
'అంగన్ వాడీ వర్కర్లను విధుల్లోకి తీసుకోవాలి'
నెల్లూరు: తొలగించిన హౌసింగ్ బోర్డు కాంట్రాక్టు ఉద్యోగులు, అంగన్ వాడీ వర్కర్లను విధుల్లోకి తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్రెడ్డి డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నాం కదా అని టీడీపీ ప్రభుత్వం నానా విధాలుగా ప్రజలను ఇబ్బందులు పెడితే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు.
విద్యానగర్లో జరిగిన సీఎం సభలో స్థానిక ఎమ్మెల్యేను అధ్యక్షత వహించనీయకుండా ఏ పదవీ లేని సోమిరెడ్డి కార్యక్రమం నిర్వహించడం ఎమ్మెల్యే హక్కులను కాలరాయడమేనని మరో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మండిపడ్డారు. ప్రొటోకాల్ ఉల్లంఘనపై స్పీకర్కు ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు.