Furniture Market
-
వడ్రంగులతో రాహుల్ భేటీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ గురువారం ఢిల్లీలోని కీర్తినగర్ ఫరీ్నచర్ మార్కెట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా వడ్రంగులతో సమావేశమయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి కొన్ని రకాల కలప సామాగ్రిని తయారు చేసేందుకు ప్రయతి్నంచారు. వడ్రంగులు కుటుంబ పోషణ కోసం కష్టపడి పని చేస్తున్నారని, వారిలో గొప్ప కళా నైపుణ్యం ఉందని రాహుల్ ప్రశంసించారు. అందమైన కలప సామాగ్రి తయారు చేస్తున్నారని తెలిపారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేశారు. వారి నుంచి నైపుణ్యాలు నేర్చుకొనేందుకు తాను ప్రయతి్నంచానని, కొంతవరకు సఫలమయ్యానని పేర్నొన్నారు. భారత్ జోడో యాత్ర కొనసాగుతూనే ఉందని స్పష్టం చేశారు. -
రూ.200 కంటే తక్కువకే ఫర్నీచర్
హైదరాబాద్ : స్వీడిష్‌కు చెందిన ఫర్నీచర్ దిగ్గజ కంపెనీ ‘ఐకియా’ భారత్‌లో ధరల యుద్ధానికి సిద్ధమైంది. ఈ జూలై నెలలో హైదరాబాద్‌లో తన ఫర్నీచర్ స్టోర్‌ను నెలకొల్పి, తొలిసారి భారత్‌లోకి అడుగుపెట్టబోతోంది. తొలిసారి భారత మార్కెట్లోకి వస్తున్న క్రమంలో తన 15 శాతం ఉత్పత్తులను 200 రూపాయలకు లేదా అంతకంటే తక్కువకే ఆఫర్ చేయబోతున్నట్టు టాప్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. ఐకియా ప్రపంచంలోనే అతిపెద్ద ఫర్నీచర్ రిటైలర్. సరసమైన ధరల్లో ఈ కంపెనీ తన ఉత్పత్తులను ఆఫర్చేస్తోంది. భారత వినియోగదారుల కోసం ఈ ధరలను మరింత తగ్గించబోతున్నట్టు తెలిపారు. ‘తక్కువ ధరలతో మేము భారత మార్కెట్లోకి ఎంతో విశ్వాసంతో ప్రవేశిస్తున్నాం. స్టోర్ ప్రారంభించినప్పుడు 15 శాతం ఉత్పత్తులను అంటే 1000 ప్రొడక్ట్‌లను 200 రూపాయల కంటే తక్కువకు ఆఫర్ చేస్తాం’ అని ఐకియా ఇండియా మహారాష్ట్ర మార్కెట్ మేనేజర్ పర్ హార్నెల్ చెప్పారు. తమ రెండో స్టోర్‌ను ముంబైలో ఏర్పాటు చేస్తామని, దాన్ని 2019 మధ్యలో లాంచ్ చేయనున్నట్టు పేర్కొన్నారు. ఆశ్చర్యకరంగా ఐకియా, ముంబై లాంచ్ అనంతరం తన ఆన్లైన్ స్టోర్‌ను కూడా ఏర్పాటు చేయనుంది. డిజిటల్ విపరీతంగా పెరుగుతున్న క్రమంలో ఇప్పటి వరకు ఈ కంపెనీ ఆన్లైన్ అమ్మకాలపై అంత సీరియస్‌గా తీసుకోకపోవడం గమనార్హం. హోమ్ ఫర్నీసింగ్ కన్సల్టెన్సీ వంటి కొత్త బిజినెస్ మోడల్స్‌ను కూడా ఐకియా పరిశీలిస్తోంది. ఐకియా ఇటీవలే అర్బన్ క్లాప్ అనే మొబైల్ ఆధారిత సర్వీసు ప్లాట్‌ఫామ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. తన హైదరాబాద్ స్టోర్‌కు ఇదే ఫర్నీచర్ సర్వీసు పార్టనర్. తక్కువ ధరలకే సర్వీసులు అందజేయడానికి ఇది అనుమతి ఇస్తుందని హార్నెల్ చెప్పారు. భారత హోమ్ ఫర్నీచర్, ఫర్నీసింగ్ మార్కెట్ 2016 నుంచి 2021 మధ్యలో 13 శాతం కాంపౌండ్ వార్షిక వృద్ధిని సాధించినట్టు కన్సల్టెన్సీ సంస్థ వాజిర్ అడ్వయిజర్స్ పేర్కొంది. 2016 సెప్టెంబర్ నుంచి 2017 ఆగస్టు వరకు ఐకియా గ్రూప్ రెవెన్యూలు 1.7 శాతం పెరిగాయి. కంపెనీ వెబ్సైట్ 2.3 బిలియన్ హిట్స్‌ను సాధించింది. గ్లోబల్‌గా తమ రిటైల్ స్టోర్లను 936 మిలియన్ మంది సందర్శించినట్టు కూడా పేర్కొంది. మొత్తం 49 మార్కెట్లలో 403 స్టోర్లను ఐకియా కలిగి ఉంది. -
3,700 కోట్లకు లగ్జరీ ఫర్నిచర్ మార్కెట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విలాసవంతమైన ఫర్నిచర్ మార్కెట్ పరిమాణంభారత్‌లో రూ.3,700 కోట్లుందని ఇటలీకి చెందిన షటోవ్‌డాక్స్ తెలిపింది. ఏటా ఈ మార్కెట్ 15-20 శాతం వృద్ధి చెందుతోందని కంపెనీ దక్షిణాసియా హెడ్ క్లెడ్విన్ పసానే శుక్రవారం తెలిపారు. మొత్తం మార్కెట్ పరిమాణంలో 60 శాతంమేర విదేశీ ఫర్నిచర్ ఉంటోందని పేర్కొన్నారు. ఇక్కడి బంజారాహిల్స్‌లో మల్టీబ్రాండ్ ఇటాలియన్ ఫర్నిచర్ షోరూం ‘వాంటో’ ప్రారంభమైంది. ఈ సందర్భంగా వాంటో సీవోవో ఎల్.అదిత్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటలీ నుంచి ఫర్నిచర్‌ను తెచ్చుకునే కస్టమర్లూ ఉన్నారని చెప్పారు. ఇలా రూ.600 కోట్ల విలువైన ఫర్నిచర్ ఏటా వస్తోందని వివరించారు. లగ్జరీ ఫర్నిచర్ వాడకంలో ఢిల్లీ, ముంబై తర్వాత స్థానంలో హైదరాబాద్ నిలుస్తుందన్నారు. మరో 45 బ్రాండ్లు..: షటోవ్డాక్స్కు భారత భాగస్వామిగా వాంటో వ్యవహరిస్తోంది. ఔట్లెట్లో ప్రస్తుతం ఎంఅండ్‌డీ, ఫ్లూ, నటుజ్జి వంటి 15 ఇటలీ ఫర్నిచర్ బ్రాండ్లున్నాయి. మరో 45 బ్రాండ్లను పరిచయం చేస్తామని అదిత్ తెలిపారు. బెంగళూరులో వారం రోజుల్లో, ఢిల్లీ, పుణేలో మార్చికల్లా స్టోర్లు ఏర్పాటు చే స్తామన్నారు. ‘ఏటా నాలుగు స్టోర్లు నెలకొల్పాలన్నది ల క్ష్యం. ఒక్కో స్టోర్‌కు రూ.2-3 కోట్ల వ్యయం అవుతుంది. ఫ్రాంచైజీ విధానంలోనూ ఇవి రానున్నాయి’ అని తెలిపారు. వాంటో స్టోర్‌లో ఉత్పత్తుల ధర రూ.9 వేల నుంచి ప్రారంభమై రూ.21 లక్షల వరకు ఉంది.