Commonwealth Championship
-
కామన్వెల్త్ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం
లండన్: కామన్వెల్త్ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణ పతకం లభించింది. పురుషుల ఈపీ టీమ్ ఈవెంట్లో చింగాఖమ్ సింగ్, సునీల్ కుమార్, ఉదయ్‌వీర్ సింగ్, సదాశివన్లతో కూడిన భారత జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో భారత్ 45–44తో స్కాట్లాండ్ను ఓడించింది. మహిళల సేబర్ టీమ్ ఈవెంట్లో భవాని దేవి, జగ్మీత్ కౌర్, క్రిస్టీ జోష్నా జోస్, ఖుషీ వబికలతో కూడిన భారత జట్టు కాంస్య పతకాన్ని గెల్చుకుంది. ఇదే టోర్నీలో మహిళల సేబర్ వ్యక్తిగత విభాగంలో భవాని దేవి స్వర్ణ పతకాన్ని సాధించింది. చదవండి: Ind Vs Zim ODI Series: టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్.. -
కామన్వెల్త్లో భారత ఫెన్సర్‌కు స్వర్ణం
లండన్: ఇటీవల ముగిసిన కామన్వెల్త్ గేమ్స్‌లో భారత అథ్లెట్లు అదరగొట్టారు. ఇప్పుడు అక్కడే కామన్వెల్త్ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్ జరుగుతుండగా ఇందులోనూ భారత ఫెన్సర్ సత్తా చాటింది. చెన్నైకి చెందిన భవానీ దేవి అద్భుత ప్రదర్శనతో స్వర్ణం నిలబెట్టుకుంది. టైటిల్ నిలబెట్టుకునే క్రమంలో 42వ ర్యాంకర్ భవాని 15–10తో రెండో సీడ్ వెరొనికా వాసిలెవా (ఆస్ట్రేలియా)ను కంగుతినిపించింది. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత ఫెన్సర్‌గా ఘనత వహించిన ఆమె పసిడి పోరులో చక్కని ప్రతిభ కనబరిచింది. ఈ ఏడాది ఆరంభంలో తడబాటుకు గురైన ఆమె ఈ చాంపియన్‌షిప్‌లో మాత్రం నిలకడైన ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకుంది. తొలుత ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ కప్‌లో 23వ స్థానంలో నిలిచి నిరాశ పడింది. అనంతరం జూలైలో కైరోలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. ఈ ఏడాది భవానీ దేవి పాల్గొన్న పదో అంతర్జాతీయ ఈవెంట్ ఈ కామన్వెల్త్ చాంపియన్‌షిప్ కాగా ఇందులో విజేతగా నిలవడం సంతోషాన్నిచ్చిందని ఆమె పేర్కొంది. ‘ఫైనల్ పోటాపోటీగా సాగింది. హోరాహోరీ పోరులో స్వర్ణం గెలుపొందడం ఆనందంగా ఉంది. ఇదే జోరును ఇకపై కొనసాగిస్తాను’ అని భవాని తెలిపింది. -
తెలుగు తేజానికి రజతం
అపియా (సమోవా): తెలుగు తేజం రాగాల వెంకట రాహుల్ కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో రజత పతకంతో మెరిశాడు. పురుషుల 89 కేజీల ఈవెంట్లో పోటీపడిన ఈ గుంటూరు జిల్లా వెయిట్‌లిఫ్టర్ 325 కేజీల బరువెత్తి రెండో స్థానంలో నిలిచాడు. గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ అయిన రాహుల్ క్లీన్ అండ్ జెర్క్‌లో 145 కేజీలు, స్నాచ్‌లో 180 కేజీల బరువెత్తాడు. ఓవరాల్‌గా 325 కేజీలతో రజతం కైవసం చేసుకున్నాడు. మిగతా భారత వెయిట్లిఫ్టర్లలో అజయ్ సింగ్ కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో కొత్త రికార్డు నెలకొల్పి బంగారు పతకం గెలిచాడు. 81 కేజీల కేటగిరీలో పోటీపడిన అజయ్ క్లీన్ అండ్ జర్క్‌లో తన బరువుకు రెండిం తలు ఎక్కువైన 190 కేజీల బరువెత్తి రికార్డు నెలకొల్పాడు. స్నాచ్‌లో 148 కిలోల బరువెత్తి మొత్తం 338 కేజీలతో స్వర్ణం గెలిచాడు. ఈ కేటగిరీలో భారత్‌కే చెందిన పపుల్ చంగ్‌మయ్ రజతం నెగ్గాడు. అతను 313 కేజీల (135+178) బరువెత్తాడు. -
కివీస్ బాక్సర్ కామన్వెల్త్ స్వర్ణం చోరీ
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ బాక్సర్ డేవిడ్ నీకా కామన్వెల్త్ గేమ్స్‌లో సాధించిన స్వర్ణ పతకాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. ఆక్లాండ్‌లో కారులో ఉంచిన ఆ పతకం చోరికి గురైందని అతను వాపోతున్నాడు. గత నెల గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన ఈ క్రీడల్లో హెవీవెయిట్ కేటగిరీలో అతను విజేతగా నిలిచాడు. ‘ఒక యువ అభిమానికి చూపించేందుకు నేను ఆ పతకాన్ని ఇంట్లోంచి బయటకు తీశాను. అది కారులో ఉండగా దొంగిలించారు. అది లేకపోతే నా కెరీర్‌కే విలువుండదు. దయచేసి నా పతకం నాకు ఇచ్చేయండి. నేను చెమటోడ్చి సాధించిన స్వర్ణం తిరిగి నా చేతికందుతుందన్న నమ్మకం నాకుంది’ అని నీకా తెలిపాడు. -
అనీశ్‌కు రజతం
గోల్డ్‌కోస్ట్ (ఆస్ట్రేలియా): కామన్వెల్త్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. పోటీల ఆరో రోజు ఆదివారం భారత్‌కు రజతం, కాంస్యం లభించాయి. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో 15 ఏళ్ల అనీశ్ భన్వాలా రజత పతకం సొంతం చేసుకోగా... నీరజ్ కుమార్ కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. ఫైనల్లో అనీశ్ 26 పాయింట్లు, నీరజ్ 23 పాయింట్లు సాధించి వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఓవరాల్‌గా ఇప్పటివరకు ఈ టోర్నీలో భారత్‌కు 18 పతకాలు వచ్చాయి. -
గ‘గన్’ గురికి రజత పతకం
గోల్డ్‌కోస్ట్ (ఆస్ట్రేలియా): కామన్వెల్త్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. పోటీల మూడో రోజు భారత్ ఖాతాలో మూడు పతకాలు చేరాయి. పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్లో హైదరాబాద్ షూటర్ గగన్ నారంగ్ రజతం నెగ్గగా... యువ షూటర్ స్వప్నిల్ కుసాలే కాంస్యం సాధించాడు. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో అన్నురాజ్ సింగ్ కాంస్యం కైవసం చేసుకుంది. ఫైనల్లో గగన్ 246.3 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానాన్ని సంపాదించగా... స్వప్నిల్ 225.6 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ‘వచ్చే ఏడాది ఇక్కడే జరిగే కామన్వెల్త్ గేమ్స్‌కు ఇది టెస్ట్ ఈవెంట్. ఈ పోటీల ద్వారా ఇక్కడి పరిస్థితులపై అవగాహన కలిగింది. ఫైనల్లో నేనింకా ఎక్కువ పాయింట్లు సాధించాల్సింది’ అని లండన్ ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో కాంస్యం నెగ్గిన గగన్ వ్యాఖ్యానించాడు. 25 మీటర్ల పిస్టల్ ఫైనల్లో అన్నురాజ్ 28 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. భారత్‌కే చెందిన హీనా సిద్ధూ ఐదో స్థానంలో, రాహీ సర్నోబాత్ ఆరో స్థానంలో నిలిచారు. ఇప్పటివరకు ఈ పోటీల్లో భారత్‌కు మొత్తం పది పతకాలు లభించాయి. -
ఒకే ఒక్కడు... 16 రికార్డులు
►వెయిట్‌లిఫ్టర్ రాగాల వెంకట్ రాహుల్ సంచలనం ►కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో రెండు స్వర్ణాలు ►రాహుల్ తమ్ముడు వరుణ్‌కు కూడా పసిడి పతకం గోల్డ్ కోస్ట్ (ఆస్ట్రేలియా): గతంలో జూనియర్‌స్థాయిలో కనబరిచిన ప్రదర్శనను సీనియర్స్థాయిలోనూ పునరావృతం చేస్తూ ఆంధ్రప్రదేశ్ వెయిట్‌లిఫ్టర్ రాగాల వెంకట్ రాహుల్ సంచలనం సృష్టించాడు. కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఈ గుంటూరు జిల్లా లిఫ్టర్ ఒకే రోజు 16 రికార్డులను సవరించడం విశేషం. సీనియర్, జూనియర్ పురుషుల 85 కేజీల విభాగాలలో బరిలోకి దిగిన రాహుల్ రెండు విభాగాల్లోనూ స్నాచ్‌లో 156 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 195 కేజీల బరువెత్తి ఓవరాల్‌గా 351 కేజీలతో విజేతగా నిలిచి రెండు స్వర్ణ పతకాలను దక్కించుకున్నాడు. ఈ ప్రదర్శనతో వచ్చే ఏడాది జరిగే కామన్వెల్త్ గేమ్స్‌కు రాహుల్ అర్హత సాధించాడు. స్నాచ్‌లో 156 కేజీలు ఎత్తిన రాహుల్ సీనియర్ స్థాయిలో వికాస్ ఠాకూర్ (155 కేజీలు) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. క్లీన్ అండ్ జెర్క్‌లో రెండు ప్రయత్నాల్లో 189 కేజీలు, 195 కేజీలు ఎత్తి సీనియర్ స్థాయిలో తన పేరిటే (188 కేజీలు) ఉన్న రికార్డును సవరించాడు. మొత్తం విభాగంలో రెండు ప్రయత్నాల్లో 345 కేజీలు, 351 కేజీలు ఎత్తిన రాహుల్ 341 కేజీలతో తన పేరిటే ఉన్న రికార్డును అధిగమించాడు. ఇక జూనియర్ విభాగంలో రాహుల్ ఆరు రికార్డులు సవరించాడు. స్నాచ్‌లో రెండు ప్రయత్నాల్లో 152 కేజీలు, 156 కేజీలు ఎత్తి వికాస్ ఠాకూర్ (150 కేజీలు) పేరిట ఉన్న రికార్డును దాటేశాడు. క్లీన్ అండ్ జెర్క్‌లో రెండు ప్రయత్నాల్లో 189 కేజీలు, 195 కేజీలు ఎత్తి తన పేరిటే ఉన్న (188 కేజీలు) రికార్డును అధిగమించాడు. మొత్తం విభాగంలో రెండు ప్రయత్నాల్లో 341 కేజీలు, 351 కేజీలు ఎత్తి తన పేరిటే ఉన్న (338 కేజీలు) ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ఇక కామన్వెల్త్ జూనియర్‌స్థాయిలో రాహుల్ ఐదు రికార్డులు అధిగమించాడు. స్నాచ్‌లో 156 కేజీలు ఎత్తి బోడీ సాంటవీ (కెనడా–152 కేజీలు) పేరిట ఉన్న రికార్డును దాటాడు. క్లీన్ అండ్ జెర్క్‌లో రెండు ప్రయత్నాల్లో 189 కేజీలు, 195 కేజీలు ఎత్తి స్టీవెన్ కరి (పాపువా న్యూగినియా–185 కేజీలు) రికార్డును బద్దలు కొట్టాడు. మొత్తం విభాగంలో రెండు ప్రయత్నాల్లో 345 కేజీలు, 351 కేజీలు బరువెత్తి కొజుమ్ తాబా (భారత్–330 కేజీలు) పేరిట ఉన్న రికార్డును సవరించాడు. రాహుల్ సోదరుడు రాగాల వరుణ్ జూనియర్ బాలుర 77 కేజీల విభాగంలో బరిలోకి దిగి స్నాచ్‌లో 124 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 145 కేజీలు ఎత్తి ఓవరాల్‌గా 269 కేజీలతో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. సీనియర్ పురుషుల 77 కేజీల విభాగంలో సతీశ్ (320 కేజీలు) స్వర్ణాన్ని అందించాడు. జూనియర్ పురుషుల 77 కేజీల విభాగంలో అజయ్ సింగ్ (310 కేజీలు)... జూనియర్ మహిళల 69 కేజీల విభాంలో నిరుపమా దేవి (178 కేజీలు)... యూత్ బాలికల 69 కేజీల విభాగంలో నికిత (163 కేజీలు) భారత్‌కు పసిడి పతకాలు అందించారు. యూత్ బాలుర 77 కేజీల విభాగంలో అభిషేక్ (256 కేజీలు) కాంస్య పతకాన్ని గెలుపొందాడు. ఓవరాల్‌గా గురువారం భారత్‌కు 7 స్వర్ణాలు, ఒక కాంస్యం లభించాయి. రాహుల్ - వరుణ్