ఓ మహిళకు ఉరివేసి చంపి, ఆపై యాసిడ్ పోసి కాల్చేశారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తాళ్లసింగారం చెరువులోని చెట్టుకు మహిళ మృతదేహం వేలాడుతుండగా గ్రామస్తులు మంగళవారం ఉదయం గమనించారు. ఈ మేరకు వారు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై హరిబాబు అక్కడికి చేరుకుని, మృతదేహాన్ని పరిశీలించారు. గుర్తు తెలియని దుండగులు గుర్తు తెలియని మహిళకు ఉరి వేసి చంపటంతోపాటు ముఖంపై యాసిడ్ పోసిన ఆనవాళ్లున్నాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఉరివేసి, యాసిడ్ పోసి...
Published Tue, May 31 2016 8:35 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
Advertisement
Advertisement