
లండన్: కామన్వెల్త్ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణ పతకం లభించింది. పురుషుల ఈపీ టీమ్ ఈవెంట్‌లో చింగాఖమ్ సింగ్, సునీల్ కుమార్, ఉదయ్‌వీర్ సింగ్, సదాశివన్‌లతో కూడిన భారత జట్టు విజేతగా నిలిచింది.
ఫైనల్లో భారత్ 45–44తో స్కాట్లాండ్‌ను ఓడించింది. మహిళల సేబర్ టీమ్ ఈవెంట్‌లో భవాని దేవి, జగ్మీత్ కౌర్, క్రిస్టీ జోష్నా జోస్, ఖుషీ వబికలతో కూడిన భారత జట్టు కాంస్య పతకాన్ని గెల్చుకుంది. ఇదే టోర్నీలో మహిళల సేబర్ వ్యక్తిగత విభాగంలో భవాని దేవి స్వర్ణ పతకాన్ని సాధించింది.
చదవండి: Ind Vs Zim ODI Series: టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్..