విస్తరణ: హుటాహుటిన ఢిల్లీకి బీజేపీ ఎంపీ..! | cabinet reshuffle: haribabu suddent delhi tour | Sakshi
Sakshi News home page

విస్తరణ: హుటాహుటిన ఢిల్లీకి బీజేపీ ఎంపీ..!

Published Sat, Sep 2 2017 7:25 PM | Last Updated on Sun, Sep 17 2017 6:18 PM

విస్తరణ: హుటాహుటిన ఢిల్లీకి బీజేపీ ఎంపీ..!

విస్తరణ: హుటాహుటిన ఢిల్లీకి బీజేపీ ఎంపీ..!

సాక్షి, విశాఖపట్నం: కేంద్ర కేబినెట్‌ విస్తరణ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ హరిబాబు హుటాహుటిన శనివారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లడం గమనార్హం. కుటుంబసభ్యులతో కలిసి ఆయన విశాఖపట్నం నుంచి ఢిల్లీకి బయలుదేరారు. కేంద్ర కేబినెట్‌ విస్తరణలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఆయనకు చోటు దక్కనుందని తాజా సమాచారం. బీజేపీ అధిష్టానవర్గం నుంచి అందని సమాచారం మేరకే హరిబాబు ఢిల్లీ విమానం ఎక్కినట్టు చెప్తున్నారు.

ఆదివారం ఉదయం కేంద్ర కేబినెట్‌ విస్తరణ జరగనున్నప్పటికీ ఇప్పటికీ కొత్తగా ఎవరూ కేబినెట్‌లో చేరనున్నారు? ఎవరెవరికి ఏ పదవులు దక్కనున్నాయి? అనేదానిపై స్పష్టత రాలేదు. ఇప్పటికే కేబినెట్‌ విస్తరణకు వీలు కల్పించేందుకు పలువురు కేంద్రమంత్రులు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కొత్తగా ఎవరికి అవకాశం లభిస్తుందనే విషయమై ఉత్కంఠ కొనసాగుతోంది. ఏపీ నుంచి హరిబాబు లేదా గోకరాజు గంగరాజుకు అవకాశం కల్పించవచ్చునని వినిపించిన సంగతి తెలిసిందే. ఇక తెలంగాణ నుంచి వెదిరె శ్రీరామ్‌ లేదా మురళీధర్‌రావుకు అవకాశం లభించవచ్చునని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement