హుదూద్ సహాయ కార్యక్రమాల కోసం ప్రభుత్వం ఓ పోర్టల్ను సిద్ధం చేసింది. హుదూద్ ప్రళం, తుఫాను అనంతర పరిస్థితుల లాంటివాటిని ఇందులో పొందుపరిచారు. www.hudhud.ap.gov.in అనే ఈ వెబ్సైట్లో అన్ని వివరాలు ఉంటాయని అధికార వర్గాలు తెలిపాయి. నిపుణులైన ప్లంబర్లు, కార్పెంటర్ల లాంటి పనివాళ్ల కోసం ఈ వెబ్సైట్ ద్వారా సంప్రదించవచ్చు. తుఫాను కారణంగా విశాఖపట్నం, పరిసర ప్రాంతాల్లో, ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో భారీ నష్టం వాటిల్లింది.
ఇప్పటికి చాలా ప్రాంతాల్లో పరిస్థితులు మామూలు స్థితికి రాలేదు. దాంతో వృత్తిపనివాళ్లు కావాలంటే ఈ వెబ్సైట్ ద్వారా సమాచారం అందిస్తే వెంటనే పంపుతారు. వాళ్లకు అయ్యే లేబర్ ఛార్జీలను కూడా ప్రభుత్వం భరిస్తుందని చెబుతున్నారు. మొత్తం వెయ్యిమంది వరకు పనివారు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీనికోసం ఒక కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు.
హుదూద్ పోర్టల్ ప్రారంభం: పనివారు సిద్ధం
Published Mon, Oct 20 2014 7:35 AM | Last Updated on Sat, Aug 18 2018 8:05 PM
Advertisement