
'చంద్రబాబుకు పిచ్చి ఎక్కువైంది'
అధికార తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం దారుణమని చిత్తూరు జిల్లా పూతలపట్టు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ విమర్శించారు.
చిత్తూరు: అధికార తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం దారుణమని చిత్తూరు జిల్లా పూతలపట్టు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పిచ్చి ఎక్కువైందని, ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించాలని అన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలను చూసే ప్రజలు మమ్మల్ని గెలిపించారని చెప్పారు. ప్రతిపక్షం ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానం ఓటింగ్‌లో పాల్గొనకుండా ఉంటే ముందస్తుగా రూ.10 కోట్లు ఇవ్వడంతో పాటు తర్వాత రూ.5 కోట్ల రూపాయల మేర పనులు అప్పగిస్తామని తనకు టీడీపీ వర్గాల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని సునీల్ కుమార్ వెల్లడించారు.