జిల్లాకు తుఫాన్ హెచ్చరికలు ఉన్నందున అధికారులంతా ఎటువంటి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు తక్షణమే చేపట్టాలని కలెక్టర్ ఎంఎం నాయక్ అన్నారు. అధికారులతో ఆయన గురువారం
విజయనగరం కంటోన్మెంట్ : జిల్లాకు తుఫాన్ హెచ్చరికలు ఉన్నందున అధికారులంతా ఎటువంటి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు తక్షణమే చేపట్టాలని కలెక్టర్ ఎంఎం నాయక్ అన్నారు. అధికారులతో ఆయన గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తుఫాన్ రాక ముందే ప్రభావిత ప్రాంతాలపై దృష్టి పెట్టి రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తుఫాన్ అనంతరం జరిగే నష్టాలను పూడ్చేందుకు, బాధితులకు పునరావాసం కల్పించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. తుఫాన్ సమయంలో బాధితులకు అందించేందుకు తాగునీరు, మంచి ఆహారం, కిరోసిన్, బియ్యం తదితర సరుకులను సిద్ధం చేయూలన్నారు. పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. గతంలో తుఫాన్‌లను ఎదుర్కొన్నట్టే ఈసారి కూడా ఎలాంటి లోపాలు లేకుండా పని చేయూలని కోరారు.
మత్స్యకారులు వేటకు వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేశామన్నారు. అయినా ప్రత్యేకాధికారులు వారిని సముద్రంలోకి వెళ్లకుండా చూడాలన్నారు. వారికి కేటాయించిన ప్రాంతాల్లో ఉంటూ నిరంతరం పర్యవేక్షిం చాలన్నారు. వాతావరణ శాఖ అందిస్తున్న సమాచారా న్ని ఎప్పటికప్పుడు తెలుసుకుని అందుకు తగ్గట్టుగా పనిచేయూలన్నారు. చిన్న పిల్లలకు అవసరమయ్యే పాల డబ్బాను, తాగునీటిని నిల్వ ఉంచాలని సూచించారు. వైద్యాధికారులు మందులతో సిద్ధంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాల కు తరలించాలన్నారు. చెట్లు, పాడుబడిన భవనాల్లో ప్రజలు నివాసం లేకుండా చూడాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు తమ ఆస్తులను వదిలి తర లివెళ్లేందుకు సుముఖంగా ఉండరని, ప్రాణనష్టం, పశునష్టం కన్నా ఆస్తులు ఎక్కువ కాదనే విషయూన్ని వారికి అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో జేసీ బి.రామారావు, ఏజేసీ నాగేశ్వరరావు, జెడ్పీ సీఈఓ ఎన్.మోహనరావు, ఆర్‌డీఓ జె.వెంకటరావు, డీఎస్‌ఓ హనుమంతు వెంకటప్రసాదరావు, డీపీఓ మోహనరావు, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.
తీరంలో అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్
పూసపాటిరేగ : హుదూద్ నేపథ్యంలో తీరంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎంఎం నాయక్ అధికారులను ఆదేశించారు. ఇక్కడ తహశీల్దార్ కార్యాలయంలో అధికారులతో ఆయన గురువారం సమావేశమయ్యూరు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీరప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అధికారులను అప్రమత్తం చేస్తున్నట్టు తెలి పారు. తీరప్రాంతంలో గల ఆరు రెవెన్యూ గ్రామాల్లో తాగునీటికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. ఆరుగురు ప్రత్యేక అధికారులను నియమించినట్టు తెలిపారు.ఎన్‌డీఆర్‌ఎఫ్ దళం కూడా నియమించినట్టు తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. రెండు మండలాల్లో 13 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. పునరావాస కేంద్రాలకు అవసరమైన సరుకులు, రేషన్ కూడా అందుబాటులో ఉంచామన్నారు.