
విశాఖ నెమ్మదిగా కోలుకుంటోంది: చంద్రబాబు
హుదూద్ తుపాను నుంచి విశాఖపట్నం నెమ్మది నెమ్మదిగా కోలుకుంటోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖపట్నంలోని ఆరిపాక ప్రాంతంలో జన్మభూమి - మాఊరు కార్యక్రమంలోను, సబ్బవరం ప్రాంతంలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలోను చంద్రబాబు పాల్గొన్నారు.
స్వచ్ఛభారత్ కార్యక్రమంలో విద్యార్థులతో ఆయన ప్రమాణం చేయించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు తమవంతు కృషి చేస్తామని వాళ్లతో ప్రతిజ్ఞ చేయించారు. ఇక విశాఖపట్నానికి తాను పూర్వవైభవం తీసుకొస్తానని చెప్పారు. మొక్కలు నాటుదామని, పరిశుభ్రత పాటిద్దామని విశాఖ వాసులకు ఆయన పిలుపునిచ్చారు.