హుదూద్ తుఫానుకు దెబ్బతిన్న విశాఖపట్నం నగరంలో చెట్ల తొలగింపు ఇంకా పూర్తికాలేదని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు.
హుదూద్ తుఫానుకు దెబ్బతిన్న విశాఖపట్నం నగరంలో చెట్ల తొలగింపు ఇంకా పూర్తికాలేదని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. తాగునీటి సరఫరాను పూర్తిగా పునరుద్ధరించారని, ప్రస్తుతానికి 25 శాతం అదనంగా కూడా నీళ్లు ఇస్తున్నారని ఆయన చెప్పారు. రేపు 50 శాతం అదనంగా ఇస్తారని, పరిశ్రమలకు కూడా తాగునీరు ఇస్తున్నారని తెలిపారు.
విశాఖపట్నంలో చెట్ల తొలగింపు ఇంకా పూర్తికాలేదని, ప్రస్తుతం పదివేల మంది సిబ్బంది ఈ పనిలో ఉన్నారని, మరో పదివేల మందిని రప్పిస్తామని ఆయన చెప్పారు. రెండు రోజుల్లో మొత్తం అన్ని కాలనీలలో పడిపోయిన చెట్లను తొలగిస్తామని తెలిపారు.