carpenters
-
వడ్రంగులతో రాహుల్ భేటీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ గురువారం ఢిల్లీలోని కీర్తినగర్ ఫరీ్నచర్ మార్కెట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా వడ్రంగులతో సమావేశమయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి కొన్ని రకాల కలప సామాగ్రిని తయారు చేసేందుకు ప్రయతి్నంచారు. వడ్రంగులు కుటుంబ పోషణ కోసం కష్టపడి పని చేస్తున్నారని, వారిలో గొప్ప కళా నైపుణ్యం ఉందని రాహుల్ ప్రశంసించారు. అందమైన కలప సామాగ్రి తయారు చేస్తున్నారని తెలిపారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేశారు. వారి నుంచి నైపుణ్యాలు నేర్చుకొనేందుకు తాను ప్రయతి్నంచానని, కొంతవరకు సఫలమయ్యానని పేర్నొన్నారు. భారత్ జోడో యాత్ర కొనసాగుతూనే ఉందని స్పష్టం చేశారు. -
భర్తను అద్దెకిచ్చిన భార్య.. అవాక్కవ్వకండి, అక్కడే ఉంది అసలు విషయం
భార్యేంటి.. భర్తను అద్దెకివ్వడమేంటని అవాక్కవ్వకండి. ఆమె భర్తను అద్దెకిచ్చింది... ఇల్లు రిపేర్, అలంకరణ, పునరుద్ధరణ వంటి పనులకోసం. సాధారణంగా ఇలాంటి పనులు ఎవరింట్లో వాళ్లే చేసుకోవచ్చు. కానీ కొందరికి సమయం దొరకదు. కొన్నిళ్లలో వృద్ధులు మాత్రమే ఉంటారు. ఇంట్లో పనులు చేసుకోలేరు. అలా అని పెద్ద వర్క్స్ చేసేవాళ్లకిస్తే ఎక్కువ చార్జ్ చేస్తారు. చిన్న పనికోసం అంత ఖర్చు చేయాలా అనిపిస్తుంది. సరిగ్గా అలాంటి పనులను అద్భుతంగా చేసే తన భర్తను ‘హైర్ మై హ్యాండీ హబ్బీ’ పేరుతో అద్దెకిచ్చిందీ మహిళ. యూకేకు చెందిన లారా యంగ్‌కు ముగ్గురు పిల్లలు. కుటుంబం బకింగ్‌హామ్ షైర్లో నివాసముంటోంది. అంతకుముందు వేర్‌హౌజ్‌లో పనిచేసిన ఆమె భర్త జేమ్స్.. ఆటిజంతో బాధపడుతున్న ఇద్దరు పిల్లలను చూసుకోవడానికి భార్య ఇబ్బంది పడటం చూసి ఉద్యోగం మానేశాడు. జేమ్స్ కార్పెంట్ వర్క్ అద్భుతంగా చేస్తాడు. పెయింటింగ్, అలంకరణ, టైల్స్ వేయడంలోనూ నిపుణుడు. తన ఇంటిని కూడా అలాగే సరికొత్తగా మార్చేశాడు. గది వైశాల్యాన్ని బట్టి బెడ్స్, కిచెన్, చెత్తనుంచి డైనింగ్ టేబుల్ ఇలా కొత్తకొత్తవాటిని సృష్టించాడు. గార్డెనింగ్‌లోనూ జేమ్స్‌ది అందెవేసిన చేయి. బంధువులు, స్నేహితుల ఇంటిని కూడా అందంగా తీర్చిదిద్దాడు. రోజువారీ ఖర్చులు పెరగడంతో ఆ కష్టాలను అధిగమించడానికి జేమ్స్ చేయదగ్గ పార్ట్ టైమ్ వర్క్ ఇదొక్కటే అనుకుంది. మోటార్ మెకానిక్స్ చదవాలనుకుంటున్న జేమ్స్ సమయానికీ సరిగ్గా సరిపోతుంది. అందుకే ఫేస్బుక్, నెక్స్ట్ డోర్ యాప్‌లో ‘హైర్ మై హ్యాండీ హబ్బీ’ పేరుతో ప్రకటన ఇచ్చింది. అవసరమున్న కొందరు ఆసక్తి చూపారు. మరికొందరు ఇదేం పద్ధతంటూ పెదవి విరిచారు. ఎవరేమనుకున్నా.. తక్కువ ఖర్చుతో వాళ్లకు సహాయం, తాము ఆర్థికంగా నిలదొక్కుకోవడమే ముఖ్యమని చెబుతోంది లారా. చదవండి: Sri Lanka: పెట్రోల్ కోసం క్యూలో రోజుల తరబడి.. -
ఉడ్ కార్వింగ్ కళాకారులపై సాక్షి స్పెషల్ రిపోర్ట్
-
‘కళ’తప్పుతున్న బతుకులు
బోధన్‌రూరల్(బోధన్): జిల్లాలో విశ్వ బ్రాహ్మణుల బతుకులు కళ తప్పుతున్నాయి. ఒకప్పుడు చేతినిండా పనితో గడిపిన విశ్వ బ్రాహ్మణులు నేడు పనులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన పెద్దపెద్ద జువెల్లరీ దుకాణాలు, బెంగాలీ కూలీలతో స్వర్ణకారులు ఉపాధిని కోల్పోతుండగా, గుజరాత్, యూపీ, రాజస్థాన్ వ్యాపారుల పోటీతో వండ్రగులు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన విశ్వబ్రాహ్మణులు కొత్త రాష్ట్రంలోనూ ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసిన శ్రీకాంత చారి విశ్వ బ్రాహ్మణుడే. కొత్త రాష్ట్రంలోనైనా తమ బతుకులు బాగు పడడం లేదని వారు వాపోతున్నారు. విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్ ఉన్నా.. ప్రభుత్వాలు ఆశించిన మేరకు నిధులు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేడు సమస్త చేతి వృత్తులకు మూల గురువు, విశ్వ బ్రాహ్మణుల ఆరాధ్యదైవం అయిన శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని స్వర్ణకారులు, వండ్రగుల జీవనంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఉపాధి కోల్పోతున్న వడ్రంగులు.. సొంత ఇంటిని నిర్మించుకునే ప్రతి ఒక్కరికి వండ్రగితో పని ఉంటుంది. ఇంటికి అవసరమైన తలుపులు, కిటికీలు, దర్వాజాలు ఇతర సామగ్రి కోసం వండ్రగులను ఆశ్రయించాల్సిందే. అయితే ప్రస్తుతం మార్కెట్లో రెడీమేడ్ ప్లైవుడ్ షాప్‌లు, కిటికీలు, తలుపులు లభిస్తుండడంతో వడ్రంగులకు గిరాకీ తగ్గింది. అంతేగాక రాజస్థాన్, గుజరాత్, యూపీ, మహరాష్ట్రల నుంచి వలస వచ్చిన వ్యాపారులు ఇక్కడ రెడీమేడ్ సామగ్రిని అమ్ముతున్నారు. దీంతో వడ్రంగులకు పని లేకుండా పోయింది. అలాగే స్వర్ణకార వృత్తుల వారు సైతం ఉపాధి కోల్పోతున్నారు. రెడీమేడ్ ఆభరణాలు, ప్రైవేట్ రంగ సంస్థలు జువెల్లరీ దుకాణాలు ఏర్పాటు చేయడంతో వీరికి గిరాకీ తగ్గింది. బెంగాలీ కూలీలతో స్థానికులకు ఉపాధి దెబ్బతింటోంది. దీనికి తోడు దొంగ బంగారం కేసులతో స్వర్ణకారుల బతుకులు చిద్రమైపోతున్నాయి. ఉపాధి కరువై ఎందరో విశ్వబ్రాహ్మణులు దినసరి కూలీలుగా, నైట్ వాచ్మెన్లు మారుతున్నారు. చేతి వృత్తులకు గురువు.. సమస్త చేతి వృత్తులకు మూలపురుషుడు శ్రీ విరాట్ విశ్వకర్మ. విష్ణువుకు సుదర్శణ చక్రాన్ని, ఈశ్వరునికి త్రిశులాన్ని, బహ్మకు ఘంటాన్ని, దేవతలకు పుష్పక విమానాన్ని, మహాశక్తికి దివ్యరథాన్ని, దేవేంద్రుడికి అమరావతి నగరాన్ని సృష్టించి ఇచ్చిన మహా పురుషుడు. చేతివృత్తుల మూల గురువు విశ్వకర్మకు, రచనాదేవిలకు జన్మించిన పుట్టిన ఐదుగురు కుమారులు. మను, మయ, త్వష్ఠ, శిల్పి, విశ్వజ్ఞలు. విశ్వకర్మ మొదటి కుమారుడు మను నుంచి వచ్చిన వృత్తి కమ్మరి. రెండో కుమారుడు మయ నుంచి వచ్చిన వృత్తి వండ్రగి. మూడో కుమారుడు త్వష్ఠ నుంచి వచ్చిన వృత్తి కంచరి. నాలుగో కుమారుడు శిల్పి నుంచి వచ్చిన వృత్తి శిల్పకార వృత్తి. ఐదో కుమారుడు విశ్వజ్ఞ నుంచి వచ్చినదే స్వర్ణకార వృత్తి. విశ్వకర్మ ఐదుగురు కుమారుల నుంచి పుట్టినవే నేటి సమాజంలోని చేతి వృత్తులు. విశ్వ బ్రాహ్మణుల సంఘం డిమాండ్లు... విశ్వకర్మలకు ప్రత్యేక పాలక మండలితో కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.1,000 కోట్లు నిధులు కేటాయించాలి. జీవో నెం.31తో కర్ర వృత్తిదారులు ఉపాధి కోల్పోయే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఈజీవోను ఉపసంహరించుకోవాలి. 50 ఏళ్లు నిండిన వారికి రూ.3వేలు పింఛన్ అందించాలి. జీవో 272 అమలు పరిచి స్వర్ణకారులపై జరిగే అక్రమ రికవరీలను అరికట్టాలి. వృత్తి నైపుణ్యం కోసం ఆధునాతన మిషనరీలపై సబ్సిడీ రుణాలను అందించాలి. పుస్తె, మట్టెలు జ్యూవెల్లరీ షాపులలో అమ్మడాన్ని నిషేధించాలి. బ్యాంకుల్లో అప్రైజర్లుగా స్థానిక స్వర్ణకారులనే తీసుకోవాలి. పింఛన్ అందించాలి ఎన్నో ఏళ్లుగా విశ్వ బ్రాహ్మణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు. చేతి వృత్తులకు ఆదరణ కరువై ఉపాధి కోల్పోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విశ్వ బ్రాహ్మణులకు ప్రత్యేక నిధులు కేటాయించి 50 ఏళ్లు నిండిన విశ్వ బ్రహ్మణులందరికి రూ.3వేలు పింఛన్ అందించాలి. – కస్తురోజు కాళిదాస్ చారి, స్వర్ణ కార సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, బోధన్ రూ.1,000 కోట్లు నిధులుకేటాయించాలి విశ్వకర్మలకు ప్రత్యేక పాలక మండలితో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. రూ.1,000 కోట్లు నిధులు కేటాయించాలి. విశ్వ బ్రాహ్మణుల చేతి వృత్తులను పోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వృత్తి నైపుణ్యం కోసం ఆధునాతన మిషనరీలు అందజేయాలి. ఇందుకుగాను రూ.5లక్షల వరకు సబ్సిడీ రుణాలను అందించాలి. – మారోజు సుధాకర్ చారి, విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు, బోధన్ -
సిరుల కల్ప‘తరువు’
సిరిమాను తయారీలో వడ్రంగుల స్వచ్ఛంద సేవ ఏళ్ల తరబడి వస్తున్న ఆనవాయితీ విజయనగరం టౌన్ : పైడితల్లి అమ్మవారి దర్శనం అదష్టం. సిరిమానోత్సవం అద్భుతం. ఏళ్ల తరబడి నిర్విఘ్నంగా సాగుతున్న సిరిమానోత్సవంలో సిరిమానుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. సిరిమాను గుర్తించడం, తయారీలో ఎందరో వడ్రంగుల భాగస్వామ్యం ఉంటుంది. ఏ పనులున్నా.. ఎక్కడున్నా ఏటా సిరిమానోత్సవానికల్లా వారంతా పట్టణానికి చేరుకుంటారు. భక్తిశ్రద్ధలతో సిరిమానును తయారు చేస్తారు. ఈ ఏడాది కూడా వీరి చేతుల్లో ఊపిరి పోసుకుంటున్న సిరిమాను, గిలక, పీటల తయారీ పూర్తి కావొచ్చింది. అమ్మవారి చూపిన బాటలో.. సిరిమాను తయారీకి చింతమానునే ప్రధానంగా పైడితల్లి కోరుకుంటుంది. ఏటా అమ్మవారు పూజారి కలలో కనిపించి సిరిమానుకు దారి చూపించడం ఆనవాయితీ. ఆ దిశలో పూజారి, ఆలయ సిబ్బంది వెళ్లి అన్వేషిస్తారు. అమ్మవారి సిరిమానుగా సాక్షాత్కరించిన చింతమాను సిరిమానుగా నిర్ణయించి అమ్మవారికి పూజాదికాలను నిర్వహిస్తారు. సిరిమాను సాక్షాత్కరించిన గ్రామంలో పండగ వాతావరణం నెలకొంటుంది. పైడితల్లి తమ గ్రామానికి వచ్చిందని గ్రామస్తులు ఉప్పొంగిపోతారు. భాజా భజంత్రీలతో గ్రామోత్సవం నిర్వహిస్తారు. పదివేలమందికి పైగా భోజన సదుపాయాలను ఏర్పాటు చేస్తారు. ఈ ఏడాది ధర్మపురి ప్రాంతంలో అమ్మవారు సాక్షాత్కారించిన చింతచెట్టుకు పూజలు నిర్వహించి హుకుంపేటలోని పూజారి ఇంటì వద్దకు తరలించారు. సిరిమాను తయారీలో కొన్ని కుటుంబాల వడ్రంగులు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. సిరిమాను బాధ్యతలను తలా పంచుకుంటారు. సిరిమాను, గిలకలు, పూజారి పీట, ఇరుసుమాను, రథాలను తయారు చేసి వాటికి రంగులు అద్దడంలో తలమునకలయ్యారు. తాత, తండ్రుల నుంచి భాగస్వామ్యం–కనిమెళ్ల సత్యం చిన్నప్పటి నుంచి మా నాన్నతో కలిసి సిరిమాను చెక్కడానికి వచ్చేవాడిని. ఎంతో పవిత్రమైన చింతమానును చెక్కుతుంటే చెప్పలేనంత ఆనందం కలిగేది. మా తాత తర్వాత నాన్న.. ఇప్పుడు నేను సిరిమాను చెక్కుతున్నా. ఆ తల్లి దయతో నా కుటుంబం ఎంతో ఆనందంగా ఉంది. రెండ్రోజుల్లో పనులు పూర్తి––తాళ్లపూడి సోమునాయుడు ఎంతో కష్టపడి తల్లికోసం చెక్కే సిరిమానుపై అమ్మవారు ఆకాశవీధుల్లో విహరిస్తూ దీవెనలందించడం మాకెంతో ఆనందకరం. ఒక్కొక్క రథం వెళ్తుంటే అప్పటి వరకు పడినన కష్టం మరిచిపోతాం. కష్టం మరిచి, ఎంతో ఉత్సాహంగా పండగ చేసుకుంటాం. రెండ్రోజుల్లో పనులు పూర్తవుతాయి. నా అదష్టం–కనిమెళ్ల రమణ పైడితల్లి జాతర నిర్వహణకు ఎంతో కష్టపడతాం. రాత్రనక, పగలనక పనుల్లో నిమగ్నమవుతాం. వడ్రంగుల సమష్టి కషితోనే ఇది విజయవంతమవుతుంది. హుకుంపేటలో నెలరోజులూ పండగ వాతావరణం ఉంటుంది. సిరిమాను తయారీలో భాగస్వామిని కావడం నా అదష్టం భక్తిప్రపత్తులతో తయారీ–పైడిరాజు సిరిమాను సహా గిలకలు, పూజారి కూర్చొనే పీటను తయారు చేస్తాం. పెద్ద పెద్ద తాళ్లతో కట్లు కడతాం. రోజూ స్నానపానాదులు పూర్తిచేసుకుని భక్తితో సిరిమానుకు మొక్కి బొట్టు పెట్టాకే పనులు ప్రారంభిస్తాం. సిరిమాను సిద్ధమైంది. ఇరుసుమాను పనులు జరుగుతున్నాయి. ఎన్ని పనులున్నా వస్తా–కొండబాబు ఇరవయ్యేళ్లుగా అమ్మ సేవలోనే ఉన్నాను. ఆ తల్లి కరుణా కటాక్షాలు మాపై ఉంటాయి. అందుకే ఏ ఊర్లో పనులకు వెళ్లినా పండగ సమయానికి ఊరొచ్చి వారం రోజులపాటు సిరిమాను తయారీలో పాల్గొంటాను. భోజన, వసతి సదుపాయాలు నిర్వాహకులే ఏర్పాటు చేస్తారు. ఇది నా భాగ్యం–వసంత సూరి తల్లిసేవలో 30 ఏళ్లు గడిచిపోయాయి. ఈ ఏడాది త్వరితగతిన పనులు పూర్తయ్యాయి. స్వచ్ఛందంగానే మేమంతా కలసి పని చేస్తాం. తరతరాల నుంచి వస్తున్న ఆచారం. 12విజెడ్‌జి 171 : సిరిమానును చెక్కుతున్న వడ్రంగులు \ -
హుదూద్ పోర్టల్ ప్రారంభం: పనివారు సిద్ధం
హుదూద్ సహాయ కార్యక్రమాల కోసం ప్రభుత్వం ఓ పోర్టల్‌ను సిద్ధం చేసింది. హుదూద్ ప్రళం, తుఫాను అనంతర పరిస్థితుల లాంటివాటిని ఇందులో పొందుపరిచారు. www.hudhud.ap.gov.in అనే ఈ వెబ్సైట్లో అన్ని వివరాలు ఉంటాయని అధికార వర్గాలు తెలిపాయి. నిపుణులైన ప్లంబర్లు, కార్పెంటర్ల లాంటి పనివాళ్ల కోసం ఈ వెబ్సైట్ ద్వారా సంప్రదించవచ్చు. తుఫాను కారణంగా విశాఖపట్నం, పరిసర ప్రాంతాల్లో, ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో భారీ నష్టం వాటిల్లింది. ఇప్పటికి చాలా ప్రాంతాల్లో పరిస్థితులు మామూలు స్థితికి రాలేదు. దాంతో వృత్తిపనివాళ్లు కావాలంటే ఈ వెబ్సైట్ ద్వారా సమాచారం అందిస్తే వెంటనే పంపుతారు. వాళ్లకు అయ్యే లేబర్ ఛార్జీలను కూడా ప్రభుత్వం భరిస్తుందని చెబుతున్నారు. మొత్తం వెయ్యిమంది వరకు పనివారు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీనికోసం ఒక కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు.