ప్రభుత్వానికి ఎప్పుడూ మిడిమిడి జ్ఞానం ఉండకూడదని ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక వ్యాఖ్యానించింది.
ప్రభుత్వానికి ఎప్పుడూ మిడిమిడి జ్ఞానం ఉండకూడదని ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక వ్యాఖ్యానించింది. ప్రకృతితో ఆడుకుంటే హుదూద్ లాంటి మరిన్ని విధ్వంసాలు ఖాయమని వేదిక ప్రతినిధులు మండిపడ్డారు. అభివృద్ధి పేరు మీద విచ్చలవిడిగా ప్రకృతి విధ్వంసానికి పాల్పడటం వల్లనే ఇలాంటి విపత్తులు సంభవిస్తున్నాయన్నారు.
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో ఇటీవల హుదూద్ తుఫాను తీవ్ర ప్రభావం చూపిన చోట్ల రెండు రోజుల పాటు ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక బృందం సభ్యులు పర్యటించారు. అనంతరం విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడారు.