హుదూద్ తుఫాను బాధితులను ఆదుకునేందుకు శ్రీ చైతన్య విద్యాసంస్థలు రెండు కోట్ల రూపాయల విరాళం ఇచ్చాయి. హైదరాబాద్లోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడును విద్యాసంస్థల డైరెక్టర్లు కలిసి 2 కోట్ల రూపాయల చెక్కులు అందించారు.
ముఖ్యమంత్రిని కలిసినవారిలో శ్రీ చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్లు శ్రీధర్, సుష్మ, సీమ ఉన్నారు. హుదూద్ తుఫాను ఉత్తరాంధ్ర వాసులకు చాలా ఇబ్బందులు తెచ్చిపెట్టిందని, వారిని ఆదుకోవడానికి తమవంతు సాయంగా ఈ మొత్తం ఇచ్చామని డైరెక్టర్లు తెలిపారు.
2 కోట్ల విరాళం ఇచ్చిన 'శ్రీ చైతన్య' డైరెక్టర్లు
Published Fri, Oct 24 2014 8:23 PM | Last Updated on Sat, Sep 2 2017 3:19 PM
Advertisement
Advertisement