
సాక్షి, విజయవాడ: టీడీపీ విడుదల చేసిన ఫోరెన్సిక్ రిపోర్టులో వాస్తవాలు లేవని ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ అన్నారు. ఈ మేరకు విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. అది ఇద్దరి మధ్య జరిగిన వీడియో కాల్. దీనిపై కొందరు ఫోరెన్సిక్ రిపోర్ట్ అని విడుదల చేశారు. ఆ వీడియోను ఎవరో షూట్ చేశారు. మూడో వ్యక్తి షూట్ చేసిన వీడియోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపి రిపోర్ట్ తీసుకున్నారు.
వీడియో కంటెంట్ ఒరిజినలా కాదా అనేది ల్యాబ్ చెప్పలేదు. రిపోర్ట్‌ను మార్చి ప్రచారం చేశారు. ప్రైవేట్ ల్యాబ్‌లు ఇచ్చే నివేదికలకు విలువ ఉండదు. మన ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చే నివేదికే ప్రామాణికం. వీడియో తనది కాదని ఎంపీ గోరంట్ల మాధవ్ చెప్పారు. మార్ఫింగ్ చేశారని ఎంపీ ఫిర్యాదు చేశారు. దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment