fake land pass books
-
నకిలీ పాస్ పుస్తకాల కేసు దర్యాప్తు ముమ్మరం
అనంతపురం: నకిలీ పాసు పుస్తకాల కేసులో దర్యాప్తు ముమ్మరం చేసినట్టు అనంతపురం జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు శుక్రవారం తెలిపారు. ఈ కేసులో ఇప్పటిదాకా 28 మందిని అరెస్టు చేశామని.. ఇంకా 9 మంది పరారీలో ఉన్నారని ఆయన చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 19 మండలాల్లో నకిలీ పాసు పుస్తకాల చెలామణి అయినట్టు పోలీసులు గుర్తించారు. నకిలీ పాస్ పుస్తకాల ద్వారా అక్రమంగా 1187 మంది బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నట్టు సమాచారం. ఏఎస్పీ ఆధ్వర్యంలో ఈ వ్యవహారంపై ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్టు రాజశేఖర్ బాబు మీడియాకు వెల్లడించారు. -
నకిలీ పాస్ పుస్తకాల కేసులో ముమ్మర దర్యాప్తు
అనంతపురం: నకిలీ పాసు పుస్తకాల కేసులో ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు. కొద్ది రోజుల క్రితం అనంతపురం జిల్లాలో వేల కొద్దీ నకిలీ పాస్ పుస్తకాలు దొరికిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా గురువారం ముగ్గురు వీఆర్వో లను అదుపులోకి తీసుకున్నారు. అంతే కాకుండా పలు బ్యాంకుల్లో పోలీసులు, రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. -
నకిలీ పాస్‌పుస్తకాల గుట్టురట్టు
-
నకిలీ పాస్‌పుస్తకాల గుట్టురట్టు
అనంతపురం: నకిలీ పాస్‌పుస్తకాల గుట్టురట్టయింది. అనంతపురంలో నకిలీ పాస్‌పుస్తకాలను చెలమణి చేస్తున్న 12 మందిముఠాను బత్తలపల్లి పోలీసులు ఆదవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 1.13 లక్షల విలువ చేసే 17,100 నకిలీ పట్టదారు పాస్ పుస్తకాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా కంప్యూటర్లు, ప్రింటర్లు, ల్యాప్ టాపులు, వేట కొడవలి, స్టాంపులు స్వాధీనం చేసుకున్నట్టుల పోలీసులు తెలిపారు. ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. వీఆర్వో జగన్ మోహన్ రెడ్డితో సహా మరో ఎనిమిది మందిని అరెస్టు చేశామని చెప్పారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో నలుగురు పరారీలో ఉన్నారన్నారు. మరో ముగ్గురు వీఆర్వో పాత్రపై కూడా విచారణ చేపట్టామని ఈ సందర్భంగా ఎస్పీ తెలియజేశారు. ఈ రాకెట్ వెనక ఎవరు ఉన్నా ఉపేక్షించేది లేదని, కఠినంగా శిక్షిస్తామని ఆయన వెల్లడించారు.