స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దడమే లక్ష్యం
- విశాఖ ఎంపీ హరిబాబు
- కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆత్మీయ సత్కారం
విశాఖపట్నం : నవ్యాంధ్రను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని విశాఖ ఎంపీ హరిబాబు అన్నారు. శుక్రవారం సాయంత్రం విశాఖ సుబ్బలక్ష్మీ కల్యాణ మండపంలో కేంద్ర పరిశ్రమలు, ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను బీజేపీ జిల్లాశాఖ ఆధ్వర్యంలో ఘనం గా సత్కరించారు. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో డిమాండ్ ఉన్న వ్యవసాయ ఆథారిత ఉత్పత్తులకు ఏ దేశంలో గిరాకీ ఉంటే ఆ దేశాలకు వీటిని ఎగుమతి చేయాలన్నారు.
ఐటీసెజ్‌లను డీనోటిఫై చేయాలని ఆయన కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. రాబోయే రెండేళ్లలో 60 ఫార్మా కంపెనీలు రూ.2 వేల కోట్లతో వాటి ఉత్పత్తిని ప్రారంభిస్తాయన్నారు. వీటి ద్వారా బీఫార్మశీ, ఎం.ఫార్మశీ, కెమిస్ట్రీ పట్టభద్రులు రెండు వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. నాణ్యమైన విద్య కోసం బ్రిడ్జి కోర్సులను ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నారు.
అనకాపల్లి ఎంపీ ము త్తంశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ వివిధ పరి శ్రమలను ఆంధ్రకు తరలించాలని మంత్రి ని కోరారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సీతారామన్‌కు ‘బొబ్బిలి వీణ’ను బహూకరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేత చలపతిరావు, పార్టీ ఉపాధ్యక్షుడు బండారు రంగమోహన్, రాష్ట్ర నాయకులు చెరువు రామకోటయ్య, పృథ్వీరాజ్, మాధవ్ పాల్గొన్నారు.