‘అవిశ్వాస తీర్మానంలో పాల్గొనకుంటే రూ.15 కోట్ల ఆఫర్’ | " Rs 15 crore offer for not participating in the vote of no confidence' | Sakshi
Sakshi News home page

‘అవిశ్వాస తీర్మానంలో పాల్గొనకుంటే రూ.15 కోట్ల ఆఫర్’

Published Sun, Mar 13 2016 1:34 PM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

‘అవిశ్వాస తీర్మానంలో పాల్గొనకుంటే రూ.15 కోట్ల ఆఫర్’ - Sakshi

‘అవిశ్వాస తీర్మానంలో పాల్గొనకుంటే రూ.15 కోట్ల ఆఫర్’

టీడీపీ వర్గాలు మరింత బరితెగించాయి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు నోట్ల కట్టలతో రంగంలోకి దిగాయి. ప్రభుత్వంపై ప్రతిపక్షం ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానం ఓటింగ్‌లో పాల్గొనకుండా ఉంటే ముందస్తుగా రూ.10 కోట్లు ముట్టజెబుతామంటూ తనకు టీడీపీ వర్గాల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని చిత్తూరు జిల్లా పూతలపట్టు వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ వెల్లడించారు.

ఆదివారం ఆయన జిల్లాలోని ఐరాలలో మీడియా ముందు ఈ వివరాలు వెల్లడించారు. టీడీపీ సర్కారుపై వైఎస్సార్‌సీపీ ప్రవేశపెట్టబోయే అవిశ్వాస తీర్మానంలో పాల్గొనకుండా ఉంటే ముందు రూ.10కోట్లు ఇవ్వడంతోపాటు, తర్వాత రూ.5 కోట్ల రూపాయల మేర పనులు అప్పగిస్తామని చెప్పి కొన్ని రోజులుగా టీడీపీ వర్గాలు తనను ప్రలోభ పెడుతున్నాయని, కాల్స్ వస్తున్నాయని అన్నారు.

దీనికి సంబంధించి ఓ ఎస్‌ఎంఎస్ కూడా తన నంబర్‌కు వచ్చినట్టు తెలిపారు. ఈ విషయాన్ని పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లానని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఈ విధమైన చర్యలు సరికావని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement