కాంగ్రెస్ నాయకుని హత్య | Youth Congress Leader Hacked To Death In Kerala, Left Activists Detained | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ యువజన నాయకుని హత్య

Published Tue, Mar 15 2016 2:48 PM | Last Updated on Sun, Sep 3 2017 7:49 PM

Youth Congress Leader Hacked To Death In Kerala, Left Activists Detained

తిరువనంతపురం:  కేరళలో కాంగ్రెస్ పార్టీ  యువజన విభాగం నాయకడు  సునీల్ కుమార్ (28)  మంగళవారం హత్యకు గురయ్యారు. ఉదయం ఆయన ఇంటిపై దాడిచేసిన వామపక్ష పార్టీ కార్యకర్తలు  కత్తులతో  నరికి చంపారు. రాజధానికి కూతవేటు దూరంలోని అలెప్పూలో ఈ సంఘటన చోటు చేసుకుంది.  ఈ సంఘటనలో నలుగురు సీపీఎం కార్యకర్తలను   పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసులు అందించిన సమాచారం ప్రకారం సునీల్  ఆయన నివాసంలో ఉండగా  సీపీఎం మద్దతుదారులు  ఆయనపై దాడికి  దిగ కత్తులతో పొడిచి చంపారు.  సునీల్ కుమార్ ఇటీవల సీపీఎం నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు సమచారం. దానికి ప్రతీకారంగానే ఈ హత్య జరిగినట్టుగా అనుమానిస్తున్నారు. ఈ సంఘటనలో కేసు నమోదు  చేసిన పోలీసులు అనుమానితులుగా  సీపీఎం మద్దతుదారులను అదుపులోకి తీసుకున్నారు.

కేరళలోత్వరలో   జరగనున్నఎన్నికల నేపథ్యంలోగత రెండు నెలలకాలంలో  రాజకీయ ప్రత్యర్థుల మధ్య దాడులు, హత్యలు  చోటు చేసుకున్నాయి. ఇటీవలి బీజేపీ కార్యకర్త ఇటీవల హత్యకు గురిగాకా,  ఇరువర్గాలు  కార్యకర్తలు దాడికి గురయ్యారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement