
19న విశాఖలో రాహుల్ గాంధీ పర్యటన
హుదూద్ తుఫానుతో అల్లకల్లోలమైన విశాఖపట్నంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వచ్చే ఆదివారం.. 19వ తేదీ పర్యటించనున్నారు. ఆరోజు నేరుగా ఢిల్లీ నుంచి వచ్చి, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఆయన తిరుగుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారమే విశాఖలో పర్యటించి, తక్షణ సాయంగా వెయ్యి కోట్ల రూపాయలు ప్రకటించిన విషయం తెలిసిందే.
హుదూద్ తుఫాను సరిగ్గా గత ఆదివారం నాడు.. అంటే ఈనెల 12వ తేదీన తీరం దాటింది. వారం రోజులకు అంటే మళ్లీ ఆదివారం నాడు రాహుల్ గాంధీ విశాఖకు వస్తున్నారు.