మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సునీల్ అరెస్ట్
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సునీల్ అరెస్ట్ అయ్యాడు. సునీల్‌తో పాటు అతడి గ్యాంగ్‌ను అనంతపురం పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి స్కార్పియో, ఇండికా, 5 కొడవళ్లతో పాటు రూ.30 వేలు స్వాధీనం చేసుకున్నారు. సునీల్‌పై పీడీ యాక్ట్ నమోదు చేయాలని కలెక్టర్‌ను కోరనున్నట్లు ‘అనంత’ ఎస్పీ రాజశేఖర్ బాబు తెలిపారు.
అనంతపురం క్రైం : మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మండ్ల సునీల్‌కుమార్ అలియాస్ సునీల్ ఎట్టకేలకు పోలీసులకు దొరికాడు. డబ్బు కోసం కిడ్నాప్, హత్యలు, బలవంతపు వసూళ్లకు దిగుతున్న ఇతడితో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం ఎస్పీ రాజశేఖర్‌బాబు వెల్లడించారు. ఇటీవల అనంతపురం జిల్లా నార్పలలో ఎరువుల వ్యాపారి ప్రసాద్‌శెట్టి అలియాస్ శ్రీనివాస్ శెట్టి కిడ్నాప్‌తో పాటు పలు కిడ్నాప్, హత్యలు, హత్యాయత్నాలు, బలవంతపు వసూ ళ్లు, ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి సునీ ల్‌పై అనంతపురం, వైఎస్‌ఆర్, కర్నూలు జిల్లా ల్లో 14 కేసులు ఉన్నాయి.
ఇంజనీరింగ్ విద్యార్థులను చేరదీసి వారిని జల్సాలకు అల వాటు చేయడం.. వారిని నేరాలకు పాల్పడేలా చేయడంలో సునీల్ సిద్దహస్తుడు. ఇలా ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్ నాశనం చేశారు. ఈ క్రమంలో అదనపు ఎస్పీ టి.రామప్రసాదరావు పర్యవేక్షణలో ఇటుకలపల్లి సీఐ శ్రీనివాసులు, నార్పల ఎస్‌ఐ శేఖర్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు అతడిపై నిఘా ఉంచి ముఠాను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో సునీల్, కడప నగరానికి చెందిన లాయం హరి నాథ్, షేక్ హుసేన్‌బాషా, పక్కీర్లగార్ల సునీల్‌కుమార్, మైదుకూరుకు చెందిన జెన్నే మురళీకృష్ణ ఉన్నా రు. ఈ ముఠా నుంచి స్కార్పియో, టాటా ఇండికా కారు, ఐదు వేటకొడవళ్లు, రూ.30 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఎర్ర చందనం అక్రమ రవాణాతో సునీల్ నేర ప్రస్థానం మొదలు
ప్రొద్దుటూరుకు చెందిన సునీల్ కొన్నేళ్లుగా పులి వెందులలో ఉంటున్నాడు. ఇతడి తండ్రి వెంకట రమణ 2011కు ముందు అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. డిగ్రీ వరకు చదువుకున్న సునీల్.. తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. అయితే అనతి కాలంలోనే డబ్బు సంపాదించాలన్న ఆశతో నేర ప్రవృత్తి వైపు మళ్లాడు. ఈ క్రమంలో 2011లో కర్నూలు జిల్లా కోవెలకుంట్లలో ఎర్రచందనం అక్రమ రవాణాతో నేర జీవితాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత కిడ్నాప్‌లు,హత్యలు, హత్యాయత్నాలు, బలవంతపు వసూళ్లకు దిగాడు. 2013లో తాడిపత్రి పట్టణానికి చెందిన మెడికల్ షాపు యజ మానిని తన ముఠాతో కలిసి కిడ్నాప్ చేశాడు.
డబ్బు ఇవ్వలేదనే కారణంతో అతడిని కర్నూలు జిల్లా జలదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతానికి తీసుకెళ్లి దారుణంగా హతమార్చా రు. ప్రొ ద్దుటూరులో ఒక హత్యాయత్నం, ఐదు కిడ్నాప్ కేసులు, రాజంపేటలో ఒక కిడ్నాప్ కేసు, సింహాద్రిపురంలో ఆయుధాలు కల్గి ఉన్న కేసు, మైదుకూరులో బెదిరింపులు, బలవంతపు వ సూళ్ల కేసు, అనంతపురం జిల్లా కదిరి, నార్పల పోలీస్‌స్టేషన్లలో రెండు కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి.
పోలీసులకు చిక్కకుండా కోర్టులో లొంగిపోయేందుకు ప్రయత్నిస్తున్న సునీల్ గ్యాంగ్‌ను సోమవారం నార్పల మండలం బం డ్లపల్లి వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా సునీ ల్ బయట ఉంటే సమాజానికి ప్రమాదకరంగా మారతాడని భావించి అతడిపై పీడీ యాక్టు నమోదుకు పోలీసులు కలెక్టర్‌కు నివేదించారు.