
జగన్‌కు ఘన స్వాగతం
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి విశాఖ విమానాశ్రయంలో మంగళవారం ఘన స్వాగతం లభించింది.
విశాఖ విమానాశ్రయంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి మంగళవారం ఘన స్వాగతం లభించింది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని చెన్నై ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన ఆయనకు ఇక్కడి విమానాశ్రయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు.
విశాఖపట్నం: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి విశాఖ విమానాశ్రయంలో మంగళవారం ఘన స్వాగతం లభించింది. చెన్నై ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పర్యటన కోసం వచ్చిన ఆయనను పార్టీ ఉత్తరాంధ్ర కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, ఎమ్మెల్యేలు సుజయకృష్ణ రంగారావు, పూడి ముత్యాలనాయుడు, కిడారి సర్వేశ్వర్రావు, గిడ్డి ఈశ్వరి, మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జి, కర్రి సీతారాం, చెంగల వెంకటరావు, పార్టీ నాయకులు తిప్పల నాగిరెడ్డి, వంశీకృష్ణ శ్రీనివాస్, చొక్కాకుల వెంకటరావు, గుడివాడ అమర్‌నాథ్, కోలా గురువులు, పెట్ల ఉమాశంకర గణేష్, ప్రగడ నాగేశ్వరరావు తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు.
నాగరాజు కుటుంబానికి ఓదార్పు
ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్.విజయువ్ము గెలవలేదని వునస్తాపంతో నాగరాజు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో అతని కుటుంబాన్ని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్చారు. శ్రీకాకుళం వెళుతూ మధురవాడలో కాన్వాయ్‌ని ఆపి కుటుంబ సభ్యులను పలకరించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.