నకిలీ పాస్ పుస్తకాల కేసు దర్యాప్తు ముమ్మరం | fake land pass books interragation | Sakshi
Sakshi News home page

నకిలీ పాస్ పుస్తకాల కేసు దర్యాప్తు ముమ్మరం

Published Fri, Jul 17 2015 9:27 AM | Last Updated on Fri, Jun 1 2018 8:31 PM

fake land pass books interragation

అనంతపురం: నకిలీ పాసు పుస్తకాల కేసులో దర్యాప్తు ముమ్మరం చేసినట్టు అనంతపురం జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు శుక్రవారం తెలిపారు. ఈ కేసులో ఇప్పటిదాకా 28 మందిని అరెస్టు చేశామని.. ఇంకా 9 మంది పరారీలో ఉన్నారని ఆయన చెప్పారు.

జిల్లా వ్యాప్తంగా 19 మండలాల్లో నకిలీ పాసు పుస్తకాల చెలామణి అయినట్టు పోలీసులు గుర్తించారు. నకిలీ పాస్ పుస్తకాల ద్వారా అక్రమంగా 1187 మంది బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నట్టు సమాచారం. ఏఎస్పీ ఆధ్వర్యంలో ఈ వ్యవహారంపై ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్టు రాజశేఖర్ బాబు మీడియాకు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement