
తుఫాన్ బాధితులను ఆదుకుంటాం: టీపీసీసీ
ఆంధ్రప్రదేశ్ లో హుదూద్ తుఫాన్ బాధితులను ఆదుకోవాలని తెలంగాణ పీసీసీ(టీపీసీసీ) నిర్ణయం తీసుకుంది
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో హుదూద్ తుఫాన్ బాధితులను ఆదుకోవాలని తెలంగాణ పీసీసీ(టీపీసీసీ) నిర్ణయం తీసుకుంది. సోమవారం ఉదయం గాంధీభవన్ లో ఏర్పాటైన సమావేశంలో పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. తుఫాన్ తాకిడికి గురైన ప్రాంతాలకు బియ్యం, ఇతర నిత్యవసర వస్తువులను పంపించాలని టీపీసీసీ నిర్ణయం తీసుకుంది అని అన్నారు.
హదూద్ తుఫాన్ ను కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. రోడ్డు, రవాణా వ్యవస్థను వెంటనే పునరుద్దరించాలని ఏపీ ప్రభుత్వానికి పొన్నాల సూచించారు.