హుదూద్ తుఫాన్ ప్రభావం నాలుగు జిల్లాల్లో తీవ్రంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు తెలిపారు. శ్రీకాకుళంలో జిల్లా 11 మండలాల్లో 117 గ్రామాలు, విశాఖ జిల్లాలో 11 మండలాల్లో 103 గ్రామాలు, తూర్పు గోదావరి జిల్లా 20 మండలాల్లో 78 గ్రామాల్లో తుఫాన్ ప్రభావం ఉందని తెలిపారు. అలాగే విజయనగరం జిల్లాలో 2 మండల్లాల్లో 22 గ్రామాల్లో కూడా తుఫాన్ ఎక్కువ మోతాదులో ఉందని తెలిపారు. హుదూద్ తుఫాన్ కారణంగా 6695 ఇళ్లు ధ్వంసం కాగా, 109 చోట్ల రైల్వే ట్రాక్, రోడ్లు దెబ్బతిన్నాయని, 5727 కరెంటు స్తంభాలు, 19 చోట్ల కాల్వలకు గండ్లు, 181 బోట్లు గల్లంతైన గణాంకాలు వెల్లడించారు.
Published Mon, Oct 13 2014 8:58 PM | Last Updated on Fri, Mar 22 2024 11:21 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement