ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు హరిబాబుకు ప్రత్యేక హోదా నిరసనలు చుట్టుముట్టాయి.
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు హరిబాబుకు ప్రత్యేక హోదా నిరసనలు చుట్టుముట్టాయి. ప్రత్యేక హోదాపై బీజేపీ మోసం చేసిందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ, ప్రజాసంఘాల నేతలు ఆయనకు తమ నిరసన గళాన్ని వినిపించాయి. ఆంధ్రప్రదేశ్కు ప్యాకేజీ ప్రకటించిన అనంతరం ఢిల్లీకి వెళ్లి ప్రధానికి ధన్యవాదాలు చెప్పిన హరిబాబు ఆదివారం సాయంత్రం తిరిగి విశాఖకు చేరుకున్నారు.
ఈ సందర్భంగా ఆయనకు నిరసన తెలిపేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, జిల్లా అధ్యక్షుడుగుడివాడ అమర్ నాథ్ సహా పార్టీ కార్యకర్తలు, సీపీఐ, ఇతర ప్రజాసంఘాల నేతలు విశాఖ ఎయిర్ పోర్ట్కు వెళ్లారు. దీంతో వారిపై పోలీసుల లాఠీలతో దాడి చేశారు. దీంతో అమర్ నాథ్ సహా సీపీఐ నేతలకు గాయాలయ్యాయి. అమర్ నాథ్ ను, సీపీఐ నేత సత్యనారాయణ మూర్తిని పోలీసులు అరెస్టు చేశారు. సీపీఐ మహిళా నేత విమలక్కను పోలీసులు లాక్కెళ్లారు. దీంతో ప్రత్యేక హోదాపై ప్రశ్నించే హక్కు, నిరసన తెలిపే హక్కు తమకు లేదా అంటూ వారు గట్టిగా నినదించారు.