
హుదూద్ తుఫానుపై 'నాసా' కన్ను
ఉత్తర కోస్తాను వణికిస్తున్న హుదూద్ తుఫానుపై నాసా దృష్టి పెట్టింది. హుదూద్ తుఫానుపై నాసా హెచ్చరికలు జారీ చేసింది.
వాషింగ్టన్ : ఉత్తర కోస్తాను వణికిస్తున్న హుదూద్ తుఫానుపై నాసా దృష్టి పెట్టింది. హుదూద్ తుఫానుపై అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కూడా హెచ్చరికలు జారీ చేసింది. తుఫాను తీరందాటే సమయంలో గంటకు 185 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. తుఫాను గమనంపై నాసా ఉపగ్రహం ఆక్వా ఈ సమాచారాన్ని అందించింది.
మేఘాల్లో ఉష్ణోగ్రత -53 డిగ్రీల సెంటీగ్రేడ్గా నాసా పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలకు ఇది సూచనగా నాసా హెచ్చరించింది. 11.1 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా తుఫాను కదులుతున్నట్లు నాసా తెలిపింది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుంటే తుఫాను తీవ్రత ఎక్కువగా ఉంటుందని నాసా వెల్లడించింది.