ప్రధాని నరేంద్ర మోడీతో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశమయ్యారు.
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీతో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశమయ్యారు. పాకిస్థాన్ కాల్పులకు దిగిన సంఘటనపై రాజ్నాథ్ చర్చించారు. సరిహద్దు వద్ద తాజా పరిస్థితిని మోడీకి వివరించారు.
జమ్మూకాశ్మీర్ సరిహద్దు వెంబడి పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. బుధవారం కూడా దాడి చేశారు. పాక్ కాల్పుల్లో ఏడుగురు చనిపోయారని రాజ్నాథ్ ప్రధానికి తెలిపారు.