
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది. ఇటీవల బన్నీ నటించిన ఓ వ్యాపార ప్రకటనలో వాస్తవం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆయన శ్రీ చైతన్య విద్యాసంస్థల కోసం ఓ వ్యాపార ప్రకటనలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రకటన తప్పుదోవ పట్టించేలా ఉందని సామాజికి కార్యకర్త కొత్త ఉపేందర్‌రెడ్డి ఆరోపించాడు. అంతేకాదు ఇందులో నటించిన అల్లు అర్జున్, తప్పుడు సమాచారం ఇచ్చిన శ్రీ చైతన్య విద్యాసంస్థలపై ఆయన అంబర్‌పేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
చదవండి: సినిమాల్లోకి నమ్రత రీఎంట్రీ? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
జూన్ 6వ తేదీన పలు వార్త పత్రికల్లో శ్రీ చైతన్యకు సంబంధించిన ఐఐటీ(IIT), ఎన్‌ఐటీ(NIT) ర్యాంకుల ప్రకటన వచ్చింది. అయితే దీనిని అల్లు అర్జున్ ప్రమోట్ చేశాడు. ఈ ప్రకటనల్లో ఇచ్చిన సమాచారం పూర్తిగా అవాస్తవమని, ఆ తప్పుడు ప్రకటనలపై చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదు చేశాడు. అంతేకాదు ఇలాంటి తప్పుడు ప్రకటనలో నటించి అందరిని తప్పుదోవ పట్టించిన నటుడు అల్లు అర్జున్‌పై, శ్రీ చైతన్య విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో కోరాడు.
చదవండి: సినిమా ఛాన్స్.. అప్పుడు ఆస్పత్రి బెడ్‌పై ఉన్నాను: నటి
కాగా పుష్ప మూవీతో ఒక్కసారిగా బన్నీ క్రేజ్ పెరిగిపోయింది. దీంతో ఆయనకు దేశవ్యాప్తంగా బ్రాండ్ వ్యాల్యు కూడా భారీగా పెరిగింది. దీంతో పలు వ్యాపార సంస్థలకు బన్నీ బ్రాండ్ అంబాసిడర్‌గా మారాడు. వాణిజ్య ప్రకటనలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. అనేక బ్రాండ్లను ప్రమోషన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో బన్నీ తరచూ చేదు అనుభవం చూస్తున్నాడు. ఇప్పటికే జొమాటో, ర్యాపిడో ప్రకటనలో నటించి విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.