Rajasekhar Babu
-
ప్రేమించాలని వేధించి.. కాదంటే చంపేశాడు
నగరంపాలెం (గుంటూరు ఈస్ట్): మెకానిక్‌గా పనిచేసిన శశికృష్ణ తనను ప్రేమించాలని నల్లపు రమ్య వెంటపడ్డాడని, ఆమె తిరస్కరించడంతో హత్యచేశాడని ఏపీలోని గుంటూరు రేంజ్ ఇన్చార్జి డీఐజీ రాజశేఖర్‌బాబు వెల్లడించారు. ఆ ప్రేమోన్మాదిని గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేశామన్నారు. ఆదివారం ఉదయం గుంటూరులో నడిరోడ్డుపైనే ఈ హత్య జరిగిన విషయం తెలిసిందే. పోలీసులు సోమవారం ఈ ఘటన వివరాలు వెల్లడించారు. హంతకుడు కుంచాల శశికృష్ణతో రమ్యకు ఆరునెలల కిందట ఇన్‌స్ట్రాగామ్ ద్వారా పరిచయమైందని తెలిపారు. గతంలో మెకానిక్‌గా పనిచేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్న శశికృష్ణ.. కొద్దిరోజులుగా తనను ప్రేమించాలని రమ్య వెంటపడ్డాడని, దీంతో ఆమె మాట్లాడటం మానేయడంతో కక్ష పెంచుకున్నాడని వివరించారు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం ఆమె వెంటపడ్డాడని, ఆమె అభ్యంతరం చెప్పడంతో.. తన వెంట తెచ్చుకున్న కత్తితో పొట్ట, మెడపై ఆరుచోట్ల పొడిచాడని తెలిపారు. రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతున్న రమ్యను ఆమె అక్క మౌనిక గుంటూరు జీజీహెచ్‌కు తీసుకెళ్లిందని.. అప్పటికే రమ్య మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారని వెల్లడించారు. మృతురాలి తండ్రి వెంకటరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఆదివారం రాత్రి 8 గంటలకు నరసరావుపేట పరిధిలోని ములకలూరు గ్రామపొలాల్లో ఉన్న శశికృష్ణను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. హత్యకు వాడిన కత్తిని స్వాధీనం చేసుకుని, నిందితుడిని కోర్టులో హాజరుపరిచామని వివరించారు. రమ్య హత్య కేసుకు సంబంధించి పోలీసులపై పలు రాజకీయపక్షాలు చేస్తున్న ఆరోపణలు సరికాదని స్పష్టం చేశారు. రమ్య కుటుంబానికి రూ.10 లక్షల చెక్కు అందజేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళల భద్రత విషయంలో ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. ప్రేమోన్మాది దాడిలో మరణించిన రమ్య కుటుంబానికి ఆమె రూ.10లక్షల సాయం చెక్కును సోమవారం అందజేశారు. రమ్య కుటుంబానికి అండగా ఉండాలని సీఎం వైఎస్ జగన్ సూచించారని చెప్పారు. టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేశ్ శవ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మండిపడ్డారు. -
నిరంతరం అప్రమత్తం
అనంతపురం సెంట్రల్ : ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులో ఎన్కౌంటర్ నేపథ్యంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని క్విక్ రెస్పాన్స్ టీం, అంగరక్షకులను ఎస్పీ రాజశేఖర్‌బాబు ఆదేశించారు. బుధవారం స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో వీరికి ఎస్ఐబీ, గ్రేహాండ్స్ విభాగాల్లో అనుభవజ్ఞులతో శిక్షణ ఇప్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్రంలో మావోయిస్టు పార్టీని సమూలంగా తుడిచిపెట్టిన ఘనత రాష్ట్ర పోలీసులకు దక్కుతుందన్నారు. ఇటీవల ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనాయకులు మృతి చెందిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు అందాయన్నారు. ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలకు పటిష్ట భద్రత కల్పించి వారికి రక్షణ కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ మాల్యాద్రి, డీటీసీ డీఎస్పీ ఖాసీంసాబ్, ఏఆర్ డీఎస్పీ చిన్నికృష్ణ, స్పెషల్‌బ్రాంచ్ సీఐలు రాజశేఖర్, యల్లంరాజు తదితరులు పాల్గొన్నారు. నిఘా కట్టుదిట్టం అంతకుముందు ఎస్పీ రాజశేఖరబాబు మడకశిర, హిందూపురం సర్కిల్ స్టేషన్లను తనిఖీ చేశారు. అనంతరం ఆయాచోట్ల విలేకరులతో మాట్లాడారు. నేరాల నివారణకు నిఘాను కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 1000 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నామన్నారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో పలు చోట్ల మట్కా ఇతర అసాంఘిక కార్యకలాపాలను నివారించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలోని 600 పోలీస్ కానిస్టేబుళ్ల పోస్టులు భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. -
నకిలీ పాస్ పుస్తకాల కేసు దర్యాప్తు ముమ్మరం
అనంతపురం: నకిలీ పాసు పుస్తకాల కేసులో దర్యాప్తు ముమ్మరం చేసినట్టు అనంతపురం జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు శుక్రవారం తెలిపారు. ఈ కేసులో ఇప్పటిదాకా 28 మందిని అరెస్టు చేశామని.. ఇంకా 9 మంది పరారీలో ఉన్నారని ఆయన చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 19 మండలాల్లో నకిలీ పాసు పుస్తకాల చెలామణి అయినట్టు పోలీసులు గుర్తించారు. నకిలీ పాస్ పుస్తకాల ద్వారా అక్రమంగా 1187 మంది బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నట్టు సమాచారం. ఏఎస్పీ ఆధ్వర్యంలో ఈ వ్యవహారంపై ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్టు రాజశేఖర్ బాబు మీడియాకు వెల్లడించారు. -
సుజాతది ఆత్మహత్యే..
అనంతపురం క్రైం : ఏడాదికి పైగా మిస్టరీగా మిగిలిపోయిన న్యాయవాది ఎర్రిస్వామి భార్య సుజాత మిస్సింగ్ కేసు చిక్కుముడి దాదాపు వీడింది. జిల్లా ఎస్పీ ఎస్వీ రాజశేఖర్‌బాబు ఈ కేసును తీవ్రంగా పరిగణించడంతో దర్యాప్తు ముగింపు దశకు చేరుకుంది. గుర్తు తెలియనిదిగా పూడ్చిపెట్టిన సుజాత శవాన్ని మంగళవారం తహశీల్దారు సమక్షంలో వెలికితీసి వైద్య నిపుణుల బృందం రీపోస్టుమార్టం నిర్వహించింది. మృతదేహం ఎముకలు, ఎముకల మజ్జ సేకరించారు. వాటిని డీఎన్ఏ పరీక్షల కోసం హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపనున్నారు. అక్కడి నుంచి వచ్చే నివేదిక ఆధారంగా ఈ కేసు పూర్తికానుంది. ఇప్పటిదాకా పోలీసులకు లభించిన ఆధారాలు, ఆనవాళ్లను పరిశీలిస్తే సుజాత రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారణకు వచ్చారు. వివరాలను ఎస్పీ రాజశేఖర్‌బాబు మంగళవారం విలేకరులకు వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘ఎర్రిస్వామికి 14 ఏళ్ల కిందట కంబదూరు మండలం మరిమేకలపల్లికి చెందిన సుజాతతో వివాహమైంది. వీరికి అమృతకర్, వర్షిత్కర్ అనే కుమారులు ఉన్నారు. జిల్లా కేంద్రంలోనే ఉండేవారు. ఖర్చులకు సరిపడా సంపాదన లేకపోవడంతో భార్యభర్తలిద్దరూ తరచూ గొడవపడేవారు. ఈ క్రమంలో రెండుసార్లు భర్తకు తెలీకుండా సుజాత పుట్టింటికి వెళ్లింది. ఇదే తరహాలో గతేడాది అక్టోబరు 29న కన్పించకుండా పోయింది. అదే ఏడాది నవంబరు 26న ఆమె తండ్రి బోయ చిన్న ఈరన్న కంబదూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. ఈ క్రమంలో అదే ఏడాది అక్టోబరులో ఓ గుర్తు తెలియని మహిళ శవం అనంతపురం సమీపంలోని నేషనల్ పార్కు వద్ద రైలుపట్టాలపై పడిఉంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. శవం ఫోటోలను కంబదూరు పోలీసులకు ఇచ్చి గుర్తు పట్టమన్నారు. అయితే ఫోటోల్లో ఉన్న శవానికి నల్లటి గ్రీస్ అంటి ఉండడంతో గుర్తుపట్టేందుకు వీలు లేకుండా పోయింది. సుజాత భర్త ఎర్రిస్వామి తన భార్య అదృశ్యంపై కొందరి వ్యక్తులపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు విన్నవించాడు. కేసును కంబదూరు పోలీస్‌స్టేషన్ నుంచి అనంతపురం టూటౌన్‌కు మార్చాలని విజ్ఞప్తి చేశాడు. దీంతో కేసును ఇక్కడికి బదిలీ చేసి దర్యాప్తు ప్రారంభించాం. ఈ నేపథ్యంలో నేషనల్ పార్కు సమీపంలో రైలు కింద పడి మృతి చెందిన గుర్తు తెలియని మహిళ శవానికి, సుజాతకు పోలికలు పరిశీలించాం. ఇదే కోణంలో దర్యాప్తు సాగింది. మృతదేహంపై ఉన్న గాయాలను బట్టి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు (యూంటీమార్టం.. అంటే చనిపోక ముందు గాయూలు లేవని) పోస్టుమార్టం నివేదిక ద్వారా వెల్లడైంది. మృతురాలి చెంపపై పుట్టుమచ్చ ఉంది. సుజాత ఫైల్ ఫోటోలను పరిశీలించగా పుట్టుమచ్చ సరిపోయింది. ఆమె ధరించిన చెవి కమ్మకు.. శవం వద్ద లభ్యమైన చెవికమ్మకు పోలిక ఉంది. వీటి ఆధారంగా ఆ శవం సుజాతదేనని ప్రాథమిక నిర్ధారణకు వచ్చామ’ని ఎస్పీ తెలిపారు. కాగా సుజాత అదృశ్యం వెనుక కొందరు బీజేపీ నాయకుల ప్రమేయమున్నట్లు ఆరోపణలు వచ్చాయన్నారు. ఈ కోణంలో కూడా దర్యాప్తు చేశామన్నారు. సుజాత ఉపయోగించిన సెల్‌ఫోన్ కాల్స్ డిటేల్స్‌ను తెప్పించి విశ్లేషించామన్నారు. ఇందులో బీజేపీ నాయకుల ప్రమేయం లేదని తేలిందన్నారు. సమగ్ర దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. -
అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం
కళ్యాణదుర్గం రూరల్ : అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ ఎస్.వి.రాజశేఖర్‌బాబు తెలిపారు. కళ్యాణదుర్గం పోలీస్ సర్కిల్ కార్యాలయ ఆవరణలో మంగళవారం ‘పోలీస్ ప్రజాబాట’ నిర్వహించారు. సబ్ డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 73 మంది ఎస్పీకి అర్జీలు సమర్పించారు. ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి, ఆర్డీఓ మలోల హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘పోలీస్ ప్రజాబాట’, విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ కర్ణాటక కేంద్రంగా చేసుకుని అసాంఘిక శక్తులు, అంతర్రాష్ర్ట ముఠాలు ‘అనంత’లో అనేక సంఘటనలకు పాల్పడుతున్నాయన్నారు. ఈ ముఠాలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించామన్నారు. త్వరలోనే వీటి ఆట కట్టించి.. జిల్లాలో శాంతియుత వాతావరణం నెలకొల్పుతామన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఇసుక మాఫియాను అరికట్టేందుకు ప్రజలు సహకరించాలన్నారు. ఇసుక అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెంచామన్నారు. గ్రామ పోలీస్ వ్యవస్థను పటిష్టం చేస్తామని చెప్పారు. గ్రామానికి ఒక కానిస్టేబుల్‌ను నియమించామని, ఆ గ్రామంలో చోటు చేసుకునే సంఘటనలకు ఆ కానిస్టేబులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో నిర్లక్ష్యం చేస్తే పోలీసు అధికారులపై చర్యలు తప్పవన్నారు. జిల్లాలో 101 సమస్యాత్మక గ్రామాలను గుర్తించామన్నారు. డీఎస్పీ నెలకోసారి, సీఐ 15 రోజులకోసారి, ఎస్ఐ వారానికోసారి గ్రామాలను సందర్శించి అక్కడ చోటు చేసుకుంటున్న సంఘటనలను సభల ద్వారా సమీక్షించాల న్నారు. పది రోజులకొకసారి గ్రామాల్లో పోలీస్ ప్రజాబా ట నిర్వహించాలని ఎస్ఐలకు సూచించారు. భూ వి వాదాలు, అసాంఘిక కార్యాకలాపాలు, ఫ్యాక్షన్, దోపిడీలు, దొంగతనాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. రాజకీయ జోక్యాన్ని అరికట్టండి ప్రభుత్వ కార్యకలాపాల్లో రాజకీయ పార్టీ నేతల జోక్యాన్ని అరికట్టాలని వైఎస్సార్సీపీ సమన్వయకర్త తిప్పేస్వామి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నేతలు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు, చౌకడిపో డీలర్లను అక్రమ తొలగింపజేయిస్తూ కక్షలు రేపుతున్నారని ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారని, కౌంటర్ కేసులూ బనాయిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
సెటిల్మెంట్లు చేస్తే రౌడీషీట్ తెరుస్తాం
ధర్మవరం : జిల్లాలో సెటిల్మెంట్లు, పంచాయితీ లు ఎవరు చేసినా, అవి తన దృష్టికి వచ్చినట్లయితే అలాంటి వారిపై రౌడీషీట్ తెరుస్తామని ఎస్పీ రాజశేఖర్‌బాబు హెచ్చరించారు. సోమవారం ధర్మవరం పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలోని సమస్యలు తెలుసుకునేందుకు స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్వహించిన పోలీసు ప్రజాబాటలో ధర్మవరం ఏఎస్పీ అభిషేక్ మహంతితో కలసి ఎస్పీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యం గా ధర్మవరంలాంటి ప్రాంతంలో బయటి వ్యక్తులు పంచాయితీలు, సెటిల్మెంట్లు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి వారి కదలికలపై నిఘా ఉంచుతామన్నారు. మట్కా, దొంగనోట్ల చలామణి, తదితర నేరాలపైనా గట్టి నిఘా ఉంచుతామన్నారు. ఫిర్యాదుదారులు కాళ్లరిగేలా పోలీసు స్టేషన్ల చుట్టూ తిరగకూడదని, వారికి సత్వర న్యాయం చేయాలన్న తలంపుతో ప్రజాబాట నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను నిర్దేశిత తేదీలో పు పరిష్కరిస్తామని రసీదులో నమోదు చేస్తున్నామన్నారు. సంబంధిత స్టేషన్ పోలీసు అధికారి ఫిర్యాదుదారుడి సమస్యను పరిష్కరించిన తరువాత తనకూ సమాచారం అందించేలా చర్యలు చేపట్టామన్నారు. నిర్దేశిత తేదీ లోపు పరిష్కారం కాని సమస్యలపై రివ్యూ కమిటీ వేస్తామని, ఈ కమిటీ సభ్యు లు దీర్ఘ కాల పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించే ందుకు కృషి చేస్తారని ఎస్పీ వెల్లడించారు. తొలుత తాడిపత్రి నియోజకవర్గంలో నిర్వహంచిన ప్రజాబాటలో వచ్చిన ఫిర్యాదులన్నింటినీ పరిష్కరించామన్నారు. హిందూపురంలో వచ్చిన ఫిర్యాదులు పరిష్కార దిశలో ఉన్నాయన్నారు. ఇసుక అక్రమ రవాణాపై నిఘా జిల్లాలోని పెన్నా, చిత్రావతి, మద్దిలేరు ప్రాంతాల నుంచి ఇసుకను అక్రమంగా కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తున్నట్లు గుర్తించామని ఎస్పీ అన్నారు. ఈ అక్రమ తరలింపును అడ్డుకునేందుకు ఆయా ప్రాంతాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తామన్నారు. కేవలం బలహీన వర్గాల వారి ఇళ్ల నిర్మాణం, ప్రభుత్వ అభివృద్ధి పనుల కోసం మాత్రమే ఇసుకను.. అదీ ట్రాక్టర్ల ద్వారా మాత్రమే రవాణా చేసేలా చర్యలు చేపడతామన్నారు. అలాంటి వారు తప్పని సరిగా సంబంధిత మండల పరిధిలోనే ఇసుకను వినియోగించుకోవాలని, అధికారుల అనుమతి తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. ఈ విషయంపై మైనింగ్ శాఖ అధికారులతో ఇప్పటికే చర్చించామన్నారు. జిల్లాలో మూడు ప్రాంతాల్లోనే ప్రైవేటు సైట్లలో ఇసుకను విక్రయించే అనుమతులున్నాయని, వారు కూడా కేవలం రాష్ట్రంలో మాత్రమే విక్రయించుకోవచ్చని అన్నారు. అందులోనూ అక్రమాలు చో టుచేసుకోకుండా లైజన్ ఆఫీసర్లను నియమించి ఇసుక ఎక్కడికి రవాణా అవుతోంద న్న విషయాలపై నిఘా ఉంచుతామని చెప్పారు. మున్సిపాలిటీల్లో ట్రాఫిక్ నియంత్రణపై చర్యలు జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లో ట్రాఫిక్ నియంత్రణతో పాటు భారీ వాహనాలను ఆయా పట్టణాల్లోకి నిర్దేశించిన సమయంలో మాత్రమే వచ్చేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ఎస్పీ తెలిపారు. ధర్మవరంలో పని చేయని నిఘా కెమెరాలను వినియోగంలోకి తెస్తామన్నారు. అనంతరం స్థానిక జర్నలిస్టులు ఎస్పీని ఘనంగా సన్మానించారు. ఇసుక దందాను అడ్డుకోండి : ఎస్పీకి కేతిరెడ్డి వినతి ధర్మవరం: నియోజకవర్గ పరిధిలోని ధర్మవరం, తాడిమర్రి, బత్తలపల్లి, ముదిగుబ్బ మండలాల్లో ఇసుక అక్ర మ రవాణా భారీ స్థాయిలో జరుగుతోందని, దీనిని అరికట్టాలని ధర్మవ రం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఎస్పీ రాజశేఖర్‌బాబును కో రారు. సోమవారం పట్టణంలో నిర్వహించిన పోలీసు ప్రజాబాటలో ఆయ న ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలను ఎస్పీకి వివరించారు. అక్రమార్కులు చిత్రావతి నది నుంచి ఇసుకను డంప్‌లకు తరలిస్తున్నారని, అక్కడి నుంచి రాత్రికి రాత్రే లారీల ద్వారా బెంగళూరుకు రవాణా చేస్తున్నారని చెప్పారు. దీనివల్ల భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని, ఫలితంగా తాగునీరు సైతం లభించక పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక అక్రమ రవాణాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలని కోరారు. ఇక ధర్మవరంలో శాంతిభద్రతల పరిరక్షణ కు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు నిర్వహణ లోపంతో పని చేయడం లేదని, వాటిని పునరుద్ధరించాలని ఎస్పీని వినతి పత్రంలో కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు బగ్గిరి బయపరెడ్డి, శివారెడ్డి, వడ్డేబాలాజీ, కనంపల్లి భాస్కరరెడ్డి, కత్తేకొట్టా కిష్ట, పోతిరెడ్డి, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సునీల్ అరెస్ట్
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సునీల్ అరెస్ట్ అయ్యాడు. సునీల్‌తో పాటు అతడి గ్యాంగ్‌ను అనంతపురం పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి స్కార్పియో, ఇండికా, 5 కొడవళ్లతో పాటు రూ.30 వేలు స్వాధీనం చేసుకున్నారు. సునీల్‌పై పీడీ యాక్ట్ నమోదు చేయాలని కలెక్టర్‌ను కోరనున్నట్లు ‘అనంత’ ఎస్పీ రాజశేఖర్ బాబు తెలిపారు. అనంతపురం క్రైం : మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మండ్ల సునీల్‌కుమార్ అలియాస్ సునీల్ ఎట్టకేలకు పోలీసులకు దొరికాడు. డబ్బు కోసం కిడ్నాప్, హత్యలు, బలవంతపు వసూళ్లకు దిగుతున్న ఇతడితో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం ఎస్పీ రాజశేఖర్‌బాబు వెల్లడించారు. ఇటీవల అనంతపురం జిల్లా నార్పలలో ఎరువుల వ్యాపారి ప్రసాద్‌శెట్టి అలియాస్ శ్రీనివాస్ శెట్టి కిడ్నాప్‌తో పాటు పలు కిడ్నాప్, హత్యలు, హత్యాయత్నాలు, బలవంతపు వసూ ళ్లు, ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి సునీ ల్‌పై అనంతపురం, వైఎస్ఆర్, కర్నూలు జిల్లా ల్లో 14 కేసులు ఉన్నాయి. ఇంజనీరింగ్ విద్యార్థులను చేరదీసి వారిని జల్సాలకు అల వాటు చేయడం.. వారిని నేరాలకు పాల్పడేలా చేయడంలో సునీల్ సిద్దహస్తుడు. ఇలా ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్ నాశనం చేశారు. ఈ క్రమంలో అదనపు ఎస్పీ టి.రామప్రసాదరావు పర్యవేక్షణలో ఇటుకలపల్లి సీఐ శ్రీనివాసులు, నార్పల ఎస్ఐ శేఖర్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు అతడిపై నిఘా ఉంచి ముఠాను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో సునీల్, కడప నగరానికి చెందిన లాయం హరి నాథ్, షేక్ హుసేన్‌బాషా, పక్కీర్లగార్ల సునీల్‌కుమార్, మైదుకూరుకు చెందిన జెన్నే మురళీకృష్ణ ఉన్నా రు. ఈ ముఠా నుంచి స్కార్పియో, టాటా ఇండికా కారు, ఐదు వేటకొడవళ్లు, రూ.30 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎర్ర చందనం అక్రమ రవాణాతో సునీల్ నేర ప్రస్థానం మొదలు ప్రొద్దుటూరుకు చెందిన సునీల్ కొన్నేళ్లుగా పులి వెందులలో ఉంటున్నాడు. ఇతడి తండ్రి వెంకట రమణ 2011కు ముందు అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. డిగ్రీ వరకు చదువుకున్న సునీల్.. తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. అయితే అనతి కాలంలోనే డబ్బు సంపాదించాలన్న ఆశతో నేర ప్రవృత్తి వైపు మళ్లాడు. ఈ క్రమంలో 2011లో కర్నూలు జిల్లా కోవెలకుంట్లలో ఎర్రచందనం అక్రమ రవాణాతో నేర జీవితాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత కిడ్నాప్‌లు,హత్యలు, హత్యాయత్నాలు, బలవంతపు వసూళ్లకు దిగాడు. 2013లో తాడిపత్రి పట్టణానికి చెందిన మెడికల్ షాపు యజ మానిని తన ముఠాతో కలిసి కిడ్నాప్ చేశాడు. డబ్బు ఇవ్వలేదనే కారణంతో అతడిని కర్నూలు జిల్లా జలదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతానికి తీసుకెళ్లి దారుణంగా హతమార్చా రు. ప్రొ ద్దుటూరులో ఒక హత్యాయత్నం, ఐదు కిడ్నాప్ కేసులు, రాజంపేటలో ఒక కిడ్నాప్ కేసు, సింహాద్రిపురంలో ఆయుధాలు కల్గి ఉన్న కేసు, మైదుకూరులో బెదిరింపులు, బలవంతపు వ సూళ్ల కేసు, అనంతపురం జిల్లా కదిరి, నార్పల పోలీస్స్టేషన్లలో రెండు కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. పోలీసులకు చిక్కకుండా కోర్టులో లొంగిపోయేందుకు ప్రయత్నిస్తున్న సునీల్ గ్యాంగ్‌ను సోమవారం నార్పల మండలం బం డ్లపల్లి వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా సునీ ల్ బయట ఉంటే సమాజానికి ప్రమాదకరంగా మారతాడని భావించి అతడిపై పీడీ యాక్టు నమోదుకు పోలీసులు కలెక్టర్‌కు నివేదించారు. -
అర్బన్ ఎస్పీ అవమానించేలా వ్యవహరించారు
తిరుపతి రూరల్ : ఎమ్మెల్యేల నియోజకవర్గ సమీక్షకు పోలీసులు వెళ్లాలన్న నిబంధనలు లేవని తిరుపతి అర్బన్ ఎస్పీ రాజశేఖర్‌బాబు ప్రజా ప్రతినిధులను అవమానించేలా వ్యవహరించారని చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆరోపించారు. తిరుపతిలోని ఓ ప్రయివేట్ హోటల్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రగిరి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తాను తొలిసారిగా నియోజకవర్గ స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశానన్నారు. ఈ సమావేశానికి పోలీసు శాఖ నుంచి ఒక్కరుకూడా హాజరు కాలేదన్నారు. ఇదే విషయం ఎస్పీకి ఫోన్ చేసి చెప్పానన్నారు. ఎమ్మెల్యేల సమీక్షకు పోలీసులు రావాల్సిన పనిలేదని, అలాంటి నిబంధనలేమీ లేవని ఎస్పీ తనకు బదులిచ్చారని చెప్పారు. నిబంధనేమీ లేవని రాతపూర్వకంగా ఇవ్వాలని కోరానన్నారు. నువ్వూ రాతపూర్వకంగా ఇస్తే నేనూ ఇస్తానని ఎస్పీ చెప్పారని తెలిపారు. ఆ మేరకు తాను ఈ నెల 2 న ఎస్పీకి రాతపూర్వకంగా నియోజకవర్గ సమీక్షకు పోలీసులు ఎందుకు రాలేదో తెలియజేయాలని కోరానన్నారు. ‘ఎమ్మెల్యే నియోజకవర్గ సమీక్షకు పోలీసులు హాజరవ్వాలా... వద్దా’ అనే నిబంధన తనకు తెలియదని, నిబంధనల కోసం డీజీపీకి లేఖ రాశానని ఎస్పీ తనకు రెండువారాల తర్వాత రిప్లై ఇచ్చారన్నారు. నిబంధనలు తెలియనప్పుడు సమీక్షకు పోలీసులను పంపాల్సిన పనిలేదని ఎందుకు అన్నారో వివరణ ఇవ్వాలన్నారు. ఎస్పీ ప్రజా ప్రతినిధులను అవమానించే విధంగా వ్యవహరించారన్నారు. ఫోన్లో ఎస్పీకి తనకు మధ్య జరిగిన సంభాషణను పత్రికలకు చెప్పి వార్తలు రాయించడం ఆయనకు తగదన్నారు. అందుకే ఎస్పీకి, తప్పుడు కథనం రాసిన ఓ పత్రికకు నోటీసులు ఇచ్చానని చెప్పారు. అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలి ఓటేరు చెరువుని అన్యాక్రాంతం చేసిన అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి డిమాండ్ చేశారు. పేదలు ఇల్లు కట్టుకోవాలంటే సవాలక్ష రూల్స్ చెప్పే అధికారులు అప్పనంగా కోట్ల విలువ చేసే చెరువును కట్టబెట్టడంపై ఆయన మండిపడ్డారు. అవినీతి అధికారులను తక్షణం సస్పెండ్ చేయాలన్నారు. అవిలాల గ్రామ కంఠంలో ఉన్న ఓటేరు చెరువుకు పట్టాలు ఇవ్వడం వెనుక భారీ మొత్తంలో చేతులు మారాయన్నారు. పట్టాలు, పాస్ పుస్తకాలు ఇచ్చిన స్థలం పక్కాగా చెరువని రెవెన్యూ అధికారులే న్యాయస్థానంలో కేసువేశారని గుర్తు చేశారు. రెండు రోజుల్లో రూ.300 కోట్ల విలువ చేసే చెరువును అమ్మేశారంటే అధికారులు ఏ స్థాయిలో అడ్డదారి తొక్కారో తెలుస్తోందన్నారు. ఓటేరు చెరువు ఒకవేళ చెరువు కాదని తేలితే ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుని పేదలకు పట్టాలివ్వాలని డిమాండ్‌చేశారు. ఈ విషయంపై అసెంబ్లీ, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. -
దాడి చేసింది ఉన్మాది కాదు... చైన్ స్నాచర్!
తిరుమల నడక దారిలో వెళ్తున్న భక్తులపై దాడి చేసింది ఉన్మాది కాదని చైన్ స్నాచర్‌గా అనుమానిస్తున్నట్లు టీటీడీ విజిలెన్స్ అధికారి హన్మంతు వెల్లడించారు. బంగారం, నగదు కోసమే ఆ దాడి చేసి ఉంటాడని తాము భావిస్తున్నామని తెలిపారు. దాడి నేపథ్యంలో పాత నేరస్థుల వివరాలు పరిశీలిస్తున్నామని చెప్పారు. అయితే ఉన్మాది దాడిలో గాయపడిన ఘటనలో దంపతులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని రుయా ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. అన్ని వైద్య పరీక్షలు నిర్వహించామని... అయితే 72 గంటల పాటు ఇద్దరూ అబ్జర్వేషన్లో ఉంచాలని తెలిపారు. అప్పడే ఆ దంపతుల ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత వస్తుందని వైద్యులు సాక్షి మీడియాకు వెల్లడించారు. భక్తులపై దాడి ఘటన దురదృష్ణకరమని టీటీడీ ఈవో ఎం.జి.గోపాల్ వెల్లడించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు తీవ్ర తరం చేసినట్లు తిరుపతి అర్భన్ ఎస్పీ రాజశేఖరబాబు వెల్లడించారు. తిరుమలలో శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు తంజావూర్‌కు చెందిన గోవిందరాజస్వామి దంపతులు కాలినడక ఈ రోజు తెల్లవారుజామున కొండపైకి బయలుదేరారు. ఆ దంపతులు అక్కగార్ల గుడి సమీపంలోకి రాగానే 25 ఏళ్ల యువకుడు వారిపై అకస్మాత్తుగా కత్తితో దాడి చేశాడు. గోవిందరాజస్వామి భార్యపై కత్తితో దూసుకువచ్చాడు. ఆ క్రమంలో ఉన్మాదిని ఆమె భర్త గోవిందరాజస్వామి అడ్డుకోబోయాడు. దాంతో ఆగ్రహించిన ఉన్మాది గోవిందరాజస్వామి గొంతు కోశాడు. ఆ తర్వాత అతడి భార్యపై దాడి చేశాడు.ఆ ఘటనలో దంపతులు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఉన్మాది అక్కడి నుంచి పరారైయ్యాడు. భక్తులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు. -
శేషాచలం అడవుల్లో కొనసాగుతున్న కూంబింగ్!
తిరుమల: ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకునేందుకు శేషాచల అడవుల్లో పోలీసులు కూంబింగ్ కొనసాగిస్తున్నారు. పోలీసులపై గొడ్డళ్లతో ఎర్రచందనం స్మగ్లర్లు దాడికి పాల్పడటంతో ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయినట్టు ఎస్పీ రాజశేఖరబాబు తెలిపారు. స్మగ్లర్లు పోలీసులపై గొడ్డళ్లతో దాడి చేశారు. ఆత్మరక్షణ కోసం జరిపిన పోలీసుల కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు. ఇంకా 100మంది స్మగ్లర్లు ఉన్నట్లు అనుమానంగా ఉంది. శేషాచలం అడవులను స్మగ్లర్ల ఫ్రీజోన్‌గా మారుస్తాం అని ఎస్పీ రాజశేఖరబాబు అన్నారు. -
ఇక యుద్ధమే
=రాళ్లు రువ్వితే కాల్పులకు ఆదేశం =కూంబింగ్ పార్టీకి సూచనలిచ్చిన ఎస్పీ సాక్షి, తిరుపతి : ఎర్రదొంగలపై యుద్ధం చేయడానికి పోలీస్ యంత్రాంగం సన్నద్ధమైంది. దాదాపు 500 మంది పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది కూంబింగ్ నిర్వహించేందుకు శుక్రవారం శేషాచలం అడవులకు బయల్దేరి వెళ్లారు. రాత్రి అటవీ శాఖ కార్యాలయంలో తిరుపతి అర్బన్ ఎస్పీ రాజశేఖర్ బాబు, అదనపు ఎస్పీ ఉమామహేశ్వర శర్మ, సీఎఫ్‌వో రవికుమార్‌లు కూంబింగ్ పార్టీకి సూచనలిచ్చారు. ఆ సమయంలో మీడియాను అనుమతించలేదు. విశ్వసనీయ సమాచారం మేరకు.. వీలైనంత వరకు ఎర్ర కూలీలను అరెస్టుచేసే ప్రయత్నం చేయాలని, రాళ్లు విసిరిన పక్షంలో కాల్పులు జరిపేందుకూ వెనుకాడవద్దని ఆదేశించినట్టు తెలిసింది. కూలీలు ఎక్కడెక్కడ ఉంటారు, వారి జాడలు ఏ విధంగా తెలుసుకోవాలి.. అనే అంశాలపై ఎస్పీ వీరికి వివరించారు. సాయుధ పోలీసులు తిరుపతి అర్బన్, కడప, చిత్తూరుల నుంచి కూంబింగ్‌కు వచ్చారు. చట్టపరిధిలో చేయాల్సింది చేయాలని ఎస్పీ సూచించినట్లు తెలిసింది. ఎస్పీ రాజశేఖర్ బాబు విలేకరులతో మాట్లాడుతూ ‘ఇప్పటి వరకు 342 మంది ఎర్రకూలీలను అరెస్టు చేశాం. దీని వెనుక ఉన్న పెద్దలను అరెస్టు చేస్తాం... మా వద్ద కొన్ని పేర్లు ఉన్నాయి. కూలీలను పంపిస్తున్న మేస్త్రీలు, స్మగ్లర్లు, కింగ్పిన్లనూ వదిలేది లేదురూ. అని అన్నారు. దీని వెనుక ఎవరు ఆర్థికంగా ఆదుకుంటున్నారనే విషయాలపైనా ఆరా తీస్తున్నామని చెప్పారు. మార్గాలను చూపించే వారిని, వాహనాలను సరఫరా చేసే వారిపైనా దృష్టి పెడుతున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ అధికారులను హత్య చేయడం చిన్న విషయం కాదని అన్నారు. అటవీ సంపదను రక్షించడం అటవీ శాఖ బాధ్యత అని, అటవీ సిబ్బందిని ఆదుకోవడం తమ బాధ్యతని తెలిపారు. ఎర్రకూలీలకు ష్యూరిటీ ఇచ్చే వారిపైనా దృష్టి సారిస్తున్నామన్నారు. తమిళనాడులోని తిరునల్వేలి, వేలూరు జిల్లాలకు చెందిన ఎస్పీలతోనూ మాట్లాడుతున్నామని తెలిపారు. అక్కడ నుంచి కూలీలు రాకుండా ఉండేలా, అక్కడి వారికి అవగాహన కార్యక్రమాలు చేపట్టే ఆలోచన ఉందని అన్నారు. అయితే ముందుగా ఈ జిల్లా వారికీ దీనిపై అవగాహన ఉండాలని సూచించారు. ఎర్రకూలీలు సిబ్బందిపై రాళ్ల దాడి చేస్తే కాల్పులు జరపడానికి అనుమతిచ్చినట్టు వెల్లడించారు. మరో మూడు నెలల్లో ఎర్రదొంగలు లేకుండా చేస్తాం : రవికుమార్ శేషాచలం అడవుల్లో ఎర్ర దొంగలను మరో మూడు నెలల్లో పూర్తిగా లేకుండా చేస్తామని కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ రవి కుమార్ అన్నారు. ఆయన ఁసాక్షిరూ.తో మాట్లాడుతూ జనవరి ఒకటో తేదీ నుంచి అటవీ సిబ్బందికి ఫైరింగ్ శిక్షణ ఇస్తామని, ప్రస్తుతానికి పోలీసుల నుంచి ఆయుధాలను తీసుకుంటున్నామని, త్వరలోనే అటవీ సిబ్బందికి వాటిని అందజేస్తామని ఆయన వివరించారు.