సాక్షి,హైదరాబాద్: దేశ రక్షణలో తెలంగాణ కీలక అడుగు వేస్తోందని, డిఫెన్స్, ఆర్మీ విభాగాల్లో హైదరాబాద్ వ్యూహాత్మక స్థానంలో ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ముఖ్య అతిథిగా హాజరై వికారాబాద్ జిల్లా దామగుండంలో నేవీ ఏర్పాటు చేయనున్న వీఎల్‌ఎఫ్ రాడార్ స్టేషన్‌కు మంగళవారం(అక్టోబర్15) శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ‘వీఎల్‌ఎఫ్ స్టేషన్ పై కొందరు అపోహాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. తమిళనాడులో ఇలాంటి స్టేషన్ ఏర్పాటు చేసి 34 ఏళ్లు అవుతున్నా ఎలాంటి ఇబ్బందులూ తలెత్తలేదు. వివాదం చేసే వాళ్ళు దేశ రక్షణ కోసం ఆలోచన చేయాలి. అసలు బీఆర్‌ఎస్ హయాంలోనే రాడార్ స్టేషన్‌కు అనుమతులిచ్చారు.
దేశ రక్షణపై వివాదాలు సృష్టించే వారికి కనువిప్పు కలగాలి. నేను, స్పీకర్ ఈ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నాం. దేశ రక్షణ కోసం రాజకీయాలను వదిలి కేంద్రానికి సహకరిస్తున్నాను. కేంద్ర రక్షణ మంత్రి వేరే పార్టీ అయినా... నేను వేరే పార్టీ అయినా దేశ రక్షణ కోసం అందరం ఒకటే. వీఎల్‌ఎఫ్ స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుంది’అని రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండిసంజయ్ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఓ వైపు మరణశాసనం..మరోవైపు సుందరీకరణ ఎలా: కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment