
బలవంతంగా అయినా వారిని ఖాళీ చేయించాలి
హదూద్ తుఫాను దృష్ట్యా ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించాలని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సూచించారు.
హైదరాబాద్ : హదూద్ తుఫాను దృష్ట్యా ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించాలని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సూచించారు. ప్రాణహాని జరగకుండా లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన శనివారమిక్కడ కోరారు. ఒకవేళ ప్రజలు తమ నివాసాల నుంచి తరలి వెళ్లేందుకు నిరాకరిస్తే, కలెక్టర్లు తమకున్న అధికారల మేరకు బలవంతంగా అయినా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రఘువీరా సూచన చేశారు. తుఫాను నేపథ్యంలో ప్రభుత్వం కూడా జన్మభూమి కార్యక్రమాన్ని వాయిదా వేయాలని ఆయన డిమాండ్ చేశారు.