
సాక్షి, విశాఖపట్టణం : అఖిలపక్షంలో నిర్ణయాలు అన్యాయంగా ఉన్నాయని బీజేపీ ఎంపీ హరిబాబు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన అఖిలపక్షంలో ఏ పార్టీలు పాల్గొనలేదని చెప్పారు. కమిటీల ద్వారా ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నిర్వహిస్తామని తెలుగుదేశం పార్టీ చెప్పడం విడ్డూరం అని అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని టీడీపీ ఆరోపించడంలో నిజంలేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అంటే నేను నేనంటే ఆంధ్రప్రదేశ్ అని చంద్రబాబు చెప్పడం హస్యాస్పదమని అన్నారు. ప్రభుత్వ ప్రాయోజిత ఉద్యమాల ద్వారా ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయే తప్ప మరొక ప్రయోజనం ఏమీ ఉండదని తెలిపారు.
గత నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం లక్షల కోట్ల పెట్టుబడులను ఇచ్చిందని వివరించారు. కేంద్రం చేసిన సాయాన్ని చూపిస్తే టీడీపీపై దాడి చేస్తున్నారని చంద్రబాబు ఆరోపిస్తున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment