స్సష్టం చేసింది. హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు వివరాలు ఇలా ఉన్నాయి..ప్రస్తుతం కనిష్ట ధర ₹10.. గరిష్ట ధర 60 రూపాయలురెండు కిలోమీటర్ల వరకు 12 రూపాయలునాలుగు కిలోమీటర్ల నుంచి 6 కిలోమీటర్ల వరకు 30 రూపాయలు6 కిలోమీటర్ల నుంచి తొమ్మిది కిలోమీటర్ల వరకు 40 రూపాయలు9 కిలోమీటర్ల నుంచి 12 కిలోమీటర్ల వరకు 50 రూపాయలు12 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్ల వరకు 55 రూపాయలు18 కిలోమీటర్ల నుంచి 21 కిలోమీటర్ల వరకు 66 రూపాయలు21 కిలోమీటర్ల నుంచి 24 కిలోమీటర్ల వరకు 70 రూపాయలు24 కిలోమీటర్ల నుంచి ఆపై కిలోమీటర్లకు 75 రూపాయలు పెంచుతూ ఎల్ అండ్ టి నిర్ణయం

Bengaluru Techie Exposes Wife Secret Marriage via Zoom Call, Wins in Court10
జూమ్‌ కాల్‌తో భార్య రెండో పెళ్లి గుట్టురట్టు.. నాలుగేళ్ల కోర్టు పోరాటంలో భర్త విజయం

సాక్షి, బెంగళూరు: భార్య నుంచి విడాకులు కావాలని కోరుతూ నాలుగేళ్ల కోర్టు పోరాటంలో ఓ భర్త విజయం సాధించాడు. అంతేకాదు భర్త నుంచి తనకు రూ.3 కోట్ల భరణం కావాలన్న భార్య డిమాండ్‌ను కోర్టు తిరస్కరించింది. కోర్టు ఖర్చుల కింద రూ.30వేలు ఇస్తే సరిపోతుందంటూ భార్య నుంచి భర్తకు విడాకులు మంజూరు చేస్తూ ఫ్యామిలీ కోర్టు తీర్పును వెలువరించింది.కేసు పూర్వాపరాల్ని పరిశీలిస్తే.. బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ దంపతులకు 2018లో వివాహం జరిగింది. అయితే, ఏ చీకు చింతా లేని దాంపత్య జీవితంలో వివాహానికి ముందు భార్య నెరిపిన ప్రేమాయణం చిచ్చుపెట్టింది.వివాహం తర్వాత భార్య.. భర్తతో అన్యోన్యంగా మెలుగుతూ వచ్చింది. కానీ అనూహ్యంగా అదే భార్య ప్రేమ పేరుతో ప్రియుడికి దగ్గరైంది. భర్తకు తెలియకుండా అతన్ని రెండో వివాహం చేసుకుంది. మొదటి భర్తతో కలిసి జీవించేది. డబ్బులు అవసరం అయినప్పుడల్లా రెండో భర్తకు డబ్బులు పంపిస్తుండేది. దీంతో భార్య చేస్తున్న ఖర్చులపై మొదటి భర్తకు అనుమానం మొదలైంది. ఇదే విషయంపై భార్యను నిలదీయాలని అనుకున్నాడు.కానీ అలా చేయలేదు. భార్య గుట్టు రట్టు చేసేందుకు పక్కా ప్లాన్‌ వేశాడు. తన స్నేహితుడి సాయంతో భార్యకు జూమ్ ఇంటర్వ్యూ నిర్వహించాడు. ఆ జూమ్‌ ఇంటర్వ్యూలో తనకు అన్వేక కారణాల వల్ల మొదటి వివాహం జరిగిందని, ఇప్పుడు ఆ వివాహ బంధానికి ముగింపు పలికి రెండో వివాహం చేసుకున్నట్లు తెలిపారు.ఈ పరిణామం తరువాత ఆర్టీఐ ద్వారా.. తన భార్యకు రెండో వివాహం ఎప్పుడు జరిగిందో తెలుసుకున్నాడు. మ్యారేజీ సర్టిఫికెట్లు, పాన్‌ కార్డ్‌లతో పాటు ఇతర ఆధారాల్ని సేకరించాడు. వాటి ఆధారంగా 2023 మార్చి నెలలో భార్య తన ప్రియుడిని రెండో వివాహం చేసుకున్నట్లు గుర్తించాడు. వెంటనే మంగళూరు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. తనకు న్యాయం చేయాలని ప్రాధేయపడ్డాడు. భార్య నుంచి విడాకులు కోరాడు. భార్య మానసిక హింస, వివాహం నిబంధనలను ఉల్లంఘించడం, ప్రతిష్టకు భంగం కలిగించిందని ఆరోపించాడు. ఆర్టీఐ ద్వారా సేకరించిన ఆధారాల్ని కోర్టుకు అందించాడు. విచారణ చేపట్టిన కోర్టు విడాకుల విషయంలో భార్య నిర్ణయం తెలపాలని ఆదేశించింది. దీంతో భార్య.. భర్తపై గృహ హింస, డౌరీ హింస, గర్భం తొలగించమని బలవంతం చేశారని ఆరోపించింది. అంతేకాదు భరణం కింద రూ.3 కోట్లు, నెలకు ఖర్చుల కింద రూ.60వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేసింది.ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. 2025,ఏప్రిల్ 23న భార్య నుంచి భర్తకు విడాకులు మంజూరు చేసింది. భార్య అడిగిన భరణాన్ని తిరస్కరించింది. న్యాయవాద ఖర్చుల నిమిత్తం రూ.30వేలు ఇవ్వాలని ఆదేశించింది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement