
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ గురువారం ఢిల్లీలోని కీర్తినగర్ ఫరీ్నచర్ మార్కెట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా వడ్రంగులతో సమావేశమయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి కొన్ని రకాల కలప సామాగ్రిని తయారు చేసేందుకు ప్రయతి్నంచారు.
వడ్రంగులు కుటుంబ పోషణ కోసం కష్టపడి పని చేస్తున్నారని, వారిలో గొప్ప కళా నైపుణ్యం ఉందని రాహుల్ ప్రశంసించారు. అందమైన కలప సామాగ్రి తయారు చేస్తున్నారని తెలిపారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేశారు. వారి నుంచి నైపుణ్యాలు నేర్చుకొనేందుకు తాను ప్రయతి్నంచానని, కొంతవరకు సఫలమయ్యానని పేర్నొన్నారు. భారత్ జోడో యాత్ర కొనసాగుతూనే ఉందని స్పష్టం చేశారు.