హుదూద్ తుపాన్ కారణంగా హైదరాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విశాఖపట్నం, రాజమండ్రికి మధ్య రాకపోకలు సాగించే విమాన సర్వీసులన్నీ దాదాపు రద్దయ్యాయి.
సాక్షి, హైదరాబాద్: హుదూద్ తుపాన్ కారణంగా హైదరాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విశాఖపట్నం, రాజమండ్రికి మధ్య రాకపోకలు సాగించే విమాన సర్వీసులన్నీ దాదాపు రద్దయ్యాయి. విశాఖపట్నం నుంచి ఉదయం 10 గంటలకు హైదరాబాద్ చేరుకోవాల్సి ఇండిగో విమానం, 10.10కి చేరుకోవాల్సిన స్సైస్‌జెట్ విమానంతోపాటు మధ్యాహ్నం 12, 1.45 గంటలకు రాజమండ్రి నుంచి హైదరాబాద్ చేరుకోవాల్సిన విమాన సర్వీసులను రద్దు చేశారు.
సాయంత్రం 4 గంటలకు రాజమండ్రి నుంచి రావాల్సిన విమానంతోపాటు 6.35 గంటలకు విశాఖపట్నం నుంచి రావల్సిన రెండు విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి. శంషాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే 4 విమానాలతోపాటు రాజమండ్రి వెళ్లాల్సిన 3 విమానాలనూ రద్దు చేసినట్టు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.