ఢిల్లీకి చేరిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం | ap cs and union minister of state meets rajnath, discuss about phone tapping | Sakshi
Sakshi News home page

ఢిల్లీకి చేరిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం

Published Thu, Jun 18 2015 6:11 PM | Last Updated on Sun, Sep 2 2018 5:11 PM

ఢిల్లీకి చేరిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం - Sakshi

ఢిల్లీకి చేరిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం

ఓటుకు నోటు కేసు రోజురోజుకూ బిగుసుకుంటుండటంతో.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు, ఏపీ ప్రభుత్వ అధికారులు ఢిల్లీకి తీసుకెళ్లారు.  కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ను మరో కేంద్ర మంత్రి సుజనా చౌదరితో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు గురువారం కలిశారు.

తమ ఫోన్లను తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ట్యాప్ చేస్తోందంటూ ఆయనకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారాన్ని పట్టించుకోవాలని కోరారు. అయితే ఈ విషయంలో రాజ్నాథ్ నుంచి ఎలాంటి స్పందన వచ్చిందన్న విషయం మాత్రం తెలియరాలేదు. మరోవైపు ఇదే అంశంపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోయల్ను, టెలికం కార్యదర్శిని కూడా ఐవైఆర్ కృష్ణారావు తదితరులు కలిసినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement