భవానీదేవికి కాంస్యం | Bhavani Devi becomes first Indian fencer to win medal in Asian Championships | Sakshi
Sakshi News home page

భవానీదేవికి కాంస్యం

Published Tue, Jun 20 2023 3:58 AM | Last Updated on Tue, Jun 20 2023 3:58 AM

Bhavani Devi becomes first Indian fencer to win medal in Asian Championships - Sakshi

న్యూఢిల్లీ: భారత ఫెన్సర్‌ భవానీదేవి ఆసియా ఫెన్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో చరిత్ర సృష్టించింది. చైనాలోని వూగ్జీలో జరుగుతున్న ఈ టోరీ్నలో ఆమె కాంస్యం సాధించడం ద్వారా ఈ పోటీల్లో పతకం గెలిచిన తొలి భారత ఫెన్సర్‌గా ఘనతకెక్కింది. సోమవారం జరిగిన సెమీఫైనల్లో (సబ్రే ఈవెంట్‌) 29 ఏళ్ల భవాని 14–15తో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన జేనబ్‌ దేబెకొవా చేతిలో తుదికంటా పోరాడి ఓడింది. ఫలితం నిరాశపరిచినా ఆమె శ్రమకు కాంస్య పతకం లభించింది. ఈ టోర్నీలో భారత ఫెన్సర్‌ సంచలన విజయాలతో సెమీస్‌లోకి దూసుకొచి్చంది.

క్వార్టర్‌ ఫైనల్లో భవాని 15–10తో ప్రపంచ చాంపియన్‌ ఫెన్సర్‌ మిసాకి ఎముర (జపాన్‌)ను కంగుతినిపించింది. మిసాకి గతేడాది కైరోలో జరిగిన ప్రపంచ ఫెన్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించింది. ఈ మేటి ప్రత్యరి్థతో గతంలో తలపడిన ప్రతీసారి ఓటమి పాలైన భవానీ ఈ ఈవెంట్‌లో అద్భుత విజయం సాధించింది. ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత ఫెన్సర్‌ కూడా అయిన భవాని ప్రిక్వార్టర్స్‌లోనూ తనకన్నా మెరుగైన మూడో సీడ్‌ ప్రత్యర్థి ఒజాకి సెరి (జపాన్‌)ని 15–11తో ఓడించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement