sri chaitanya institutions
-
అల్లు అర్జున్‌పై కేసు, తప్పుదోవ పట్టించారంటూ పోలీసులకు ఫిర్యాదు
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది. ఇటీవల బన్నీ నటించిన ఓ వ్యాపార ప్రకటనలో వాస్తవం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆయన శ్రీ చైతన్య విద్యాసంస్థల కోసం ఓ వ్యాపార ప్రకటనలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రకటన తప్పుదోవ పట్టించేలా ఉందని సామాజికి కార్యకర్త కొత్త ఉపేందర్‌రెడ్డి ఆరోపించాడు. అంతేకాదు ఇందులో నటించిన అల్లు అర్జున్, తప్పుడు సమాచారం ఇచ్చిన శ్రీ చైతన్య విద్యాసంస్థలపై ఆయన అంబర్‌పేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. చదవండి: సినిమాల్లోకి నమ్రత రీఎంట్రీ? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ జూన్ 6వ తేదీన పలు వార్త పత్రికల్లో శ్రీ చైతన్యకు సంబంధించిన ఐఐటీ(IIT), ఎన్ఐటీ(NIT) ర్యాంకుల ప్రకటన వచ్చింది. అయితే దీనిని అల్లు అర్జున్ ప్రమోట్ చేశాడు. ఈ ప్రకటనల్లో ఇచ్చిన సమాచారం పూర్తిగా అవాస్తవమని, ఆ తప్పుడు ప్రకటనలపై చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదు చేశాడు. అంతేకాదు ఇలాంటి తప్పుడు ప్రకటనలో నటించి అందరిని తప్పుదోవ పట్టించిన నటుడు అల్లు అర్జున్‌పై, శ్రీ చైతన్య విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో కోరాడు. చదవండి: సినిమా ఛాన్స్.. అప్పుడు ఆస్పత్రి బెడ్‌పై ఉన్నాను: నటి కాగా పుష్ప మూవీతో ఒక్కసారిగా బన్నీ క్రేజ్ పెరిగిపోయింది. దీంతో ఆయనకు దేశవ్యాప్తంగా బ్రాండ్ వ్యాల్యు కూడా భారీగా పెరిగింది. దీంతో పలు వ్యాపార సంస్థలకు బన్నీ బ్రాండ్ అంబాసిడర్‌గా మారాడు. వాణిజ్య ప్రకటనలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. అనేక బ్రాండ్లను ప్రమోషన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో బన్నీ తరచూ చేదు అనుభవం చూస్తున్నాడు. ఇప్పటికే జొమాటో, ర్యాపిడో ప్రకటనలో నటించి విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. -
జేఈఈ, నీట్ కోర్సులు: అమెజాన్‌తో చేతులు కలిపిన శ్రీ చైతన్య
న్యూఢిల్లీ: అమెజాన్ అకాడెమీ, విద్యాసంస్థల గ్రూప్ శ్రీ చైతన్య తాజాగా చేతులు కలిపాయి. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (జేఈఈ), నేషనల్ ఎలిజిబిలిటీ–కమ్–ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) రాసేవారి కోసం పూర్తి స్థాయి సిలబస్ కోర్సులను ఆవిష్కరించనున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం అమెజాన్ అకాడెమీలో శ్రీ చైతన్య అధ్యాపకులు లైవ్ ఆన్లైన్ తరగతులు బోధిస్తారు. అమెజాన్ అకాడెమీ రూపొందించిన బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ స్థాయి దాకా కంటెం ట్ విద్యార్థులకు అందుబాటులో ఉంటుందని అమెజాన్ ఇండియా డైరెక్టర్ అమోల్ గుర్వారా, ఇన్ఫినిటీ లెర్న్ (శ్రీ చైతన్య గ్రూప్) డైరెక్టర్ సుష్మ బొప్పన తెలిపారు. చదవండి : సిద్ధాంత్‌కు సీటివ్వండి! -
శ్రీచైతన్య విద్యాసంస్థలపై కొరడా..!
సాక్షి, మచిలీపట్నం(కృష్ణా) : శ్రీ చైతన్య విద్యాసంస్థలపై కొరడా ఝుళిపించేందుకు విద్యా శాఖాధికారులు సిద్ధమయ్యారు. నిబంధనలను బేఖాతర్ చేస్తూ టాలెంట్ టెస్టులను నిర్వహించడాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. జిల్లాలో ఉన్న శ్రీ చైతన్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పాఠశాలలకు నోటీసులు జారీ చేసి, నిర్వాహకుల నుంచి వచ్చిన వివరణ అనంతరం క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధం చేశారు. దసరా సెలవుల్లో ఎటువంటి తరగతులు నిర్వహించకూడదని డీఈఓ ఎంవీ రాజ్యలక్ష్మి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రత్యేక తరగతుల పేరుతో పదో తరగతి విద్యార్థులను సైతం పాఠశాలలకు పిలిపించివద్దని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాల విద్యా శాఖ క్యాలెండర్‌కు అనుగుణంగా దసరా సెలవులు ముగిసేంత వరకు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ప్రత్యేక తరగతులు వద్దని ఆదేశాలు ఇచ్చారు. కానీ శ్రీ చైతన్య విద్యా సంస్థల నిర్వాహకులు దీనిని పెడచెవిన పెట్టారు. డీఈఓ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ ఆదివారం టాలెంట్ టెస్టులను నిర్వహించారు. నందిగామ, మైలవరం, విజయవాడలోని మొగల్రాజపురం వంటి చోట్ల అప్పటికప్పుడు విద్యా శాఖాధికారులు వెళ్లి టాలెంట్ టెస్టులను అడ్డుకొని విద్యార్థులను ఇళ్లకు పంపించారు. శ్రీ చైతన్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియెట్ కళాశాలల వైపు ఆకర్షితులయ్యేలా పదో తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్టులను నిర్వహించారని విద్యా శాఖాధికారుల పరిశీలన తేలింది. జిల్లాలోని దాదాపు అన్ని శ్రీ చైతన్య పాఠశాలల్లో టాలెంట్ టెస్టులను నిర్వహించినట్లుగా ఫిర్యాదులు వచ్చాయి. దీంతో జిల్లాలో ఉన్న అన్ని శ్రీ చైతన్య పాఠశాలలకు నోటీసులు జారీ చేసి, దీనిపై వివరణ కోరేందుకు సిద్ధమయ్యారు. వారు ఇచ్చిన సంజాయిషీ అనంతరం సదరు పాఠశాలల నిర్వాహకులపై క్రిమినల్ కేసులు పెట్టాలనే ఆలోచన చేస్తున్నారు. సెలవుల్లో కూడా తరగతులను నిర్వహిస్తున్నట్లుగా గతంలో కూడా అనేకసార్లు శ్రీ చైతన్య విద్యా సంస్థలపై ఫిర్యాదులు వచ్చాయి. మచిలీపట్నంలోని భాస్కరపురంలో గల పాఠశాలలో ఇదే రీతిన నిర్వహించగా గతంలో డెప్యూటీ డీఈఓ బత్తుల సత్యనారాయణమూర్తి వెళ్లి నిర్వాహకులను హెచ్చరించి విద్యార్థులను అప్పటికప్పుడు ఇళ్లకు పంపించారు. ఇలా ఎన్నిసార్లు హెచ్చరించినా శ్రీ చైతన్య విద్యా సంస్థల నిర్వాహకుల్లో మార్పు రాకపోవటమే కాకుండా, తాము ఇస్తున్న ఆదేశాలను సైతం బేఖాతర్ చేస్తుండటాన్ని సీరియస్‌గా పరిగణిస్తున్నారు. క్రిమినల్ కేసులు నమోదు.. శ్రీ చైతన్య పాఠశాలలన్నింటికీ ఆయా డెప్యూటీ డీఈఓల ద్వారా నోటీసులు జారీ చేస్తున్నాం. వారి నుంచి వచ్చిన సంజాయిషీ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటాం. ఆ సంస్థల ప్రధాన బాధ్యులకు కూడా డీఈఓ కార్యాలయం నుంచి నోటీసులు పంపిస్తాం. ఆదేశాలను ధిక్కరిస్తున్నందున దీనిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి శ్రీ చైతన్య విద్యా సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. – ఎంవీ రాజ్యలక్ష్మి, డీఈఓ -
ఆ పాఠశాలలపై చర్యలకు ఆదేశాలివ్వండి
సాక్షి, అమరావతి: ఏపీ విద్యా సంస్థల చట్ట నిబంధనలకు విరుద్ధంగా తమ పాఠశాలల్లో అధిక ధరలకు పుస్తకాలు, యూనిఫామ్‌లు అమ్ముతున్న నారాయణ, శ్రీ చైతన్య, నెల్లూరు రవీంద్రభారతి, భాష్యం, డాక్టర్ కేకేఆర్ గౌతమ్ తదితర పాఠశాలలపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని ముందడుగు ప్రజా పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్.ఎన్.గ్రేసీ దాఖలు చేశారు. ఇందులో విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సర్వశిక్షాభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్, పలు జిల్లాల విద్యా శాఖాధికారులతోపాటు పైన పేర్కొన్న పాఠశాలలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది. రాష్ట్రంలో అన్ని ప్రైవేటు, అన్ ఎయిడెడ్, కార్పొరేట్ పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించి, చట్ట నిబంధనలను ఉల్లంఘించిన పాఠశాలల గుర్తింపును రద్దు చేసేలా విద్యాశాఖాధికారులను ఆదేశించాలని పిటిషనర్ తన పిటిషన్లో కోర్టును కోరారు. ప్రైవేటు పాఠశాలలు అసాధారణ ఫీజులను వసూలు చేస్తూ దోచుకుంటున్నాయని, ఈ విషయంలో అధికారులు తగిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు. చట్ట నిబంధనల ప్రకారం.. ప్రతి స్కూల్లో గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేయాలని, ఇందులో తల్లిదండ్రులకు సైతం స్థానం కల్పించడం తప్పనిసరన్నారు. ఏ పాఠశాల తమ పాఠశాలల్లో ఎటువంటి పుస్తకాలు, స్టేషనరీ, ఇతర వస్తువులు అమ్మరాదంటూ కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి ఈ నెల 11న సర్క్యులర్ జారీ చేశారని తెలిపారు. అయితే.. జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలు ఈ సర్క్యులర్‌ను ఖాతరు చేయడం లేదన్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని కోర్టును అభ్యర్థించారు. -
శ్రీచైతన్య విద్యార్థి ఆత్మహత్య!
విశాఖపట్నం , నర్సీపట్నం: అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కొడుకు ఇక లేడనే వార్తతో ఆ తల్లి తల్లడిల్లిపోతోం ది. కంటికి రెప్పలా చూసుకుంటున్న బాలుడి మృ తితో మండలంలోని బయపురెడ్డిపాలెంలో విషా దం చోటుచేసుకుంది. విశాఖపట్నం మారికవలస శ్రీచైతన్యలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న బయపురెడ్డి హేమంత్‌నాయుడు ఆత్మహత్యతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీ రుగా విలపిస్తున్నారు. రమణబాబు, అమ్మాజీల కు ఇద్దరు పిల్లలు. పెద్దదైన పాప వేములపూడి మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతోంది. కుమారుడు హేమంత్‌నా యుడుని మారికవలస శ్రీచైతన్యలో ఈ ఏడాది చేర్పించారు. సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా గడిపా డు. తరువాత కాలేజీకి వెళ్లిన హేమంత్‌నాయుడు(16) గురువారం రాత్రి హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకుని అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఈ గదిలో హేమంత్‌తో పాటు మరో ఆరుగురు విద్యార్థులు ఉంటున్నారు. శుక్రవా రం ఉదయం 5గంటల సమయంలో వార్డన్ నిద్రలేపే ప్రయత్నం చేయగా హేమంత్ సీలింగ్ హుక్కు వేలాడు తూ కనిపించాడు. అతడ్ని కిందికి దించి ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేక పోయిందని తోటి విద్యార్థులు, కళాశాల సిబ్బంది చెబుతున్నారు. కాగా ఇదే హాస్టల్ గదిలో ఉంటున్న మరో విద్యార్థికి చెందిన రు.14వేలు విలువైన ఫోన్ హేమంత్ చేతిలో పోయిందని, దీనిపై ఆ విద్యార్థి డబ్బులు అడగడంతో సంక్రాంతి సెలవులకు ముందు ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ వ్యవహారం కళాశాల యాజమాన్యం దృష్టికి కూడా వెళ్లింది. ఈ పరిస్థితులే ఆత్మహత్యకు దారితీసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినట్టు ఎస్ఐ హరికృష్ణ తెలిపారు. ఏం జరిగిందో తెలియడం లేదు.. తన కుమారుడికి ఎలాంటి అనారోగ్యం లేద ని, ఆరోగ్యంగానే ఉన్నాడని తల్లి అమ్మాజీ తెలిపింది. చదువులో సైతం ముందంజలో నే ఉండేవాడని పేర్కొంది. సెలవులు అనంతరం సంతోషంగానే వెళ్ళాడని, ఇంతలో ఏమి జరిగిం దో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. క ళాశాల యాజమాన్యం నిర్వాకం కారణంగానే తన కుమారుడు చనిపోయి ఉంటాడని కన్నీటి పర్యం తమైంది. శుక్రవారం ఉదయం9 గంటల సమయంలో కళాశాల నుంచి ఫోన్ చేశారని, మీ అబ్బా యి హేమంత్నాయుడుకు సీరియస్‌గా ఉందని, కేజీహెచ్‌కు తీసుకెళుతున్నామని చెప్పారన్నారు. వెంటనే తాను, తనభర్త విశాఖ వెళుతుండగా బలి ఘట్టం సమీపంలోకి వచ్చే సరికి మీ అబ్బాయి చనిపోయాడని ఫోన్లో చెప్పారని విలపిస్తూ వివరించింది. ముందు సీరియస్‌గా ఉందని చెప్పిన కళాశాల యాజమాన్యం కేవలం గంటవ్యవధిలోనే మళ్లీ ఫోన్‌చేసి చనిపోయినట్లు చెప్పడంపై అమ్మా జీ అనుమానం వ్యక్తం చేసింది. హేమంత్ చనిపోయాడనే సమాచారం తెలుసుకున్న గ్రా మస్తులు పెద్దసంఖ్యలో ఇంటికి చేరుకుని అమ్మాజీని ఓదా ర్చారు. తన కుమారుడు మృతిపై విచారణ చేపట్టి న్యాయం చేయాలని తల్లి డిమాండ్ చేస్తోంది. -
2 కోట్ల విరాళం ఇచ్చిన 'శ్రీ చైతన్య' డైరెక్టర్లు
హుదూద్ తుఫాను బాధితులను ఆదుకునేందుకు శ్రీ చైతన్య విద్యాసంస్థలు రెండు కోట్ల రూపాయల విరాళం ఇచ్చాయి. హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడును విద్యాసంస్థల డైరెక్టర్లు కలిసి 2 కోట్ల రూపాయల చెక్కులు అందించారు. ముఖ్యమంత్రిని కలిసినవారిలో శ్రీ చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్లు శ్రీధర్, సుష్మ, సీమ ఉన్నారు. హుదూద్ తుఫాను ఉత్తరాంధ్ర వాసులకు చాలా ఇబ్బందులు తెచ్చిపెట్టిందని, వారిని ఆదుకోవడానికి తమవంతు సాయంగా ఈ మొత్తం ఇచ్చామని డైరెక్టర్లు తెలిపారు.