
పూతలపట్టు మండలం పి.కొత్తకోటలో ఆటో నడుపుతున్న ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్
పూతలపట్టు: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆటోవాలాలను ఆదుకుంటారని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ భరోసా ఇచ్చారు. బుధవారం పూతలపట్టు మండలంలో గడప గడపకూ వైఎస్సార్ సీపీ కార్యక్రమం నిర్వహించారు. రాత్రి పి.కొత్తకోటలోని ఆటోస్టాండ్ వద్ద ఆయన ఆటోడ్రైవర్లతో మాట్లాడారు. అనంతరం తామంతా జగనన్నకు అండగా ఉంటామంటూ ఆటో డ్రైవర్లు ఎమ్మెల్యేకు ఖాకీ చొక్కా తొడిగారు. ఎమ్మెల్యే ఆటోలో డ్రైవర్లను ఎక్కించుకుని కొంతసేపు చక్కర్లు కొట్టడంతో పలువురు ఆసక్తిగా చూశారు.