Haribabu
-
సెల్ఫీ.. యువకుడి ఆత్మహత్య! గ్రామంలో ఇద్దరి మరణంతో విషాద ఛాయలు..
నిజామాబాద్: మండలంలోని భాగిర్తిపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సాయికుమార్ గురువారం తెలిపారు. గ్రామానికి చెందిన మామిడి హరిబాబు (27) బుధవారం సాయంత్రం తన పొలం వద్దకు వెళ్లాడు. అక్కడి నుంచి తన చిన్నాన్న కుమారుడైన దుర్గ శైలంనకు తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో పంపాడు. అందులో తన ఆత్మహత్యకు గ్రామానికి చెందిన మంద నవీన్, తన అత్త మెదక్ జిల్లా అక్కన్నపేటకు చెందిన పిట్ల లక్ష్మి, తన భార్య నవనీత కారణమని వీడియోలో పేర్కొన్నాడు. వీడియో చూసిన శైలం విషయాన్ని హరిబాబు కుటుంబీకులకు చెప్పాడు. వారు పొలం వద్దకు వెళ్లి చూడగా అక్కడ ఉన్న చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. వెంటనే కామారెడ్డి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి తండ్రి నారాయణ ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. కడుపు నొప్పి భరించలేక వృద్ధుడు.. కాగా, ఇదే గ్రామమైనటువంటి భాగిర్తిపల్లిలో కడుపునొప్పి భరించలేక వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సాయికుమార్ తెలిపారు. గ్రామానికి చెందిన గొండ్రు చిన్న నారాయణ (65) రెండేళ్లుగా కడుపు నొప్పితో బాధ పడుతున్నాడు. ఆస్పత్రుల్లో చూపెట్టుకున్నా నయం కాలేదు. ఈ క్రమంలో శుక్రవారం ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య మైసమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై చెప్పారు. గ్రామంలో విషాదఛాయలు భాగిర్తిపల్లిలో ఒకే రోజు ఇద్దరి అంత్యక్రియలు జరగడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన హరిబాబు, నారాయణ అంత్యక్రియలు గురువారం సాయంత్రం గ్రామంలో నిర్వహించారు. -
గవర్నర్ గా నియమించినందుకు ధన్యవాదాలు : హరిబాబు
-
వ్యతిరేకతను కేంద్రం ముందే ఊహించింది : హరిబాబు
సాక్షి, విశాఖపట్టణం : పౌరసత్వ సవరణ చట్టంపై ఈశాన్య రాష్ట్రాల్లో వస్తున్న వ్యతిరేకతను కేంద్రం ముందే ఊహించిందని మాజీ బీజేపీ ఎంపీ హరిబాబు శుక్రవారం వెల్లడించారు. ఇది చాలా చిన్న సవరణ. మైనార్టీల గురించి నెహ్రూ - లియాకత్ అలీలు చేసుకున్న ఒప్పందం పొరుగు దేశాల్లో సరిగ్గా అమలు చేయలేదు. అందుకని భారతదేశానికి వలస వచ్చి ఐదేళ్లు నివాసం పూర్తి చేసుకున్న వాళ్లకు పౌరసత్వం ఇచ్చే చట్టం ఇది. దీని వల్ల ఏ పౌరుడి పౌరసత్వం తొలగిపోదని వివరణనిచ్చారు. కావాలనే కొందరు మైనార్టీలను రెచ్చగొడుతున్నారని, ఈ చట్టం ముస్లింలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్, ఆప్ వంటి పార్టీలు చట్టసవరణను వ్యతిరేకిస్తున్నాయని, నాడు లెఫ్ట్ నేతలే చట్టసవరణ కావాలని పట్టుబట్టాయని పేర్కొన్నారు. ఇప్పటి లెఫ్ట్ నేతల మాటలు మాత్రం విరుద్ధంగా ఉన్నాయని విమర్శించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే మైనార్టీలను రెచ్చగొడుతున్నారు తప్ప వారి వాదనలో బలం లేదని తెలిపారు. ఇక ఆర్టికల్ 14కు తూట్లు పొడుస్తున్నారంటూ మీడియాలో కథనాలు రాస్తున్న మాజీ మంత్రి చిదంబరాన్ని తప్పుపట్టారు. ఆయన చెప్తున్నట్టు ఇందులో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. -
‘చంద్రబాబుకు మోదీ భయం పట్టుకుంది’
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకి ప్రధాని నరేంద్ర మోదీ భయం పట్టుకుందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. శుక్రవారం బీజేపీ ఎంపీ హరిబాబుతో కలిసి ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ.. టీడీపీ ఎంపీలు డ్రామా రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. యూసీలు అడిగితే తామేమన్న గుమస్తాలమా అంటున్న టీడీపీ నేతలకు ప్రభుత్వ అధికారులంటే అంత చులకనగా కనబడుతున్నారా అని ప్రశ్నించారు. టీడీపీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నట్టేటా ముంచిందని ఎద్దేవా చేశారు. 600 హామీలు ఇచ్చిన టీడీపీ వాటిని అమలు చేయకుండా డ్రామాలు ఆడుతుందని మండిపడ్డారు. ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులు ఏపీకి ఇస్తున్న చంద్రబాబు కేంద్రాన్ని నిందిస్తూ.. ప్రజలను మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేవారు. కూర్చున్న కొమ్మనే నరుక్కునే విధంగా టీడీపీ వ్యవహరిస్తోందని తెలిపారు. ప్రచార ఆర్భాటం కోసం చంద్రబాబు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. హైకోర్టు నిర్మాణానికి 8 నెలల సమయం ఇచ్చినా టీడీపీ ప్రభుత్వం కట్టలేకపోయిందని.. అలాంటి వారు ప్రపంచంలోనే 4వ పెద్ద రాజధాని నిర్మిస్తామంటే ఎలా నమ్మాలి అని ప్రశ్నించారు. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, చంద్రబాబు నాయుడుని తిడుతున్నారో, పొగుడుతున్నారో ఆ పార్టీ నేతలనే అడగాలన్నారు. హరిబాబు మాట్లాడుతూ.. కేంద్రం నిధులు ఇవ్వడం లేదంటూ టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. 2018-19 ఏడాదికి గానూ 6243 కోట్ల రూపాయల నరేగా నిధులు విడుదలయ్యాయని తెలిపారు. గతేడాది కంటే ఈ సారి వెయ్యి కోట్లు అదనంగా నిధులు విడుదల చేసినట్టు పేర్కొన్నారు. కేంద్రం చేస్తున్న సహాయాన్ని టీడీపీ చిన్నదిగా చూపే ప్రయత్నం చేయడం మంచింది కాదన్నారు. కాంగ్రెస్‌ది నక్క తోక కాదని.. అది కుక్క తోక మాత్రమేనని వ్యాఖ్యానించారు. -
తెలంగాణలో బీజేపీదే అధికారం: ఎంపీ హరిబాబు
సాక్షి, కీసర: దశాబ్దాల కార్యకర్తల కష్టం ఫలించే రోజు దగ్గరలోనే ఉందని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, విశాఖ (వైజాగ్) ఎంపీ కంభం పాటి హరిబాబు అన్నారు. ఆదివారం కీసరలోని కేబీఆర్ కన్వెన్షన్‌లో నిర్వహించిన బీజేపీ మేడ్చల్ అసెంబ్లీ బూత్ నాయకుల ప్రత్యేక శిక్షణ శిబిరానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత దేశ శక్తిని ప్రపంచవ్యాప్తంగా చాటిన నరేంద్రమోదీ నాయకత్వం కారణంగా దేశం అభివృద్ధి దిశగా అవినీతి లేని పాలన సాగుతోందన్నారు. అసమర్థ టీఆర్ఎస్ను, మహాకూటమిని ఓడించి తెలంగాణలో బీజేపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. వారిని పోలింగ్ దిశగా తీసుకెళ్లాల్సిన బాధ్యత బూత్ నాయకులదేనన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఐదేళ్లుగా నిత్యం ప్రజలతో ఉంటూ , డంపింగ్‌యార్డు ఎత్తివేసేలా తీర్పురావడానికి కారణమైన మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొంపల్లి మోహన్‌రెడ్డి గెలుపు ఖాయమన్నారు. కార్యకర్తలంతా సమష్టిగా ముందుకెళ్లి ఈసారి ఎన్నికల్లో బిజేపీ అభ్యర్థి గెలుపునకుకృషి చేయాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి కొంపల్లిమోహన్‌రెడ్డి, రాష్ట్రనాయకులు బిక్కు నాయక్, విక్రంరెడ్డి, సురేష్, శ్రీసుధ, రామోజీ, వెంకట్‌రెడ్డి, గుండ్ల ఆంజనేయులు, జిల్లాల తిరుమల్‌రెడ్డి, సుధాకర్‌నాయక్, శ్రీనివాస్, సుజాత, రజినీరెడ్డి, ఈశ్వర్‌గౌడ్, కిషన్‌రావు, అసెంబ్లీ కన్వీనర్ అమరం మోహన్‌రెడ్డి, బోడ శ్రీనివాసరావు, ఏనుగు రాజిరెడ్డి, రాగుల అశోక్, వివిధ మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
పేరం హరిబాబు ఆస్తులపై ఐటీ దాడులు
చిత్తూరు,తిరుపతి రూరల్/పిచ్చాటూరు: టీడీపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి.. పేరం గ్రూప్స్ అధినేత పేరం హరిబాబుకు చెందిన ఆస్తులపై ఐటీ శాఖ దాడులు నిర్వహించడం జిల్లాలో కలకలం రేపింది. ఆయన ఇళ్లు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లపై మంగళవారం ఆదాయపు పన్నుశాఖాధికారులు దాడులు నిర్వహించారు. తిరుపతి, పిచ్చాటూరులోని ఇళ్లు,కార్యాలయాల్లో ముమ్మర తనిఖీలు చేశారు. ఆదాయానికి తగినట్టు పన్నులు చెల్లించకపోవటంతో ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయినా స్పందన లేకలేకపోవటంతో పూర్తి ఆధారాలతో ఈ దాడులు చేసినట్లు ఓ ఐటీ అధికారి తెలిపారు. తిరుపతిలోని విద్యానగర్‌లోని ఇళ్లు, తిరుపతిలోని కార్యాలయం, బంధువుల ఇళ్లు, పిచ్చాటూరు మండలంలోని ఆయన స్వగ్రామం గోవర్దనగిరిలో సైతం ఈ దాడులు జరిగాయి. హరిబాబుపై దాడుల నేపథ్యంలో తిరుపతి, పిచ్చాటూరులో ధనిక వర్గాలు ఉలిక్కిపడ్డాయి. ప్రమోటర్ నుంచి కోట్లకు.... గోవర్దనగిరికి చెందిన పేరం హరిబాబు గతంలో జనచైతన్య రియల్ ఎస్టేట్ సంస్థలో ప్రమోటర్‌గా చేరారు. తర్వాత పేరం గ్రూప్ ద్వారా సొంతగా రియల్ ఎస్టేట్‌ను ప్రారంభిం చారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అండతో తన వ్యాపారాలను విస్తరించాడు. చంద్రగిరి నియోజకవర్గంలో తెరచాటు రాజకీయాలను చేశాడు. ఓ గ్రూపును నడిపించాడు. రాజకీయ, వ్యాపార ప్రముఖులతో వియ్యం పొంది, తన వ్యాపారాలను విస్తరించి వ్యక్తిగతంగా బలోపేతం అయ్యారు. కోట్లకు పడగలెత్తాడు. తిరుపతి నుంచి బెంగళూరు, హైదరాబాబు, విశాఖపట్నంలో సైతం లేఅవుట్లు వేశాడు. ఆదాయానికి తగినట్లు ప్రభుత్వానికి పన్నులు చెల్లించలేదని, నోటీసులు ఇచ్చినా స్పందన లేదని అందుకే దాడులు చేస్తున్న ట్లు ఐటీ అధికారులు పేర్కొంటున్నారు. చంద్రగిరి టిక్కెట్టు ఆశించి.. పేరం హరిబాబు గతంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉండేవారు. 2013లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ముందు చంద్రబాబు ఉపయోగించిన కాన్వాయ్ కారులో హరిబాబు తండ్రి రామకష్ణమనాయుడు రూ.7 కోట్లను తరలిస్తూ ఐటీ అధికారులకు పట్టుపడ్డారు. లెక్కలు సక్రమంగా లేకపోవడంతో హరిబాబు తండ్రిపై కేసు సైతం నమోదు అయింది. నాడు చంద్రబాబు బినామి హరిబాబు అనే ప్రచారం విస్తతంగా జరిగింది. చంద్రబాబు సన్నిహితంతో టీడీపీ తరుపున 2014లో చంద్రగిరి టిక్కెట్టు ఆశించారు. చివరి నిమిషంలో గల్లా అరుణకుమారికి టిక్కెట్టు దక్కటంతో నిరాశ చెందాడు. భారీగా ఆస్తులు,డాక్యుమెంట్లు గుర్తింపు.. పేరం హరిబాబు ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడుల నేపథ్యంలో ఐటీ అధికారులు భారీగా ఆస్తులు, కోట్ల విలువైన డాక్యుమెంట్లను స్వాధీ నం చేసుకున్నట్లు సమాచారం. కోట్ల విలువైన బం గారం, నగలను సైతం గుర్తించారు. ఆదాయంగా చూపని ఆస్తులను భారీగానే పట్టుపడినట్లు ఓ అధికారి వెల్లడించారు. మంగళవారం అర్ధరాత్రి వరకు ఈ దాడులు జరిగాయి. బుధవారం కూడా కొనసాగే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
విశాఖ రైల్వే జోన్ : ఏంపీ హరిబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత
-
అమ్మను బతికించడం కోసమే స్మగ్లరయ్యా!
సాక్షి, తిరుపతి : ఎర్రచందనం అక్రమ రవాణా చేసిన కేసుల్లో జబర్దస్త్ షోలో కమెడియన్‌గా నటించిన శ్రీహరి(హరిబాబు) మంగళవారం టాస్క్‌ఫోర్స్ ఐజీ కాంతారావు ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించి పలు విషయాలను శ్రీహరి వెల్లడించాడు. తొలుత తాను ప్రభుత్వ ఉద్యోగినని చెప్పిన నటుడు ఆపై జల్సాలకు అలవాటుపడి భారీ మొత్తాల్లో అప్పు చేసి జాబ్ మానేసినట్లు తెలిపాడు. టాస్క్‌ఫోర్స్ అధికారులు తీసిన ఈ వీడియో వైరల్‌గా మారింది. వాటిని తీర్చేందుకు చాలా కష్టపడ్డానని శ్రీహరి.. తన తల్లి ఆరోగ్యం విషయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నట్లు చెప్పాడు. నాలుగేళ్ల కిందట తన తల్లి తీవ్ర అనారోగ్యానికి లోనయ్యారని, ఆస్పత్రికి తీసుకెళ్తే డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యహరించారని చెప్పాడు. దాంతో డబ్బుల కోసం ఫ్రెండ్ ద్వారా తొలిసారి స్మగ్లింగ్ చేసి వచ్చిన డబ్బులతో తల్లికి ట్రీట్మెంట్ ఇప్పించినట్లు అంగీకరించాడు. అయితే గతంలో తొలిసారి కేసు నమోదు చేశాక.. ఇప్పుడు తనకేం సంబంధం లేకపోయినా నాలుగేళ్లకు మరో కేసు నమోదు చేశారని ఆందోళనకు గురయ్యాడు. గతంలో తనతో కలిసి పనిచేసిన శ్రీనివాసులురెడ్డి దొరికిపోవడంతో ఏం చేయాలో పాలుపోక తనపేరు చెప్పాడన్నాడు. అయితే గతంలో తనపై నమోదైన తొలికేసు సమయంలో తాను స్మగ్లింగ్ చేయడం నిజమే కనుక నిజాయితీగా తాను లొంగిపోయానని.. ఆ కేసులో శిక్ష అనుభవించేందుకు సిద్ధమని తెలిపాడు హరిబాబు. తాను ఎప్పుడో వదిలేసిన ఈ పనికి ప్రస్తుతం తప్పుడు కేసులు బనాయించారని, ఆ కారణంతోనే నాలుగేళ్లు తనపేరు మీడియాకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించాడు. అర్బన్ జిల్లాలో ఉన్న ఏ కేసులతోనూ తనకు సంబంధం లేదని, శ్రీనివాసులు రెడ్డి ఓ ఎస్ఐతో కలిసి స్లగ్లింగ్ చేశాడని వివరించాడు. బెంగళూరులో దుంగలు అమ్మి ఎస్ఐ డబ్బులు ఖాతాలో వేసేవాడని, అయితే వాటికి సంబంధించిన రశీదులు శ్రీనివాసులు రెడ్డి వద్ద ఉన్నాయని టాస్క్‌ఫోర్స్‌కు బహిర్గతం చేశాడు. ఉద్దేశపూర్వకంగానే తనపై మరిన్ని తప్పుడు కేసులు బనాయించారని తన ఆవేదనను కమెడియన్ వెల్లగక్కాడు. మరోవైపు ఎర్రచందనం అక్రమ రవాణాతో కోట్లకు పడగలెత్తిన కమెడియన్.. సంపాదించిన సొమ్ముతో సినిమాలకు ఫైనాన్స్ చేస్తున్నాడని పోలీసులు కేసు నమోదు చేసి గత కొన్ని రోజులుగా హరిబాబు కోసం గాలించారు. ఈ క్రమంలో తిరుపతి టాస్క్ ఫోర్స్ అధికారుల ఎదుట లొంగిపోయి తన తప్పును ఒప్పుకున్నాడు. టాస్క్‌ఫోర్స్ ఐజీ ఎదుట లొంగిపోయిన టీవీ ఆర్టిస్ట్ కమెడియన్ కోసం పోలీసుల వేట -
అమ్మను బతికించడం కోసమే స్మగ్లరయ్యా!
-
ఎర్రచందనం కేసులో బుల్లితెర నటుడు హరిబాబు అరెస్ట్
-
టీడీపీకి కాంగ్రెస్‌తో చెలిమి మంచిది కాదు
-
పోలవరం మోదీ ఇచ్చిన వరం: హరిబాబు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు తెలుగు ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన వరమని విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు అన్నారు. ప్రాజెక్టుకు అడ్డు లేకుండా తెలంగాణ ప్రాంతంలోని ముంపు మండలాలను ఏపీలో కలుపుతూ ఆర్డినెన్స్ జారీ చేయడంతోనే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ముందుకొచ్చిందని తెలిపారు. ముంపు మండలాలపై రెండు కళ్ల సిద్దాంతాన్ని అనుసరించింది టీడీపీ కాదా అని ప్రశ్నించారు. విభజన సమయంలో టీడీపీ ద్వందనీతిని అనుసరించిందని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్న కేంద్రంపై నిందలు వేయడం సరికాదన్నారు. కర్ణాటకలో బీజేపీని అధికారంలోకి రాకుండా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, అది కాంగ్రెస్‌కు మేలు చేసినట్లవుతుందన్నారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌కి టీడీపీ మద్దతిస్తుందా అని ప్రశ్నించారు. అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిన పార్టీలు మోదీని విమర్శిస్తున్నాయని, వారితో చంద్రబాబు ఎలా చేతులు కలుపుతారని హరిబాబు ధ్వజమెత్తారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో ఏమి చేయలేని టీడీపీ ప్రభుత్వం బీజేపీపై నిందలు వేస్తూ పబ్బం గడుతుంతోదని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను ప్రభుత్వంలోని తీసుకుని చంద్రబాబు సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుతున్నారని విమర్శించారు. -
టీడీపీ చౌకబారు రాజకీయం చేస్తుంది
-
‘అఖిలపక్ష నిర్ణయాలు అన్యాయం’
సాక్షి, విశాఖపట్టణం : అఖిలపక్షంలో నిర్ణయాలు అన్యాయంగా ఉన్నాయని బీజేపీ ఎంపీ హరిబాబు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన అఖిలపక్షంలో ఏ పార్టీలు పాల్గొనలేదని చెప్పారు. కమిటీల ద్వారా ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నిర్వహిస్తామని తెలుగుదేశం పార్టీ చెప్పడం విడ్డూరం అని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని టీడీపీ ఆరోపించడంలో నిజంలేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అంటే నేను నేనంటే ఆంధ్రప్రదేశ్ అని చంద్రబాబు చెప్పడం హస్యాస్పదమని అన్నారు. ప్రభుత్వ ప్రాయోజిత ఉద్యమాల ద్వారా ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయే తప్ప మరొక ప్రయోజనం ఏమీ ఉండదని తెలిపారు. గత నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం లక్షల కోట్ల పెట్టుబడులను ఇచ్చిందని వివరించారు. కేంద్రం చేసిన సాయాన్ని చూపిస్తే టీడీపీపై దాడి చేస్తున్నారని చంద్రబాబు ఆరోపిస్తున్నారని తెలిపారు. -
‘వైఎస్సార్సీపీ ఉచ్చులో టీడీపీ విలవిల’
సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు యూటర్న్ తీసుకునేలా మెడలు వంచిన ఘనత వైఎస్సార్సీపీకే దక్కుతుందని ఏపీ బీజేపీ చీఫ్ కంభంపాటి హరిబాబు అన్నారు. వైఎస్సార్సీపీతో బీజేపీ ఎన్నటికీ కలవబోదని, అలాంటిదేదో జరుగుతుందనుకోవడం చంద్రబాబు భ్రమేనని స్పష్టం చేశారు. మంగళవారం ఢిల్లీలో జీవీఎల్, గోకరాజులతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీ సీఎంపై నిప్పులు చెరిగారు. ‘‘ఇవాళ టీడీపీ అజెండాను నిర్దేశిస్తున్నది వైఎస్సార్సీపీనే. హోదా రావాలంటే మంత్రులు రాజీనామా చేయాలన్న జగన్ డిమాండ్ మేరకు చంద్రబాబు తన మంత్రులను ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు అవిశ్వాస తీర్మానం విషయంలోనూ అదే జరిగింది. చంద్రబాబు మెడపై వైఎస్సార్సీపీ కత్తిపెట్టగానే ఆయనా అవిశ్వాసం పెట్టారు. ఏ రకంగా చూసినా వైఎస్సార్సీపీ పన్నిన ఉచ్చులో టీడీపీ పడింది’’ అని హరిబాబు వ్యాఖ్యానించారు. అలా ఉండే బాబు ఇలా: ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసమే చేస్తున్నదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. ‘‘ఒకప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పిన చంద్రబాబును ఇవాళ ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు. ఒకప్పుడు నేతలు ఆయన కోసం ఏపీ భవన్‌కు వెళ్లేవారు.. ఇప్పుడు ఆయనే అందరి దగ్గరికి వెళ్లి బతిమాలుకుంటున్నారు. ఒక్క శరద్ పవార్ తప్ప పెద్ద నాయకులెవరినీ చంద్రబాబు కలవలేదు. నాలుగేళ్లుగా ఆయన చేసిన పనులకు లెక్కలు అడిగితే ఇవ్వడంలేదు. అమరావతి అంటే అమ్మో అవినీతి అని భయపడుతున్నారు. ఇచ్చిన నిధులు ఏం చేశారంటే చెప్పరు. పైగా వైఎస్సార్సీపీతో బీజేపీ కలుస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు’’ అని జీవీఎల్ మండిపడ్డారు. -
టీడీపీని మేం బుజ్జగించం
సాక్షి, న్యూఢిల్లీ : టీడీపీ కేంద్ర మంత్రుల రాజీనామాలపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... వారిని ఎట్టి పరిస్థితుల్లో బుజ్జగించే ప్రయత్నం చెయ్యబోమని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇలాంటి నిర్ణయాలుంటాయని, వీటిపై చర్చలు జరపాలనుకోవట్లేదని అన్నారు. ఏపీకి బీజేపీ సహాయం చేయలేదనడం బాధాకరమని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు మూడున్నరేళ్లుగా బీజేపీ చేసిన సహాయం మరే రాష్ట్రానికి చేయలేదని, రాజీనామాలపై టీడీపీ వెనక్కి తగ్గుతుందని తాను అనుకోట్లేదని అన్నారు. ప్రత్యేక హోదాకు, పన్ను రాయితీలకు సంబంధం లేదన్నారు. -
‘మిత్రపక్షం దుష్ప్రచారాన్ని తిప్పికొడదాం’
విశాఖ సిటీ: రాష్ట్రంలో మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ చేస్తున్న రాజకీయ విమర్శలను అసెంబ్లీ వేదికగా తిప్పికొట్టాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. దేశంలో ఏ ముఖ్యమంత్రీ తీసుకురాని విధంగా రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చానంటూ గతంలో ఊదరగొట్టిన సీఎం చంద్రబాబు ఇప్పుడు మాటమార్చేయడం, కేంద్ర ప్రభుత్వం ఏపీకి చేసిన ఆర్థిక సాయం.. మొదలైన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, తమపై వస్తున్న విమర్శలకు ప్రతి విమర్శలనే అస్త్రంగా సంధించాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశం శనివారం విశాఖపట్నంలో నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ కంభంపాటి హరిబాబు, ఎంపీ గోకరాజు గంగరాజు తదితరులు పాల్గొన్నారు. నాలుగు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, మిత్రపక్షం టీడీపీ చేస్తున్న వ్యాఖ్యలను ఎలా తిప్పికొట్టాలన్న దానిపై చర్చించారు. తగిన రీతిలో బదులిస్తాం.. సమావేశం అనంతరం మీడియా సమావేశంలో బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు మాట్లాడారు. రాష్ట్రానికి బీజేపీ ఏం చేసింది, ఏం చెయ్యబోతోంది అనే అంశాలను అసెంబ్లీలో ప్రస్తావిస్తామన్నారు. తమపై దుష్ప్రచారం చేస్తున్న టీడీపీకి తగిన రీతిలో సమాధానం చెప్పాలని నిర్ణయించామన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ... కేంద్రం నుంచి రాష్ట్రానికి భారీగా నిధులు తీసుకొచ్చానని గతంలో చెప్పిన చంద్రబాబు ఇప్పుడు అందుకు విరుద్ధంగా మాట్లాడుతుండడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బంద్ చేపడితే తప్పుపట్టిన చంద్రబాబు ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని విమర్శించారు. -
తెగదెంపులు చేసుకోవాలనుకోవడం లేదు
సాక్షి, అమరావతి: టీడీపీతో తెగదెంపులు చేసుకోవాలనుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.హరిబాబు తెలిపారు. శుక్రవారం విజయవాడలో జరిగిన కృష్ణా జిల్లా పార్టీ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకుంటూ వివిధ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం వల్లే ఆంధ్రప్రదేశ్‌లో ఇంతటి అభివృద్ధి సాధ్యమైందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘర్షణలు, ఆరోపణలు, అనుమానాస్పద వాతావరణంలో ఉంటే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యం కాదన్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమల్లోకి వచ్చిన తర్వాత కూడా మూడు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా పొడిగించినట్టు కొందరు చెబుతున్నారని.. అలా పొడిగించినట్టు ఆధారాలు చూపితే తాము కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని కేంద్రాన్ని పట్టుబడతామని చెప్పారు. -
హరిబాబు వర్సెస్ లక్ష్మీపతి
-
'హామీలన్నీ అమలు చేశాం.. అవి మాత్రమే పెండింగ్'
సాక్షి, విజయవాడ : కేంద్రబడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందన్న విమర్శలకు గట్టి సమాధానం చెపుతామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు అన్నారు. విభజన హామీలపై ప్రజల ఆందోళన, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో విజయవాడ హోటల్ ఐలాపురంలో బీజేపీ విస్తృతస్తాయి సమావేశం జరిగింది. ఈసందర్భంగా హరిబాబు మాట్లాడుతూ ఏపీ విభజన చట్టంలోని అన్ని హామీలను అమలు పరిచామని, దుగరాజపట్నం, కడప స్టీల్ ఫ్యాక్టరీ, రైల్వేజోన్ వంటి కొన్ని మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయన్నారు. రైల్వేజోన్ ఏర్పాటు సాధ్యం కాదని తెలిసినా, ఇచ్చిన హామీ మేరకు ఇతర రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతోందని త్వరలోనే సానుకూల నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మెట్రో రైలు విషయంలోను సానుకూలంగా ఉందని హరిబాబు అన్నారు. రెవెన్యూలోటు భర్తీకోసం ఇప్పటి వరకూ కేంద్రం రూ.4వేల కోట్లు ఇచ్చిందని, దీనిపై మరింత స్పష్టత రాగానే భర్తీ చేస్తామని తెలిపారు. లక్ష కోట్ల విలువైన రహదారుల ప్రాజెక్టులు ఒక్క ఏపీకే ఇచ్చామని, మూడు నాలుగేళ్లలో పూర్తవుతాయని వెల్లడించారు. కేంద్రం ఇచ్చిన వాటిని హక్కు అంటున్నారు.. ఇవ్వనివి మోదీ పాపం అంటున్నారని విమర్శించారు. ఇప్పటి వరకూ నాలుగు లక్షల గృహాలు మంజూరు చేశామని తెలిపారు. విభజన చట్టంలో పేర్కొన్నట్లు అవసరమైన పరిపాలనా భవనాలు, మౌలిక వసతుల కల్పనకు డిజైన్లు పూర్తి కాకముందే రూ.2500కోట్లు మంజూరు చేశామని, మరో వెయ్యి కోట్లు ఇస్తామని అన్నారు. ఎన్ని భవనాలు కట్టినా నిధులు ఇస్తామని, ముందు కేటాయించిన నిధులు ఖర్చు అయితేనే, బడ్జెట్ నిధులు కేటాయిస్తారని తెలిపారు. హోదా ఇవ్వకపోయినా దానికి సమానమైన ప్రయోజనాలను ఇస్తామని కేంద్రం తెలిపిందన్నారు. వెనుకబడిన జిల్లాల్లో పెట్టుబడులు పెడితే 15శాతం పెట్టుబడి రాయితీ కల్పించామని అన్నారు. ఏపీని పెట్రోలియం హబ్‌గా ఏర్పాటు చేస్తామని, హెచ్‌పీసీఎల్ సామర్థ్ంయ విస్తరణ కోసం 20వేల కోట్లు ఇస్తామని వెల్లడించారు. చట్టంలో లేకపోయినా విశాఖకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్(ఐఐఎఫ్‌టీ), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్(ఐఐపీ) ఏర్పాటు చేశామని హరిబాబు అన్నారు. -
కాంగ్రెస్ ఆంధ్రుల గొంతు కోసింది..
-
‘చెప్పుకోవట్లేదంటే మేము చేయనట్లు కాదు’
సాక్షి,న్యూఢిల్లీ : విభజన చట్టంలోని హామీల అమలుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. శనివారం ఆయన ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..బీజేపీపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. విశాఖ రైల్వే జోన్ కోసం కమిటీ ఏర్పాటు చేశామని పోలవరం నిర్మాణానికి రూ.4వేల కోట్లు విడుదల చేసినట్లు జీవీఎల్ నరసింహరావు తెలిపారు. కడప స్టీల్‌ప్లాంట్‌పై త్వరలో నిర్ణయం తీసుకుంటామని, దుగరాజపట్నం పోర్టుపై అభ్యంతరాలను పరిశీలిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రుల గొంతు కోసిందని, రాష్ట్రానికి కాంగ్రెస్ సరైన న్యాయం చేయలేదని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీకి కేంద్రం సాయం చేసిందన్నారు. రాజకీయ లబ్దికోసం దుష్ప్రచారాలు చేయడం సరికాదని అన్నారు. ‘చెప్పుకోవట్లేదంటే మేము చేయనట్లు కాదు’ బీజేపీ ఏపీ అధ్యక్షుడు, ఎంపీ కంభంపాటి హరిబాబు ఈ సందర్భంగా ఏపీకి కేంద్రం ఇప్పటివరకూ ఇచ్చిన నిధులు, మంజూరు చేసిన ప్రాజెక్టులు, సంస్థల వివరాలతో కూడిన 27 పేజీల నోట్‌ను మీడియాకు విడుదల చేశారు. విభజన హామీల అమలుకు మోదీ సర్కార్ కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. హోదావల్ల వచ్చే అన్ని ప్రయోజనాలను ప్రత్యేక ప్యాకేజీలో ఇస్తామన్నారు. పోలవరం ముంపు మండలాలను ఏపీ పరిధిలోకి తెచ్చామని అన్నారు. ఏపీకి సాయం చేయడం లేదనే వార్తలు వాస్తవం కాదని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కాంగ్రెస్ సరైన న్యాయం చేయలేదని, ఇప్పుడు రాహుల్ గాంధీ మాయమాటలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. ఏపీ విభజన చట్టం హామీలు అమలు చేస్తామని ఆయన తెలిపారు. పదేళ్లలో చేయాల్సిన సాయాన్ని మూడున్నరేళ్లలోనే చేశామని అన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని నాడు కాంగ్రెస్ ప్రభుత్వం చట్టంలో ఎందుకు పెట్టలేదని హరిబాబు ప్రశ్నించారు. 4వేల కోట్ల నిధులు రెవెన్యూ లోటు కింద కేంద్రం ఇచ్చిందని మిగిలిన బకాయిల ఎంతనేదానిపై అంగీకారానికి చర్చలు జరుగుతున్నాయన్నారు.ప్రత్యేక హోదాకు సమానంగా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ అమలు చేస్తున్నామని, అయిదు సంస్థలు నెలకొల్పే విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. రైల్వే జోన్ విషయంలో త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని, ఇక దుగరాజపట్నం బదులు వేరే ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం సూచించాలని ఆయన అన్నారు. పోలవరం నిర్మాణం బాధ్యత కేంద్రానిదేనని, నాబార్డు ద్వారా నిధుల ఇస్తామని హరిబాబు తెలిపారు. విద్యుత్ కొరతతో అల్లాడుతున్న ఏపీకి 24 గంటల కరెంటు ఇచ్చామని,లక్షకోట్ల రూపాయల విలువైన రోడ్లు, రాజధానికి 3500 కోట్ల రూపాయలు ఇచ్చామన్నారు. భవన నిర్మాణాలు మొదలుపెడితే నిరంతరం నిధులు ఇస్తామని, మూడున్నరేళ్లలో ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులు ఏపికి ఇచ్చామని హరిబాబు వివరించారు. విభజన చట్టంలో ని 85శాతం హామీలు మూడున్నరేళ్లలో అమలు చేశామని,ఇందులో తప్పుంటే జవాబు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు.విజయవాడ, విశాఖ మెట్రో పరిశీలనలో ఉందని, పెట్రో కాంప్లెక్స్ పై సాధ్యసాధ్యలపై అధ్యయనం జరుగుతోందని హరిబాబు పేర్కొన్నారు. టీడీపీ తమ మిత్రపక్షమని, ఏమైనా అనుమానాలు ఉంటే చర్చలు ద్వారా పరిష్కరించుకుంటామన్నారు. రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే రూ,2,500 కోట్లు ఇచ్చాం పోలవరం నిర్మాణానికి రూ.4,662.28 కోట్లు విడుదల చేశాం ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది విభజన చట్టం ప్రకారం కేవలం 5 సంస్థలు మాత్రమే పెండింగ్ ఉన్నాయి కడప స్టీల్ ప్లాంట్ విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటాం దుగరాజపట్నం పోర్టుకు రక్షణ శాఖ నుంచి, ఇస్రో నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయం సూచిస్తే, అక్కడ వెంటనే పోర్టు నిర్మాణం చేపడతాం రైల్వే జోన్ అంశం కూడా త్వరలో ప్రకటన ఉంటుంది. ఏర్పాటు జరుగుతుంది చట్టంలో పదేళ్ళ కాలపరిమితిలోగా ఇవన్నీ చేయాలని ఉంది. కానీ నరేంద్ర మోదీ సర్కారు మాత్రం మూడేళ్లలోనే చాలా ఇచ్చింది 85 శాతం హామీలు మూడున్నరేళ్లలో అమలు చేశాం వెంకయ్య నాయుడు చొరవతో చట్టంలో ఉన్నవే కాదు, లేనివి కూడా మంజూరు అయ్యాయి రూ. లక్ష కోట్ల విలువ చేసే జాతీయ రహదారులు మంజూరు చేసాము షిప్పింగ్ మరియు వాటర్ వేస్‌లో కూడా చట్టంలో లేని ప్రాజెక్ట్ మంజూరు చేసాం పెట్రోలియం కాంప్లెక్స్ పని కూడా జరుగుతుంది తిరుపతి ఐఐటీకి రూ.90.93 కోట్లు కేంద్రం ఇచ్చింది -
ఏపీలో కొత్త రాజకీయాలు
-
కేబినెట్ విస్తరణలో ఏపీకి నిరాశే మిగిలింది
-
హుటాహుటిన ఢిల్లీకి బీజేపీ ఎంపీ..!
-
విస్తరణ: హుటాహుటిన ఢిల్లీకి బీజేపీ ఎంపీ..!
సాక్షి, విశాఖపట్నం: కేంద్ర కేబినెట్ విస్తరణ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ హరిబాబు హుటాహుటిన శనివారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లడం గమనార్హం. కుటుంబసభ్యులతో కలిసి ఆయన విశాఖపట్నం నుంచి ఢిల్లీకి బయలుదేరారు. కేంద్ర కేబినెట్ విస్తరణలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయనకు చోటు దక్కనుందని తాజా సమాచారం. బీజేపీ అధిష్టానవర్గం నుంచి అందని సమాచారం మేరకే హరిబాబు ఢిల్లీ విమానం ఎక్కినట్టు చెప్తున్నారు. ఆదివారం ఉదయం కేంద్ర కేబినెట్ విస్తరణ జరగనున్నప్పటికీ ఇప్పటికీ కొత్తగా ఎవరూ కేబినెట్లో చేరనున్నారు? ఎవరెవరికి ఏ పదవులు దక్కనున్నాయి? అనేదానిపై స్పష్టత రాలేదు. ఇప్పటికే కేబినెట్ విస్తరణకు వీలు కల్పించేందుకు పలువురు కేంద్రమంత్రులు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కొత్తగా ఎవరికి అవకాశం లభిస్తుందనే విషయమై ఉత్కంఠ కొనసాగుతోంది. ఏపీ నుంచి హరిబాబు లేదా గోకరాజు గంగరాజుకు అవకాశం కల్పించవచ్చునని వినిపించిన సంగతి తెలిసిందే. ఇక తెలంగాణ నుంచి వెదిరె శ్రీరామ్ లేదా మురళీధర్‌రావుకు అవకాశం లభించవచ్చునని సమాచారం. -
పవన్ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ
విజయవాడ: జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు స్పందించారు. ఏ యూనివర్సిటీ విషయాల్లోనూ బీజేపీ జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. రైల్వే జోన్‌కు సంబంధించి కాలపరిమితి లేదని తెలిపారు. నోట్ల రద్దు అంశంపై పార్లమెంట్లో చర్చ జరగకుండా విపక్షాలే అడ్డుకుంటున్నాయని హరిబాబు మండిపడ్డారు. -
కేంద్రం దృష్టికి కాంటూరు సమస్య
తాడేపల్లిగూడెం : జిల్లాలో నెలకొన్న కొల్లేరు కాంటూరు సమస్యను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లామని, పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు అన్నారు. శనివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఆయిల్‌పామ్ మద్దతు ధర పడిపోయిన సమయంలో ధరను పెంచి రైతులకు ఊరట ఇచ్చామన్నారు. రైతులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకొనే క్రమంలో కేంద్రం భూసారపరీక్షలు చేసి శాయిల్ హెల్త్‌కార్డులు ఇచ్చిందన్నారు. ప్రధాన మంత్రి ఫసలీ బీమా యోజన ద్వారా రైతులను ఆదుకుంటున్నామన్నారు. పంట రుణాలు ఆరుశాతం అతితక్కువ వడ్డీకే బ్యాంకులద్వారా అందించడం, రైతులకు వ్యవసాయ ఆదాయం రెట్టింపు కోసం చర్యలను కేంద్రం చేపడుతోందన్నారు. పప్పుధాన్యాల కొరత నివారణకుగాను వాటి కనీస మద్దతు ధర పెంచడం ద్వారా ధరల పెరుగుదలకు కేంద్రం కళ్లెం వేసిందని హరిబాబు చెప్పారు. నోట్ల రద్దు నిర్ణయం సంచలనాత్మకం లంచగొండితనం, అవినీతి, నల్లధనం కట్టడి చేయడం కోసం మోడీ పెద్దనోట్లను రద్దు చేస్తూ సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారన్నారు. దేశంలో చలామణిలో ఉన్న 17 లక్షల 50 వేల కోట్ల రూపాయల్లో 85 శాతం పెద్దనోట్లే అన్నారు. పెద్దనోట్లు రద్దు తర్వాత ఐదు లక్షల కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్లుగా వచ్చాయన్నారు. దేశంలో నల్లధన ం వెలికితీయడం, పాకిస్తా¯ŒS నుంచి దేశంలోకి వచ్చే నకిలీ కరెన్సీని అడ్డుకోవడం ద్వారా పారదర్శక లావాదేవీలకు అవకాశం కలిగిందని చెప్పారు. ఈ నెల 26న తాడేపల్లిగూడెంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ముఖ్యఅతిథిగా హాజరయ్యే సభను విజయవంతం చేయాలని కోరారు. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అ««దl్యక్షురాలు శరణాల మాలతీరాణి, ఎస్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు దారా సాంబయ్య, మైనార్టీ అధ్యక్షుడు షేక్ బాజీ, కార్యదర్శి వేమా, ఐటీ సెల్ ఇ¯ŒSచార్జి సత్యమూర్తి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ తదితరులు పాల్గొన్నారు. -
విశాఖ ఎయిర్పోర్ట్ వద్ద ఉద్రిక్తత
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు హరిబాబుకు ప్రత్యేక హోదా నిరసనలు చుట్టుముట్టాయి. ప్రత్యేక హోదాపై బీజేపీ మోసం చేసిందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ, ప్రజాసంఘాల నేతలు ఆయనకు తమ నిరసన గళాన్ని వినిపించాయి. ఆంధ్రప్రదేశ్‌కు ప్యాకేజీ ప్రకటించిన అనంతరం ఢిల్లీకి వెళ్లి ప్రధానికి ధన్యవాదాలు చెప్పిన హరిబాబు ఆదివారం సాయంత్రం తిరిగి విశాఖకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు నిరసన తెలిపేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, జిల్లా అధ్యక్షుడుగుడివాడ అమర్ నాథ్ సహా పార్టీ కార్యకర్తలు, సీపీఐ, ఇతర ప్రజాసంఘాల నేతలు విశాఖ ఎయిర్ పోర్ట్‌కు వెళ్లారు. దీంతో వారిపై పోలీసుల లాఠీలతో దాడి చేశారు. దీంతో అమర్ నాథ్ సహా సీపీఐ నేతలకు గాయాలయ్యాయి. అమర్ నాథ్ ను, సీపీఐ నేత సత్యనారాయణ మూర్తిని పోలీసులు అరెస్టు చేశారు. సీపీఐ మహిళా నేత విమలక్కను పోలీసులు లాక్కెళ్లారు. దీంతో ప్రత్యేక హోదాపై ప్రశ్నించే హక్కు, నిరసన తెలిపే హక్కు తమకు లేదా అంటూ వారు గట్టిగా నినదించారు. -
విశాఖ ఎయిర్పోర్ట్ వద్ద ఉద్రిక్తత
-
మంగళగిరిలో రిటైర్డ్ డీఎఫ్ఓ హల్ చల్
-
ఉరివేసి, యాసిడ్ పోసి...
ఓ మహిళకు ఉరివేసి చంపి, ఆపై యాసిడ్ పోసి కాల్చేశారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తాళ్లసింగారం చెరువులోని చెట్టుకు మహిళ మృతదేహం వేలాడుతుండగా గ్రామస్తులు మంగళవారం ఉదయం గమనించారు. ఈ మేరకు వారు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై హరిబాబు అక్కడికి చేరుకుని, మృతదేహాన్ని పరిశీలించారు. గుర్తు తెలియని దుండగులు గుర్తు తెలియని మహిళకు ఉరి వేసి చంపటంతోపాటు ముఖంపై యాసిడ్ పోసిన ఆనవాళ్లున్నాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పోలవరం రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి చేయాలి: బీజేపీ ఎంపీ
విశాఖపట్టణం: పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానిదేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ కంభంపాటి హరిబాబు అన్నారు. ఆదివారం విశాఖపట్టణంలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సహాయం మాత్రమే అందిస్తుందని పూర్తి చేయాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వానిదేనన్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో చర్చించారు. -
రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన సుజనాచౌదరి
ఢిల్లీ: కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్‌తో శుక్రవారం కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎంపీ హరిబాబు, ఏపీ డీజీపీ రాముడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల రాష్ట్రంలో సంభవించిన వరదల వల్ల జరిగిన నష్టాన్ని సుజనా చౌదరి వివరించారు. వరదసాయంగా 1000 కోట్ల రూపాయలను రాష్ట్రానికి అందిచాలని కోరారు. అలాగే రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని ఆయన కోరారు. వరద తీవ్రతను అంచనా వేయడానికి కేంద్ర బృందాన్ని రాష్ట్రానికి త్వరగా పంపాలని విశాఖ ఎంపీ హరిబాబు హోం మంత్రిని కోరారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ ఏర్పాటుకు సహాయం అందిచాల్సిందిగా కేంద్ర హోంమంత్రిని డీజీపీ రాముడు కోరాడు. -
బీజేపీని బలోపేతం చేయాలి
అనంతపురం కల్చరల్ : స్వచ్ఛమైన పాలన అందిస్తున్న నరేంద్రమోడీ పథకాలను కార్యకర్తలు సమర్థవంతంగా జనంలోనికి తీసుకుపోయి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు హరిబాబు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక ఆర్టీసీ బస్టాండు సమీపంలోని సాయి రెసిడెన్షియల్ హాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షులు అంకాళ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఆ పార్టీ జిల్లా స్థాయి కార్యవర్గ సమావేశాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు తీసుకోవాల్సిన చర్యలను ఆయన వివరించారు. సభ్యత్వ నమోదులో బీజేపీ అన్ని పార్టీలకన్నా ముందుందని కోట్ల మంది సభ్యులతో ప్రపంచంలోనే మొదటిస్థానంలో నిలబడడం ఆనందదాయకంగా ఉందన్నారు. ఈ స్పూర్తితోనే పార్టీ బలోపేతం కావడానికి కార్యకర్తలు అహర్నిశలు శ్రమించాలన్నారు. పోలవరం ప్రాజెక్టుతోనే రాయలసీమ అభివృద్ధి చెందుతుందని ఆ ప్రాజెక్టు పూర్తి కావడానికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందన్నారు. కరువు ప్రాంతంగా పేరొందిన జిల్లా సస్యశ్యామలం కావాలంటే అన్ని ప్రాజెక్టులు త్వరగా పూర్తికావాలని, అందుకు పరస్పర సహకారం అవసరమన్నారు. అలాగే రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలపడానికి కేంద్రం అన్ని చర్యలు తీసకుంటుందని, ముఖ్యంగా పరిశ్రమల విషయంలో నవ్యాంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటామన్నారు. విద్యుత్ నిలువ గల రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్‌ను ప్రథమ స్థానంలో నిలబెట్టడానికి కేంద్రం కృషి చేస్తుందన్నారు. హరిబాబు కార్యకర్తల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యకర్తలకు అండగా నిలవడానికి అన్ని చర్యలు తీసకుంటామన్నారు. -
చిరకాలం.. చిరంజీవే!
ఆరిపోయే కొవ్వొత్తి కాసేపట్లో తాను శూన్యమవుతానని తెలిసి కూడా మరో కొవ్వొత్తికి వెలుగునిస్తుంది. అంతటి గొప్ప మనసు సృష్టిలో జీవరాశులకు ఉండటం..అరుదు! తాను కొవ్వొత్తిలా కరిగిపోతూ ఒక మనిషి మరొక మనిషికి ప్రాణం పోయడం.. బహు అరుదు!! ప్రాణం మీద కొస్తోందంటే జీవరాశులు త్యాగానికి సిద్ధపడవు. త్యాగాన్ని స్వార్థం.. నిత్యం వెనక్కు నెడుతుంది. అది మనిషైనా, ప్రాణమున్న ఏ జీవైనా. కాలం మారే కొద్దీ మనుషుల్లో స్వార్థం దూరమవుతోందని కొన్ని ఘటనలు రుజువు చేస్తున్నాయి. మనుషులు కూడా ఇప్పుడిప్పుడే కొవ్వొత్తుల్లా కరిగిపోవడం అలవాటు చేసుకుని తమ వెనక తరం వారికి ఆదర్శంగా ఉంటున్నారు. ఓ ఉద్యోగి త్వరలో తాను చనిపోతానని తెలుసుకుని అవయవాల దానానికి మనస్ఫూర్తిగా అంగీకరించాడు. మరొకరికి ప్రాణం పోసిన గంటల్లోనే ఆ కొవ్వొత్తి కరిగిపోయింది. టంగుటూరు : మండలంలోని వల్లూరమ్మ దేవస్థానం సీనియర్ అసిస్టెంట్ వి.హరిబాబు(42) తన అవయవాలను మరొకరికి దానం చేసి ఆదివారం తుది శ్వాసం విడిచారు. ఆయన చిన్న వయసులోనే వల్లూరమ్మ దేవస్థానంలో చిరుద్యోగిగా కాంట్రాక్ట్ బేసిక్ పై చేరారు. విధులు చిత్తశుద్ధితో నిర్వహించి ఉద్యోగంలో అంచెలంచెలుగా ఎదిగి పలువురి అధికారులకు దగ్గరయ్యారు. ఉద్యోగం పర్మినెంటై అదే ఆలయంలో ప్రస్తుతం సీనియర్ అసిస్టెంట్‌గా కొనసాగుతున్నారు. 14 ఏళ్లు అమ్మవారి సేవలో హరిబాబు పునీతులయ్యారు. దేవస్థానానికి కార్యనిర్వాహణాధికారిగా ఎవరు వచ్చినా కొన్ని రోజుల్లోనే హరిబాబుకు వారు దగ్గరవుతారంటే విధుల పట్ల ఆయన చిత్తశుద్ధి ఏంటో అర్థం చేసుకోవచ్చు. పేరుకు సీనియర్ అసిస్టెంట్ అయినా తన సుదీర్ఘ అనుభవంతో ఉన్నతాధికారులకు సలహాదారునిగా కూడా వ్యవహరించారు. వల్లూరమ్మ దేవస్థానం అనగానే అక్కడ పని చేసిన ఉద్యోగులు నుంచి.. పాలకవర్గ సభ్యులు, ఆ శాఖ ఉన్నతాధికారులకు మొదట గుర్తుచ్చేది హరిబాబే. ఇంతకీ ఏమైంది? గరువారం తన కుమార్తె కృషి 8వ పుట్టిన రోజు వేడుకలను బంధుమిత్రుల నడుమ హరిబాబు ఘనంగా జరిపారు. కుమార్తెతో కలిసి దేవస్థానానికి వచ్చి సహచర ఉద్యోగులకు స్వీట్లు పంచారు. ఈ నేపథ్యంలో ఒంగోలులో నివాసం ఉండే హరిబాబు తన స్వగ్రామం త్రోవగుంటలోని కుటుంబ సభ్యుల వద్దకు భార్య శేషమ్మ, కుమార్తెతో కలిసి అదే రోజు బయల్దేరారు. రాత్రికి తిరిగి వచ్చి ఓ హోటల్లో ముగ్గురూ భోజనం చేశారు. ఉన్నట్టుండి హరిబాబుకు ఒక్కసారిగా హైబీపీ వచ్చి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చగా వివిధ పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. మెరుగైన చికిత్స కోసం తక్షణమే విజయవాడ పెద్దాస్పత్రికి తీసుకెళ్లాలని బంధువులకు సూచించారు. ఈ నెల 28వ తేదీన శుక్రవారం ఉదయం హరిబాబును బంధువులు విజయవాడ తీసుకెళ్లారు. అక్కడ కూడా వివిధ పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. హరిబాబు ప్రాణాలు దక్కవని చెప్పడంతో భార్య, బంధువులు నిర్ఘాంతపోయారు. హరిబాబుకు అసలేం జరిగిందో తెలుసుకునేలోపే అంతా జరిగిపోయింది. ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదని వైద్యులు మళ్లీ చెప్పారు. అవయవ దానం చేసి మరొకరికి ప్రాణం పోయాలన్న వైద్యుల సలహాకు హరిబాబు కుటుంబ సభ్యులు సమ్మతించారు. అప్పటికప్పుడు హరిబాబు గుండె, లివర్, కిడ్నీలు దానం చేశారు. ఆదివారం కన్నుమూసిన హరిబాబు .. చివరకు చిరంజీవిగా మిగిలాడు. హరిబాబు భౌతిక కాయాన్ని త్రోవగుంటలోని ఆయన నివాసం వద్ద ఉంచారు. దేవదాయశాఖ డీఈ శ్రీనివాసరావు, వల్లూరమ్మ దేవస్థానం ఉద్యోగులు వెళ్లి ఘన నివాళులర్పించారు. -
'విద్యుత్'ను పునరుద్ధరించడానికి మరో మూడు రోజులు
విశాఖపట్నం: పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా పునరుద్ధరించడానికి మరో రెండు మూడు రోజులు పట్టే అవకాశం ఉందని విశాఖపట్నం ఎంపి హరిబాబు తెలిపారు. బుధవారం నుంచి తాగునీరు అందించడానికి ప్రయత్నాలు ప్రారంభించామని ఆయన అన్నారు. తుఫాన్ బాధితులకు విజయవాడ నుంచి నిత్యవసర వస్తువులు, కూరగాయలు తెప్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని హరిబాబు తెలిపారు. హదూద్ తుఫాన్ సృష్టించిన బీభత్సం కారణంగా ఉత్తరాంధ్రలో విద్యుత్ సరఫరా, రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. తుఫాన్ బాదితులను పరామర్శించడానికి ప్రధాని నరేంద్రమోడీ విశాఖపట్నం చేరుకున్నారు. విశాఖ ప్రధాన కూడళ్లను మోడీ పరిశీలిస్తున్నారు. -
మోడి లక్ష్యం బంగారు భారత్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు గన్నవరం : దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించగల సత్తా ప్రధానమంత్రి నరేంద్రమోడికి మాత్రమే ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ కంభంపాటి హరిబాబు అన్నారు. స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపం సమీపంలో బీజేపీ ఆధ్వర్యంలో మోడి వందరోజుల పాలనపై విజయోత్సవ సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న హరిబాబు మాట్లాడుతూ మన దేశాన్ని బంగారు భారత్‌గా తీర్చిదిద్దేందుకు మోడి చిత్తశుద్ధితో పని చేస్తున్నారని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు తాత్కాలిక రాజధానిని ఏర్పాటు చేసి అక్కడి నుంచి పాలన సాగించాలని సూచించారు. అధికార వికేంద్రీకరణతోపాటు జిల్లాల సంఖ్యను 25కు పెంచాలన్నారు. రాష్ట్రంలో జల రవాణాను పెంపొందించేందుకు, ఏపీని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు కేంద్రం సంసిద్ధంగా ఉందన్నారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి, గన్నవరం విమానాశ్రయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వం భ్రష్టు పట్టించిన అన్ని వ్యవస్థలను మోడి గాడిలో పెడుతున్నారని పేర్కొన్నారు. కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మాట్లాడుతూ పేద కుటుంబానికి చెందిన మోడి దేశ ప్రధాని కావడం అందరికీ గర్వకారణమన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చిగురుపాటి కుమారస్వామి ఆధ్వర్యాన జరిగిన ఈ సభలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యాంకిషోర్, కార్యవర్గ సభ్యులు మోటుపల్లి శామ్యూల్, ఆర్.రవీంద్రరాజు, మహిళా మోర్చ అధ్యక్షురాలు మాలతిరాణి, కిసాన్ మోర్చ ఉపాధ్యక్షుడు తుమ్మల అంజిబాబు, నియోజకవర్గ కన్వీనర్ నాదెండ్ల మోహన్ తదితరులు పాల్గొన్నారు. సభ అనంతరం పలు పార్టీల నాయకులు బీజేపీలో చేరారు. -
స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దడమే లక్ష్యం
విశాఖ ఎంపీ హరిబాబు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆత్మీయ సత్కారం విశాఖపట్నం : నవ్యాంధ్రను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని విశాఖ ఎంపీ హరిబాబు అన్నారు. శుక్రవారం సాయంత్రం విశాఖ సుబ్బలక్ష్మీ కల్యాణ మండపంలో కేంద్ర పరిశ్రమలు, ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను బీజేపీ జిల్లాశాఖ ఆధ్వర్యంలో ఘనం గా సత్కరించారు. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో డిమాండ్ ఉన్న వ్యవసాయ ఆథారిత ఉత్పత్తులకు ఏ దేశంలో గిరాకీ ఉంటే ఆ దేశాలకు వీటిని ఎగుమతి చేయాలన్నారు. ఐటీసెజ్లను డీనోటిఫై చేయాలని ఆయన కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. రాబోయే రెండేళ్లలో 60 ఫార్మా కంపెనీలు రూ.2 వేల కోట్లతో వాటి ఉత్పత్తిని ప్రారంభిస్తాయన్నారు. వీటి ద్వారా బీఫార్మశీ, ఎం.ఫార్మశీ, కెమిస్ట్రీ పట్టభద్రులు రెండు వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. నాణ్యమైన విద్య కోసం బ్రిడ్జి కోర్సులను ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నారు. అనకాపల్లి ఎంపీ ము త్తంశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ వివిధ పరి శ్రమలను ఆంధ్రకు తరలించాలని మంత్రి ని కోరారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సీతారామన్‌కు ‘బొబ్బిలి వీణ’ను బహూకరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేత చలపతిరావు, పార్టీ ఉపాధ్యక్షుడు బండారు రంగమోహన్, రాష్ట్ర నాయకులు చెరువు రామకోటయ్య, పృథ్వీరాజ్, మాధవ్ పాల్గొన్నారు. -
పాతికేళ్ల తర్వాత...
రాజేంద్రప్రసాద్, సీత నటించిన ‘చెవిలో పువ్వు’, ‘ముత్యమంత ముద్దు’ చిత్రాలు అప్పట్లో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ జంటకు మంచి పేరొచ్చింది. మళ్లీ పాతికేళ్ల తర్వాత ఈ జోడీ ‘టామీ’ సినిమా కోసం కలిశారు. రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో చేగొండి హరిబాబు, బోనం చినబాబు నిర్మిస్తోన్న ‘టామీ’ చిత్రం కేవలం నెల రోజుల్లో నర్సాపురం, పాలకొల్లు ప్రాంతాల్లో చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చేగొండి హరిబాబు మాట్లాడుతూ -‘‘కుక్కకూ, యజమానికి మధ్య ఉన్న అనుబంధాన్ని ఇందులో ఎంతో బాగా ఆవిష్కరించాం. మా టామీ అందర్నీ నవ్వించడంతో పాటు, ఆఖరిగా ఆలోచింపజేస్తుంది. తదుపది మేం ‘టామీ-2’ చేయాలని నిర్ణయించుకున్నాం. ఇందు కోసం ఓ కుక్కకు శిక్షణ ఇప్పిస్తున్నాం’’ అని తెలిపారు. కుక్క చేసే విన్యాసాలు ఈ చిత్రానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: చక్రి, కెమెరా: మోహన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బాబు బండారు. -
ప్లే బాయ్ క్లబ్‌పై దాడి
11 మంది అరెస్ట్ గచ్చిబౌలి: మాదాపూర్‌లోని ప్లే బాయ్ క్లబ్‌పై బీజేవైఎం కార్యకర్తలు దాడికి యత్నించారు. హెచ్ఐసీసీలోకి చొచ్చుకుపోయి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. బీజేవైఎం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క బాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి హరిబాబుల ఆధ్వర్యంలో శనివారం రాత్రి 9 గంటల సమయంలో కార్లలో హెచ్ఐసీసీ సెక్యూరిటీ కళ్లుగప్పి లోపలికి ప్రవేశించారు. బౌన్సర్లు, సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ చొచ్చుకొని ఒక్కసారిగా లోపలికి వెళ్లారు. రెండు టీపాయిలను ధ్వంసం చేశారు. అనంతరం అక్కడే బైఠాయించి సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. నోవాటెల్ సమీపంలో సైబర్‌సిటీ కన్వెన్షన్ సెంటర్లో ఓ వివాహనికి హాజరైన తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి బందో బస్తులో ఉన్న మాదాపూర్ పోలీసులు హుటాహుటిన హెచ్ఐసీసీకి చేరుకుని నిరసనకారులను అరెస్ట్ చేసి రాయదుర్గం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. క్లబ్‌ను మూసి వేయాలి భారతీయ సంస్కృతిని కించ పరిచేవిధంగా నడిచే ప్లేబాయ్ క్లబ్‌ను వెంటనే మూసివేయాలని బీజేవైఎం రంగారెడ్డి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాల్‌రెడ్డి, హరికృష్ణలు డిమాండ్ చేశారు. ఇలాంటి క్లబ్‌లకు అనుమతిస్తే యువత పెడదారి పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లే బాయ్ క్లబ్ యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చే యాలని వారు డిమాండ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు: ఏసీపీ నగరంలో ఉన్న పబ్‌లకు వర్తించిన నిబంధనలు ప్లే బాయ్ క్లబ్‌కు వర్తిస్తాయని మాదాపూర్ ఏసీపీ శ్రీధర్ తెలిపారు. అర్థ నగ్న, అశ్లీల నృత్యాలను సహించమని స్పష్టం చేశారు. -
మేయర్ పీఠానికి కమలం వ్యూహం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: లక్ష్యం: జీవీఎంసీ పీఠం... మార్గం: సమ్మతిస్తే మిత్రలాభం లేకుంటే మిత్రబేధం వ్యూహం: టీడీపీపై వ్యూహాత్మక విమర్శల దాడి ఇదీ బీజేపీ తాజా రాజకీయ వ్యూహం. జీవీఎంసీ మేయర్ స్థానాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మక దూకుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి కలిగిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు ఏకంగా టీడీపీ ప్రభుత్వంపై విమర్శల దాడి చేయడం ఆ పార్టీ వ్యూహాత్మక దూకుడుకు అద్దంపడుతుండగా... అందుకు టీడీపీ స్పందించలేకపోవడం ఆ పార్టీ నిస్సహాయస్థితికి నిదర్శనంగా నిలుస్తోంది. మూడు నెలల్లో జీవీఎంసీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం వెల్లడించిన నేపథ్యంలో మరింత పదునెక్కుతున్న బీజేపీ వ్యూహం ఇలా ఉంది... పీఠం కోరుదాం...లేకుంటే... రాష్ట్రంలో బలీయ రాజకీయ శక్తిగా ఆవిర్భవించాలన్న కృతనిశ్చయంతో బీజేపీ మెల్లమెల్లగా ‘సొంత దారి’ చూసుకుంటోంది. త్వరలో రాష్ట్రంలో నిర్వహించనున్న కొన్ని నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీ ఎన్నికల్లో తన సత్తా చాటాలని భావిస్తోంది. ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు విశాఖ మేయర్ పీఠాన్ని తమ ఖాతాలో వేసుకోవాలన్నది ఆ పార్టీ దృఢచిత్తంగా ఉంది. ఎందుకంటే 1980లో బీజేపీ అభ్యర్థి ఎన్.ఎస్.ఎన్. రెడ్డి విశాఖ మేయర్‌గా ఎన్నికయ్యారు. దేశంలోనే బీజీపీకి ఆయనే తొలి మేయర్ కావడం గమనార్హం. అందుకే ఈసారి జీవీఎంసీ మేయర్ పీఠంపై ఆ పార్టీ కన్నేసింది. అందుకోసం ఇప్పటికే డివిజన్లలో ఆ పార్టీ చాపకింద నీరులా పని ప్రారంభించింది. కానీ మేయర్ గిరీని తమకు ఇచ్చేందుకు టీడీపీ సమ్మతించదని కూడా బీజీపీ గుర్తించింది. అనివార్యమైతే టీడీపీతో ఢీకొట్టేందుకు కూడా సిద్ధపడుతోంది. వ్యూహాత్మక విమర్శలు మిత్రలాభంతో దక్కకపోతే మిత్రబేధంతోనైనా మేయర్ స్థానాన్ని సాధించాలని బీజేపీ అగ్రనాయకత్వం యోచిస్తోంది. ఆ దిశగా కార్యాచరణ బాధ్యతను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభపాటి హరిబాబుకే అప్పగించింది. ‘మిగిలిన నేతలు ఎవ్వరూ స్పందించొద్దు... ఒక్క హరిబాబే టీడీపీని విమర్శిస్తూ పార్టీ ఉద్దేశాన్ని వెల్లడిస్తారు’అని బీజేపీ అగ్రనాయకత్వం స్పష్టం చేసినట్టు సమాచారం. అందుకు తగ్గట్లుగానే హరిబాబు టీడీపీ ప్రభుత్వంపై సునిశిత విమర్శలు ప్రారంభించారు. రుణమాఫీ హామీతో బీజేపీకి సంబంధంలేదని ఆయన ఓసారి ప్రకటించారు. హైదరాబాద్‌లో కూర్చొని పరిపాలన ఏమిటని మరోసారి ఘాటుగా దుయ్యబట్టారు. ఇలా టీడీపీని ఆత్మరక్షణలోకి నెట్టేసి జీవీఎంసీ ఎన్నికల సమయాన బీజేపీ అసలు డిమాండ్‌ను తెరపైకి తేనుంది. జీవీఎంసీ మేయర్ స్థానాన్ని తమకు కేటాయించాలని...లేకపోతే సొంతంగా పోటీచేస్తామని తేల్చిచెప్పాలన్నది బీజేపీ వ్యూహం. టీడీపీలో గుబులు జీవీఎంసీ పీఠమే లక్ష్యంగా బీజీపీ సాగిస్తున్న విమర్శల దాడి టీడీపీ తమ్ముళ్లను కలవరపరుస్తోంది. ఇటీవల ఎన్నికల్లో టికెట్లు రాని పలువురు మేయర్ గిరీపై ఆశలు పెట్టుకున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో బీజేపీకి మేయర్ స్థానాన్ని కేటాయించినా... పొత్తుకు స్వస్తిచెప్పి ఆ పార్టీ సొంతంగా పోటీచేసినా తమ అవకాశాలు మూసుకుపోతాయన్నది వారి ఆందోళన. కానీ ఈ విషయంపై ఇప్పటికిప్పుడు బయటపడలేక...మరోవైపు ధీమాగా ఉండలేక మల్లగుల్లాలు పడుతున్నారు. మరి భవిష్యత్తు రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాల్సిందే. -
ప్రకాశంలో కంగుతిన్న దేశం
జెడ్పీ చైర్మన్‌గా ఈదర హరిబాబు ఎన్నిక పోలీసుల మద్దతుతో పీఠం దక్కించుకునేందుకు టీడీపీ యత్నం హైదరాబాద్ నుంచి ఒంగోలుకు వస్తున్న వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీని మధ్యలోనే అరెస్టు చేసిన పోలీసులు టీడీపీ అభ్యర్థి మన్నె రవీంద్రపై స్వతంత్ర అభ్యర్థిగా టీడీపీకే చెందిన హరిబాబు పోటీ వైఎస్సార్సీపీ మద్దతుతో హరిబాబు గెలుపు వైస్ చైర్మన్‌గా వైఎస్సార్సీపీ అభ్యర్థి బాలాజీ ఎన్నిక ఒంగోలు: ఎన్ని కట్రలు, కుతంత్రాలు పన్నినా, పోలీసుల అండతో తప్పుడు కేసులో ఒక జెడ్పీటీసీని అరెస్టు చేయించినా ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాన్ని టీడీపీ దక్కించుకోలేకపోయింది. తనకు మెజార్టీ లేని జిల్లాను కైవసం చేసుకొనేందుకు టీడీపీ పన్నిన పన్నాగాలు ఫలించలేదు. సొంత పార్టీ నేతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం, ఆయనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలకడంతో అధికార పార్టీ కంగుతింది. పలు నాటకీయ పరిణామాల మధ్య జిల్లా పరిషత్ చైర్మన్‌గా స్వతంత్ర అభ్యర్థి ఈదర హరిబాబు, వైఎస్ చైర్మన్‌గా వైఎస్సార్ సీపీ అభ్యర్థి నూకసాని బాలాజీ గెలుపొందారు. ప్రకాశం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్‌కు 31 స్థానాలు, తెలుగుదేశం పార్టీకి 25 జెడ్పీటీసీ స్థానాలు దక్కాయి. మెజారిటీ లేకపోయినా జెడ్పీ పీఠాన్ని దక్కించుకునేందుకు టీడీపీ చేయని ప్రయత్నం లేదు. టీడీపీ నేతలు ముగ్గురు వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీలను ప్రలోభపెట్టి, తమ పార్టీ వైపు తిప్పుకున్నారు. దీంతో ఇరు పార్టీల బలాలు సమానమయ్యాయి. అయినా టీడీపీ నేతలు గొడవకు దిగి ఈ నెల ఐదున జరగాల్సిన ఎన్నిక వాయిదా పడటానికి కారణమయ్యారు. ఎన్నికల కమిషన్ మళ్లీ ఆదివారం ఎన్నిక నిర్వహించింది. దీనికి ప్రత్యేక పరిశీలకునిగా సమాచార శాఖ కమిషనర్ దాన కిషోర్‌ను పంపింది. ఈ వారం రోజుల్లో వైఎస్సార్ సీపీ సభ్యులను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించినా ఎవ్వరూ వెళ్లకపోవడంతో అధికార పార్టీ చివరికి పోలీసులను ప్రయోగించింది. జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికల్లో ఓటేసేందుకు హైదరాబాద్ నుంచి ఒంగోలు వస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ సభ్యుడు జవ్వాజి రంగారెడ్డిని ఆదివారం తెల్లవారుజామున పోలీసులు సంతమాగులూరు వద్ద సినీఫక్కీలో అరెస్టు చేశారు. ఈనెల 10న మార్కాపురం పోలీసు స్టేషన్లో ఆయనపై అందిన ఫిర్యాదు మేరకు ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదైంది. ఈ విషయం తెలియని రంగారెడ్డి సహచర సభ్యులతో కలిసి ప్రైవేటు బస్సులో హైదరాబాద్ నుంచి బయల్దేరారు. ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో సంతమాగులూరు టోల్‌ప్లాజా సమీపంలోని అతిథి గృహం వద్ద కాలకృత్యాల కోసం ఆగారు. ఆ సమయంలో ఓ పాఠశాల వాహనంలో వచ్చిన 80 మంది పోలీసులు జెడ్పీటీసీల బస్సును చుట్టుముట్టారు. మార్కాపురం డీఎస్పీ జి. రామాంజనేయులు బస్సులోకి వచ్చి రంగారెడ్డిని బలవంతంగా కిందికి దిం పారు. అడ్డుకున్న మిగతా జెడ్పీటీసీలను పోలీసులు నెట్టివేశారు. అరెస్టుకు కారణమడిగినా సమాధానం చెప్పలేదు. అప్పటికప్పుడు మార్కాపురం జూనియర్ సివిల్ జడ్జి ఎస్.మహ్మద్ అబుల్తాలీఫ్ఫర్విజ్ ఇంట్లో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించి ఆయన్ని సబ్ జైలుకు తరలించారు. కొద్దిగంటల్లో జెడ్పీ చైర్మన్ ఎన్నికల్లో ఓటేయాల్సిన రంగారెడ్డి అరెస్టును ఊహించని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సంతమాగులూరు, ఒంగోలు, మార్కాపురంలలో ఆందోళనలు చేపట్టారు. ఈ సంఘటనపై వైఎస్సార్ సీపీ నేత, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది టీడీపీ అరాచకానికి నిదర్శనమని, జెడ్పీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అవసరమైన బలం తమ పార్టీకి ఉన్నా, దౌర్జన్యంతో టీడీపీ లాక్కోవడానికి పూనుకుని అరాచకాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. దీనిపై ఎన్నికల పరిశీలకునికి, ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. ఈలోగా కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక జరిగింది. రెండు స్థానాలను తెలుగుదేశం పార్టీ 28 -27 ఓట్ల తేడాతో గెలుచుకుంది. జెడ్పీ అభ్యర్థిగా టీడీపీ మన్నె రవీంద్రను ఎంపిక చేసింది. దీంతో మొదటి నుంచి చైర్మన్ పదవిని ఆశించిన పొన్నలూరు జెడ్పీటీసీ ఈదర హరిబాబు స్వతంత్ర అభ్యర్థిగా నిలబడుతున్నట్లు ప్రకటించారు. వైఎస్సార్సీపీ వ్యూహాత్మకంగా స్వతంత్ర అభ్యర్థిని బలపరిచింది. ఈ పరిణామంతో టీడీపీ సభ్యులు కంగుతిన్నారు. పార్టీ తరఫున గెలిచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి వీల్లేదంటూ ఆ పార్టీ సభ్యులు అడ్డు తగిలారు. దీనిపై కలెక్టర్ విజయకుమార్ ఎన్నికల కమిషన్‌ను సంప్రదించారు. ఇదే సమావేశం మందిరం నుంచి బయటకు వెళ్లిన మంత్రి శిద్దా రాఘవరావు కలెక్టర్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ఎన్నికల సంఘం నుంచి ఆమోదం రావడంతో కలెక్టర్ ఎన్నిక నిర్వహించారు. టీడీపీ అభ్యర్థి మన్నె రవీంద్రకు 27, ఈదర హరిబాబుకు 28 ఓట్లు వచ్చాయి. దీంతో హరిబాబు జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికైనట్లు కలెక్టర్ ప్రకటించారు. వైస్ చైర్మన్‌గా వైఎస్సార్సీపీకి చెందిన నూకసాని బాలాజీ గెలుపొందారు. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగగా ఈదర హరి బాబు మద్దతు ఇవ్వడంతో టీడీపీ అభ్యర్థిపై ఒక ఓటు తేడాతో గెలిచారు. వీరిద్దరితో కలెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించారు. టీడీపీ నుంచి ఈదర సస్పెన్షన్: స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ ఈదర హరిబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్ధన్ ప్రకటించారు. ఆదివారం రాత్రి ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పార్టీలో నమ్మకంగా ఉంటూ హరిబాబు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం తమను షాక్‌కు గురిచేసిందని చెప్పారు. ఓ ప్రణాళిక ప్రకారమే ఇది జరిగిందన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని హరిబాబునే తీసుకోమని ముందుగా మంత్రి ప్రతిపాదించారని, అప్పుడు ఆయన తిరస్కరించారని చెప్పారు. ఇప్పుడు ఎందుకు స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డారో అర్థం కావడంలేదన్నారు. పార్టీకి ద్రోహం చేసిన ఈదర హరిబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అధిష్టానం నిర్ణయించిందని చెప్పారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కదిరి బాబూరావు, ఏలూరి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. -
విశాఖకు చోటేది?
కేంద్ర మంత్రి వర్గంలో జిల్లాకు ప్రాతినిథ్యం శూన్యం వెంకయ్యకు బెర్త్ ఖరారవడంతో హరిబాబుకు చేజారిన అవకాశం మలి విడతలోనూ కష్టమే గతంలో జిల్లా నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు సాక్షి, విశాఖపట్నం: దేశ కొత్త ప్రధాని నరేంద్రమోడీ మంత్రివర్గంలో విశాఖకు చోటు దక్కలేదు. తొలి విడత కేటాయించే మంత్రి పదవుల్లో విశాఖ పార్లమెంట్ నుంచి హరిబాబుకు అవకాశం లభిస్తుందని అంతా అంచనా వేశారు. హరిబాబు సీమాంధ్ర రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కూడా కావడంతో కచ్చితంగా ఏదొక పదవి వరిస్తుందని ప్రచారం జరిగింది. కానీ సోమవారం నాటి కేంద్ర మంత్రివర్గం ప్రమాణ స్వీకారంలో ఆయనకు ఆ అవకాశం దక్కకుండా పోయింది. మలివిడత మంత్రి పదవుల కేటాయింపులో ఆయనకు అవకాశం లభిస్తుందని ఆయన అనుచరులు గట్టిగా చెబుతున్నారు. అసలు హరిబాబుకు మంత్రి పదవి లభించడం సాధ్యం కాకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడుకు మోడీ మంత్రివర్గంలో చోటిచ్చారు. దీంతో వెంకయ్య సామాజిక వర్గానికి చెందిన హరిబాబుకు పదవి దక్కకపోవచ్చనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో టీడీపీ తరపున అశోక్ గజపతిరాజుకు మంత్రి పదవి కేటాయించారు. కర్ణాటక రాజ్యసభ కోటాలో వెంకయ్యను పదవి వరించింది. ఇప్పుడు మూడో పదవిగా హరిబాబుకు రాష్ట్రం నుంచి ఇవ్వడానికి మోడీ సుముఖంగా లేనట్టు సమాచారం. మరోపక్క ఎంపీగా గెలిచిన తర్వాత కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని హరిబాబుతోపాటు ఆయన అనుచరులు గట్టిగా నమ్మారు. పైగా గతంలో ఎన్డీఏ ప్రభుత్వంలో హరిబాబు అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆ సీనియార్టీతో ఈసారి మంత్రి పదవితోపాటు కేంద్ర ఐటీ శాఖ వస్తుందని విస్తృతంగా ప్రచారం జరిగింది. దీనికితోడు హరిబాబు కూడా గెలిచిన తర్వాత పార్టీ అగ్రనేతలను కలుసుకున్నారు. తీరా ఇప్పుడు పదవి రాకపోవడంతో ఆయన అనుచర వర్గాలు నిరాశలో కూరుకుపోయాయి. తర్వాత ప్రకటించే జాబితాలోనూ అవకాశం దక్కకపోవచ్చని తెలియడంతో నిరాశ చెందుతున్నాయి. వెంకయ్యనాయుడు, హరిబాబు ఇద్దరూ ఒకేసారి రాజకీయాల్లోకి రావడంతోపాటు ఒకరకంగా ఇద్దరు స్నేహితులు కూడా. ఈ నేపథ్యంలో వీరిలో ఒకరికి పదవి దక్కగా మరొకరికి అవకాశం లేకుండా పోయింది. మొత్తానికి కొత్త ప్రధాని ప్రకటించిన మంత్రివర్గంలో ఈ ప్రాంతానికి చోటు దక్కకపోవడం విశాఖవాసులను నిరాశపర్చింది. -
కమల ‘విశాఖ’!
బీజేపీకి ఆనందల‘హరి’ విష్ణుకే ‘వన్’దనం పదిహేనేళ్ల తర్వాత విజయం రెండుసార్లు సైకిల్ మద్దతుతోనే విశాఖపట్నం, న్యూస్‌లైన్: పదిహేనేళ్ల క్రితం ఎమ్మెల్యేగా... ఇప్పుడు ఎంపీగా ఘన విజ యం. ఆ ఘనతను డాక్టర్ కంభంపాటి హరి బాబు సాధించారు. విశాఖలో 15 ఏళ్ల తర్వాత బీజేపీ వికాసానికి కారకులయ్యారు. రెండుసా ర్లూ తెలుగుదేశం పార్టీతో పొత్తువల్లే విజయకేతనం ఎగరేయగలిగారు. హరి వెర్సెస్ హరిబాబు విశాఖ ఒకటో నియోజకవర్గం నుంచి 1999 లో ఎమ్మెల్యేగా డాక్టర్ కంభంపాటి హరి బాబు విజయం సాధించగా మళ్లీ 2014లో ఆయన విశాఖ నుంచి ఎంపీగా విజేతల య్యారు. విద్యార్థి దశ నుంచే రాజకీయ పాఠాలు నేర్చుకున్న హరిబాబు 1999లో అప్పటి మేయర్‌గా ఉంటూ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన సబ్బం హరిపై హరి బాబు విజయం సాధించారు. విశాఖ రాజకీయాలకు అంతగా పరిచయం లేని వ్యక్తిగానే హరిబాబు అప్పట్లో రాజకీ య అరంగేట్రం చేశారు. మొదటి పోటీలో నే మేయర్‌పై 6 వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించడంతో హ రిబాబు పేరు బీజేపీలో మారుమోగింది. బీజేపీ శాసనసభా పక్ష నేతగా వ్యవహరించడంతో బీజేపీ జాతీయ నేతల దృష్టిలో పడ్డారు. ఆ తర్వా త జరిగిన ఎన్నికల్లోనూ పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ద్రోణంరాజు సత్యనారాయణపై ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో బరిలోకి దిగలేదు. జాతీయ పార్టీ సేవలో గడిపారు. సీమాంధ్ర అధ్యక్షునిగా పగ్గాలు ఇటీవల రాష్ట్ర విభజన నేపధ్యంలో సీమాం ధ్రకు జరుగుతున్న నష్టంపై బీజేపీ అధిష్టానాన్ని కదిలించారు. సీమాంధ్ర ప్రయోజనాలు పరిరక్షించే దిశగా బీజేపీ నేతలను పురిగొలిపారు. రాష్ట్రం విడిపోయిన స్వల్ప కాలంలోనే బీజేపీ సీమాంధ్ర అధ్యక్షునిగా హరిబాబు పగ్గాలు చేపట్టారు. విశాఖ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. తిరిగిన ‘విష్ణు’చక్రం విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన పెన్మత్స విష్ణుకుమా ర్ రాజు గెలుపు కూడా బీజేపీ ఖాతాలో జమ అయింది. హరిబాబు తర్వాత విశాఖ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేగా విష్ణుకుమార్ రాజు రికార్డులకెక్కారు. విశాఖ ఉత్తర నియోజక వర్గ ఎమ్మెల్యేగా విజయం సాధించిన పెన్మెత్స విష్ణుకుమార్ రాజు ఎన్నికలకు సరిగ్గా మూడు మాసాల కిందటే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. రుషికొండ కేంద్రంగా సాఫ్ట్వేర్ పరిశ్రమను నడిపే విష్ణుకుమార్ రాజుకు కూడా రాజకీయానుభవం లేదు. ఇటీవల జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉద్యోగులను ముం దుండి నడిపించేవారు. ఆ అనుభవంతోనే నేరుగా ఢిల్లీ వెళ్లి పార్టీ తీర్థం పుచ్చుకోవడం, ఆ తర్వాత పార్టీలోని సీనియర్లందరినీ కాదని బీజేపీ-టీడీపీ పొత్తులో ఉత్తర టికెట్ పొందడంలో విజయం సాధించారు. -
'విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తాం'
విశాఖ : విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తామని సీమాంధ్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు అన్నారు. హైదరాబాద్ కేంద్రీకతృ అభివృద్ధి వల్లే ఆంధ్రా నష్టపోయిందని ఆయన మంగళవారమిక్కడ వ్యాఖ్యానించారు. వికేంద్రీకృత అభివృద్ధికి బీజేపీ కృషి చేస్తుందని హరిబాబు తెలిపారు. గుజరాత్ పాలన వల్లే నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్థి అవగలిగారని ఆయన పేర్కొన్నారు. -
లేహ్యం పేరుతో లూటీ
చీరాల, న్యూస్‌లైన్ : వివిధ రోగాలకు వాడే లేహ్యం విక్రయం పేరుతో జిల్లాతో పాటు కృష్ణా, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని పలు గ్రామాలు, పట్టణాల్లో సంచరిస్తూ తాళాలు వేసి ఉన్న ఇళ్లల్లోకి చొరబడి దొంగతనాలు చేస్తున్న ఒక ముఠాను చీరాల పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి * 12 లక్షల విలువైన 42 సవర్ల బంగారం, రెండున్నర కేజీల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఒన్‌టౌన్ పోలీసుస్టేషన్లో డీఎస్పీ నరహర శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుల వివరాలు వెల్లడించారు. కృష్ణా జిల్లా నున్నా గ్రామానికి చెందిన పిండ్రాల కోటయ్య, పెద్దసముద్రం, చిన్నసముద్రం అనే ముగ్గురు మూడు ముఠాలుగా ఏర్పడి లేహ్యం అమ్ముతామని గ్రామాల్లో తరచూ పర్యటిస్తుంటారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని ప్రధాన ముఖద్వారం కాకుండా ఇతర ద్వారాలను పగులగొట్టి ఇళ్లల్లోకి చొరబడి విలువైన వస్తువులు దొంగిలిస్తుంటారు. ఇందులో ఒక ముఠాలోని పిండ్రాల కోటయ్య, అతని కొడుకులు వెంకటేశ్వర్లు, హరిబాబు చీరాలలో పలు దొంగతనాలకు పాల్పడ్డారు. గతేడాది నవంబర్‌లో పేరాలలోని కారెంపూడి లీలామోహనరావు ఇంట్లో తాళం పగులగొట్టి 30 సవర్ల బంగారం, రెండు కేజీల వెండి దొంగిలించారు. కొత్తపేటలో కరణం రాంబాబు అనే వ్యక్తి ఇంట్లో గత డిసెంబర్ నెలలో ఆరు సవర్ల బంగారం, రూ 18 వేల నగదు దొంగిలించారు. పాపరాజుతోటలోని గోపాలరావు ఇంట్లో మూడు సవర్ల బంగారం, పావుకేజీ వెండి దొంగిలించారు. ఉడ్‌నగర్‌లోని సుజాత అనే మహిళ ఇంట్లో ఈ ఏడాది నవంబర్‌లో చొరబడి మూడు సవర్ల బంగారం, పావుకేజీ వెండి అపహరించారు. వీటితో పాటు వీరిపై అనంతపురం, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో అనేక కేసులున్నాయి. ఈ అంతర్జిల్లా నేరస్తులపై పోలీసులు నిఘా పెట్టారు. స్థానిక డీఎస్పీ నరహర నేతృత్వంలో ట్రైనీ డీఎస్పీ శ్రీనివాసరావు, టూటౌన్ సీఐ అబ్దుల్‌సుభాన్, ఒన్‌టౌన్ సీఐ భీమానాయక్, రూరల్ సీఐ ఫిరోజ్, ఈపూరుపాలెం ఎస్సై రాంబాబు, సిబ్బంది రాఘవ, రవి, బాషా, శ్రీనివాసులు, నాగరాజు, చంద్రపాల్, నాగూర్‌లు గుంటూరు జిల్లా బాపట్లలోని కోనాభవన్ వద్ద నిందితులను శుక్రవారం అరె స్టు చేశారు. దొంగతనాలకు పాల్పడుతున్న పెద్దసముద్రం, చిన్నసముద్రం ముఠాలను కూడా త్వరలో అరెస్టు చేస్తామని డీఎస్పీ నరహర తెలిపారు. నిందితులను పట్టుకున్న పోలీస్ అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు. -
రాష్ట్రంలో రెండు శాఖలు ఏర్పాటు చేయనున్న బిజెపి
హైదరాబాద్: రాష్ట్రాన్ని విభజించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నేపధ్యంలో బిజెపి రెండు శాఖలు ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో రెండు శాఖలు ఏర్పాటు చేయనున్నట్లు బీజేపీ అధిష్టానం ఈనెల 21న ప్రకటన చేయనుంది. సీమాంధ్ర ప్రాంత అధ్యక్షుడిగా హరిబాబు, వీర్రాజు, సురేష్‌రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. తెలంగాణ ప్రాంత అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి.