'విద్యుత్'ను పునరుద్ధరించడానికి మరో మూడు రోజులు
విశాఖపట్నం: పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా పునరుద్ధరించడానికి మరో రెండు మూడు రోజులు పట్టే అవకాశం ఉందని విశాఖపట్నం ఎంపి హరిబాబు తెలిపారు. బుధవారం నుంచి తాగునీరు అందించడానికి ప్రయత్నాలు ప్రారంభించామని ఆయన అన్నారు. తుఫాన్ బాధితులకు విజయవాడ నుంచి నిత్యవసర వస్తువులు, కూరగాయలు తెప్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని హరిబాబు తెలిపారు.
హదూద్ తుఫాన్ సృష్టించిన బీభత్సం కారణంగా ఉత్తరాంధ్రలో విద్యుత్ సరఫరా, రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. తుఫాన్ బాదితులను పరామర్శించడానికి ప్రధాని నరేంద్రమోడీ విశాఖపట్నం చేరుకున్నారు. విశాఖ ప్రధాన కూడళ్లను మోడీ పరిశీలిస్తున్నారు.