టీడీపీ ఎంపీల 2 నెలల జీతం విరాళం | tdp mp's donates two months salary for cyclone victims | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎంపీల 2 నెలల జీతం విరాళం

Published Mon, Oct 13 2014 7:14 PM | Last Updated on Tue, Mar 19 2019 9:15 PM

టీడీపీ ఎంపీల 2 నెలల జీతం విరాళం - Sakshi

టీడీపీ ఎంపీల 2 నెలల జీతం విరాళం

హైదరాబాద్:తుపాను బాధితులకు టీడీపీ ఎంపీలు తమ రెండు నెలల జీతాన్ని విరాళంగా ఇవ్వనున్నారు.  ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ ఎంపీ సుజనా చౌదరి సోమవారం స్పష్టం చేశారు. తుపాను బాధితుల సహాయార్ధం సీఎం రిలీఫ్ ఫండ్ కు ఈ మొత్తాన్ని ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. తుపాను జాతీయ విపత్తుగా ప్రకటించాలని సుజనా చౌదరి పేర్కొన్నారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో ఒక్కో ఎంపీ నిధుల నుంచి రూ. 25 లక్షలను సేకరిస్తున్నట్లు తెలిపారు.

 

హుదూద్ తుపాను ప్రభావంతో మూడు జిల్లాలో భారీ ఆస్తినష్టంతో పాటు, పంట నష్టం కూడా ఏర్పడింది. దీనిపై సహాయకచర్యలు ప్రభుత్వం సిద్ధమైనా.. బాధితులు మాత్రం ప్రభుత్వం నుంచి తగిన సహకారాలు లభించడంలేదని ఆవేదన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement