
వైఎస్సార్ సీపీ నిరసన కార్యక్రమాలు వాయిదా
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఈ నెల 16న చేపట్టాలనుకున్న నిరనస కార్యక్రమాలను వాయిదా వేస్తున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ దుర్మార్గాలకు నిరనసగా ఈ నెల 16న చేపట్టాలనుకున్న నిరనస కార్యక్రమాలను వాయిదా వేస్తున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈమేరకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. హుదూద్ తుఫాన్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
తీరప్రాంతాల్లో తుఫాన్ సృష్టించిన విలయంపై వైఎస్ జగన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనాలని పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు ఆయన విజ్ఞప్తి చేశారు.