ఢిల్లీ: కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్తో శుక్రవారం కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎంపీ హరిబాబు, ఏపీ డీజీపీ రాముడు భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఇటీవల రాష్ట్రంలో సంభవించిన వరదల వల్ల జరిగిన నష్టాన్ని సుజనా చౌదరి వివరించారు. వరదసాయంగా 1000 కోట్ల రూపాయలను రాష్ట్రానికి అందిచాలని కోరారు. అలాగే రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని ఆయన కోరారు. వరద తీవ్రతను అంచనా వేయడానికి కేంద్ర బృందాన్ని రాష్ట్రానికి త్వరగా పంపాలని విశాఖ ఎంపీ హరిబాబు హోం మంత్రిని కోరారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ ఏర్పాటుకు సహాయం అందిచాల్సిందిగా కేంద్ర హోంమంత్రిని డీజీపీ రాముడు కోరాడు.
రాజ్నాథ్ సింగ్ను కలిసిన సుజనాచౌదరి
Published Fri, Nov 27 2015 3:30 PM | Last Updated on Sun, Sep 2 2018 5:11 PM
Advertisement
Advertisement