పామాయిల్ కేసు ఉపసంహరణకు హైకోర్టు తిరస్కరణ
కొచ్చి: పామాయిల్ దిగుమతుల స్కాం కేసులో కేరళలోని కాంగ్రెస్-యూడీఎఫ్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారులు నిందితులుగా ఉన్న ఈ కేసులో ప్రాసిక్యూషన్‌ను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని రాష్ట్ర హైకోర్టు తిరస్కరించింది. కేసును కొట్టేస్తే నిందితులకు వ్యక్తిగతంగానో మరోరకంగానో మేలు కలుగుతుందని పేర్కొంది. అంతేకాకుండా న్యాయప్రక్రియను తొక్కిపెట్టినట్లవుతుందని వ్యాఖ్యానించింది. ప్రాసిక్యూషన్‌లో న్యాయ ప్రక్రియ దుర్వినియోగం కాలేదని పేర్కొంది.
తనపై విచారణ రద్దు చేయాలని ఐఏఎస్ అధికారి గిజీ థామ్సన్, తమను కేసులో ఇంప్లీడ్ చేసుకోవాలని అసెంబ్లీ విపక్ష నేత అచ్యుతానందన్, సీపీఐ ఎమ్మెల్యే సునీల్ కుమార్‌లు వేసిన పిటిషన్లనూ కోర్టు తోసిపుచ్చింది. పామాయిల్ దిగుమతుల్లో అక్రమాలు జరగలేదు కనుక కేసును కొట్టేయాలని తాను వేసిన పిటిషన్‌ను త్రిస్సూర్ విజినెల్స్ కోర్టు తోసిపుచ్చడంతో ప్రభుత్వం హైకోర్టులో అప్పీలు వేసింది. దీన్ని మూడు నెలల్లోగా పరిష్కరించాలని సుప్రీం కోర్టు గత సెప్టెంబర్‌లో హైకోర్టును ఆదేశించింది. 1991-92లో అప్పటి కరుణాకరన్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మలేసియా నుంచి ఎక్కువ ధరకు పామాయిల్ దిగుమతి చేసుకోవడంతో ఖజానాకు రూ. 2.3 కోట్ల నష్టం వచ్చినట్లు ఆరోపణలన్నాయి. ప్రస్తుత సీఎంచాందీ ఆనాడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. నియామకాన్ని ఈ కేసు పెండింగ్‌లో ఉండడంతో సుప్రీం కోర్టు రద్దు చేసింది.
కేరళ సర్కారుకు ఎదురుదెబ్బ
Published Fri, Jan 9 2015 6:39 AM | Last Updated on Sat, Sep 2 2017 7:27 PM
Advertisement
Advertisement