
నీట మునిగిన రైల్వే ట్రాక్‌లు
విజయనగరం టౌన్:తుపాను ధాటికి విజయనగరం రైల్వేస్టేషన్ పరి సర ప్రాంతాలను ఛిన్నాభిన్నమయ్యాయి. శనివారం అర్ధరాత్రి నుంచి వీచిన ఈదురుగాలులతో పాటు భారీ వర్షానికి రైల్వే ట్రాక్‌లు పూర్తిగా నీటితో నిండిపోయా యి. స్టేషన్ ఆవరణలో ఉన్న గాజు గ్రిల్స్, కంప్యూటర్, ఎలక్ట్రానిక్ పరికరాలు ధ్వంసమయ్యాయి. ఇప్పటివరకూ సుమారు కోటి రూపాయల వరకూ ఆస్తి నష్టం సంభవించినట్టు రైల్వే అధికారులు తెలిపారు. స్టేషన్ పైకప్పులు గాలులకు ధ్వంసమయ్యాయి.విద్యుత్ వ్య వస్థ నిలిచిపోవడంతో స్టేషన్ పరిసర ప్రాంతాల్లో గా ఢాంధకారం నెలకొంది. రిజర్వేషన్ కౌంటర్ బోర్డులు, స్టేషన్ పరిసరాల్లో విద్యుత్ స్తంభాలు, విలువైన సా మగ్రి పూర్తిగా పాడైంది.
మూడు, నాలుగు నెంబర్ ఫ్లాట్‌ఫారాలపై ఉన్న పలు దుకాణా లు గాలికి కొట్టుకుపోయాయి. విజయనగరం మీదు గా వెళ్లి, వచ్చే పలు రైళ్లను రద్దు చేయడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు చెబుతున్నారు. కాగా సోమవారం ఉద యం నుంచి స్టేషన్‌లో పారి శుద్ధ్య పనులు ప్రారంభిం చారు. ఎక్కడికక్కడ నిల్వ ఉన్న నీటిని తోడిస్తున్నారు. అలాగే స్టేషన్‌లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు. సోమవారం సాయంత్రానికి పరిస్థితి చక్కబడితే సమతా ఎక్స్‌ప్రెస్‌ను ట్రయిల్ రన్‌గా తీసుకువచ్చే అవకాశం ఉందని రైల్వే వర్గాలు తెలిపాయి.
హెల్ప్‌లైన్ ద్వారా సమాచారం
జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేష న్‌లో ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక హె ల్ప్‌లైన్ సెంటర్‌ను రైల్వే ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. ప్రయాణికులకు అవసరమైన సమాచారం అందించడంతో పాటు టికె ట్ క్యాన్సిలేషన్, తదితర వాటిపై అవగాహన కల్పిం చారు. రైల్వే కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ ఎస్. రంగారావు, ఇన్‌చార్జీ డీవీఎన్ రా వు, కురియాకోస్, బీరేందర్, ఆర్‌పీఎఫ్ ఎస్‌ఐ రామకృష్ణ హెల్ప్‌లైన్ వద్ద ఉంటూ ప్ర యాణికులకు కావాల్సిన సమాచారాన్ని ఇస్తున్నారు.
నిలిచిన రైళ్లు
వేపాడ: తుపాను తాకిడికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో శనివారం రాత్రి నుంచి లక్కవరపుకోట రైల్వే స్టేషన్ వద్ద రెండు గూడ్స్ రైళ్లు నిలిచిపోయాయి. తు పాను తాకిడికి విద్యుత్ వ్యవస్థ దెబ్బతినడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో రైల్వే శాఖకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది.